Telangana

News July 13, 2024

భద్రాచలం వంతెనకు 60 సంవత్సరాలు

image

భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మించిన పాత వంతెన నేటితో 59 సంవత్సరాల కాలం పూర్తి చేసుకొని 60వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఈ వంతెనను 1965 జులై 13న ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. డాక్టర్ నీలం సంజీవరెడ్డి 1959లో శంకుస్థాపన చేయగా రూ.70 లక్షల వ్యయంతో ముంబైకి చెందిన పటేల్ ఇంజినీరింగ్ కంపెనీ 1965లో పూర్తి చేసింది. నేటికీ చెక్కుచెదరకుండా ఉంది.

News July 13, 2024

కడెం: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

image

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పెద్ద బెల్లాల్ గ్రామానికి చెందిన తుప్ప నరేశ్ (36) కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్య, అప్పుల బాధ తట్టుకోలేక శుక్రవారం సాయంత్రం పురుగు మందు తాగగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం ఆసుపత్రిలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య రజిత, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

News July 13, 2024

NZB: రైస్‌మిల్లులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు

image

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బాలాజీ ట్రేడర్స్ రైస్ మిల్లులో శనివారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ నిఖిల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి సుమారు 80 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు డీటీ వివరించారు.

News July 13, 2024

భద్రాద్రి రామయ్యకు సువర్ణ తులసి అర్చన

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో శనివారం స్వామివారికి సువర్ణ తులసి అర్చన నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

News July 13, 2024

KNR: ‘పిల్లల సంరక్షణకు హెల్ప్ డెస్క్’

image

జిల్లాలోని 18 ఏళ్లలోపు బాలల సంరక్షణకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ నంబర్ 9490881098తో కూడిన కంట్రోల్ రూమ్‌ను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలోని బాల రక్షాభవన్లో ఏర్పాటు చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి తెలిపారు. ఈ నంబర్‌కు అత్యవసరమైన సమయంలో ఫోన్, వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

News July 13, 2024

24న మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

image

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 23న జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ హుస్సేన్ తెలిపారు. ఇంటర్మీడియట్‌లోని అన్ని గ్రూపులలో పాసైన విద్యార్థులు అర్హులన్నారు. ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి కావలసిన రెజ్యూమ్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఫోటో తీసుకొని రావాలని సూచించారు. 7893822745, 9951101545, 9490065269లలో సంప్రదించాలని తెలిపారు.

News July 13, 2024

NZB: గూడ్స్ రైలు కింద పడి హోంగార్డ్ ఆత్మహత్య

image

నిజామాబాద్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు కింద పడి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధికి చెందిన ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్లమ్మ గుట్టకు చెందిన గుమ్మడి దార్ల సంపత్ కుమార్ (నంబర్ 413) శనివారం తెల్లవారుజామున గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు.

News July 13, 2024

జగిత్యాల: ‘స్కాలర్షిప్‌కు అప్లై చేసుకోండి’

image

జగిత్యాల జిల్లాలో ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ చదువుతున్న బీడీ కార్మికుల పిల్లలు స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవాలని బీడీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ డిస్పెన్సరీ డా.శ్రీకాంత్ తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను scholerships.gov.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు. ప్రీ మెట్రిక్ విద్యార్థులు ఆగస్ట్ 31 వరకు, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చన్నారు.

News July 13, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో మాన్యం భూములు మాయం?

image

ఉమ్మడి MBNR జిల్లాలో రాజరిక వ్యవస్థ కొనసాగిన రోజుల్లో దేవాలయాలను నిర్మించిన రాజులు, నిత్య పూజలకు అర్చకుల జీవనోపాధికి అప్పట్లో భూములు ఇచ్చారు. అవి ఇప్పుడు అన్యాక్రాంతమయ్యాయి. MBNRలో 2242.05 ఎకరాలకు గాను 311.18, NGKLలో 4883.15 ఎకరాలకు 1200.81, గద్వాలలో 2873.14 ఎకరాలకు 134.04, వనపర్తిలో 3988.5 ఎకరాలకు 19.21, NRPTలో 1483.24 ఎకరాలకు 111.38 భూమి అన్యాక్రాంతమైందని తెలుస్తుండగా అధికారులు చర్యలు చేపట్టారు.

News July 13, 2024

కాళీ క్రమంలో ఉగ్ర నిత్యగా భద్రకాళి అమ్మవారి అలంకరణ

image

వరంగల్ భద్రకాళి ఆలయంలో శాఖాంభరి ఉత్సవాలు నేటితో ఎనిమిదో రోజుకు చేరాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారు ప్రాతఃకాల విశేష దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే కాళీ క్రమంలో ఉగ్ర నిత్యగా భద్రకాళి అమ్మవారిని అలంకరించి, విశేష పూజలు చేస్తున్నారు. నేడు వారాంతం కావడంతో దేవాలయానికి భక్తులు తరలివస్తున్నారు.