Telangana

News July 13, 2024

కామారెడ్డి: సూసైడ్ నోట్ రాసి రికార్డు అసిస్టెంట్ సూసైడ్

image

రికార్డు అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన రామారెడ్డిలో చోటుచేసుకుంది. గూడెం గ్రామానికి చెందిన ప్రశాంత్ (28) తాడ్వాయి MRO ఆఫీస్‌లో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కాగా డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్ వేధింపులు భరించలేక చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు DSP నాగేశ్వరరావు తెలిపారు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News July 13, 2024

మెదక్: ఆరుక్వింటాళ్ల నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టు స్వాధీనం

image

కంది మండలం జుల్కల్‌లో ఆరు క్వింటాళ్ల నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టును స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ అశోక్ తెలిపారు. కంది మండలం ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇంద్రకరణ్ ఎస్ఐ విజయ్ కుమార్,  ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ధర్మేందర్ తనిఖీల్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు బయటపడినట్లు చెప్పారు. నకిలీ అల్లం పేస్టును సీజ్ చేసినట్లు తెలిపారు.

News July 13, 2024

శాతవాహన యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించాలి: ఏబీవీపీ

image

శాతవాహన యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అంజన్న డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. శాతవాహన యూనివర్సిటీని గత, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వెనుకబాటుకు గురి చేస్తున్నాయన్నారు. మౌలిక వసతులు కల్పించలేకపోవడం సిగ్గు చేటన్నారు. శాతవాహన యూనివర్సిటీలోని కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని, కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

News July 13, 2024

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో అక్రమంగా డబల్ పెన్షన్లు

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో అక్రమంగా డబల్ పెన్షన్లు తీసుకుంటున్న వారిని అధికారులు గుర్తించారు. ఇటీవల చేపట్టిన సర్వేలో డబల్ పెన్షన్ తీసుకుంటున్న 427 మందిని అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఖజానాను గండి కొడుతూ అక్రమంగా డబల్ పెన్షన్లు తీసుకున్న వారు నగదును తిరిగి చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే అనర్హుల జాబితాను అధికారులు ప్రభుత్వానికి పంపించారు.

News July 13, 2024

లష్కర్‌గూడ‌: సీఎం సభాస్థలిని పరిశీలించిన మంత్రి పొన్నం

image

గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ లష్కర్‌గూడ‌లో ఆదివారం జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే రంగారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. గీత కార్మికుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. అందులో భాగంగానే రేపు కాటమయ్య రక్షణ కవచం కిట్లను పంపిణీ చేయనున్నారు.

కోదాడలో జబర్దస్త్ నటులు వినోద్, అప్పారావు సందడి

image

కోదాడలో శనివారం జబర్దస్త్ నటులు అప్పారావు, వినోద్ సందడి చేశారు. పట్టణానికి చెందిన స్నేహిత ఉమెన్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు మాతంగి శైలజ నివాసంలో జరిగిన ఓ శుభకార్యానికి వారు హాజరయ్యారు. వారిని చూసి అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అనంతరం ఆటపాట నిర్వహించి వారు అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బంధువులు మిత్రులు పాల్గొన్నారు.

News July 13, 2024

గద్వాల: ముగ్గురి విద్యార్థులకు పాముకాటు

image

గద్వాల అర్బన్ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు పాముకాటుకు గురయ్యారు. శనివారం నలుగురు విద్యార్థులు మూత్రవిసర్జనకు బయటికి వెళ్ళారు. అందులో ముగ్గురిపై పాముకాటు వేసింది. ఇది గ్రహించిన మరో బాలుడు పాఠశాల సిబ్బందికి తెలపాడు. వెంటనే పాఠశాల సిబ్బంది వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.

News July 13, 2024

శాతవాహన యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించాలి: ఏబీవీపీ

image

శాతవాహన యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అంజన్న డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. శాతవాహన యూనివర్సిటీని గత, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వెనుకబాటుకు గురి చేస్తున్నాయన్నారు. మౌలిక వసతులు కల్పించలేకపోవడం సిగ్గు చేటన్నారు. శాతవాహన యూనివర్సిటీలోని కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని, కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

News July 13, 2024

MBNR: కాంగ్రెస్‌లోకి MLA.. KTRను కలిసిన BRS నేతలు

image

HYD బంజారాహిల్స్‌లోని నంది నగర్‌లో ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆ పార్టీ గద్వాల జిల్లా నాయకులు ఆంజనేయులు గౌడ్, బాసు హనుమంతు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో ప్రస్తుతం నియోజకవర్గంలోని రాజకీయ పరిమాణాలపై, సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం విషయమై కేటీఆర్ వారికి పలు సూచనలు చేశారు.