Telangana

News July 13, 2024

BREAKING: గద్వాల జిల్లాలో బీటెక్ స్టూడెంట్ SUICIDE

image

ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధి ఉప్పల్ దొడ్డి నీటి పంపు సమీపంలో ఈరోజు ఉదయం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. అయిజ మండలం ఉప్పల్ క్యాంపు గ్రామానికి చెందిన చెన్నకేశవరావు(26) బీటెక్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈరోజు చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News July 13, 2024

WGL-ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. UPDATE

image

వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. మామునూరు జ్యోతిబాఫులే పాఠశాల ఎదురుగా గుర్తుతెలియని వాహనం ఢీకొని <<13619400>>హోంగార్డు సుధాకర్<<>> దుర్మరణం చెందారు‌. ప్రమాద పరిస్థితిని చూస్తే ఓవర్ లోడ్‌తో వెళ్తున్న లారీ గుద్దినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుధాకర్ శరీరం పూర్తిగా నుజ్జు నుజ్జయ్యింది . పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 13, 2024

WNP: అసైన్డ్ భూములకు ఇచ్చేది లేదు: మంత్రి పొంగులేటి

image

గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను మరోసారి చేయొద్దనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్వహించిన రైతు భరోసా సమావేశంలో మాట్లాడారు. ఫాంహౌస్లు, గుట్టలు, ప్రభుత్వ అసైన్డ్ భూములకు ఈసారి పెట్టుబడి సాయం ఇవ్వొద్దని, పంటలు సాగు చేసుకునే నిజమైన రైతులకే ఇవ్వాలనే ఉద్దేశ్యంతో, అత్యధిక మంది రైతుల అభీష్టం మేరకు ఈ పథకం అమలు చేసేందుకు నిబంధనలు రూపొందిస్తున్నామన్నారు.

News July 13, 2024

లక్ష్మణచందా: సరస్వతీ కెనాల్ పై కూలిన బ్రిడ్జి

image

లక్ష్మణచందా మండలంలోని వడ్యాల్ సమీపంలో గల సరస్వతి కెనాల్ పై ఉన్న ఆయకట్ట బ్రిడ్జి గురువారం కుప్పకూలింది. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరినా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు బ్రిడ్జి కూలిపోవడంతో ఆయకట్టు కింద ఉన్న రైతులు తమ పొలాలకు ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకొని త్వరగా కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

News July 13, 2024

ఆదిలాబాద్: పంచాయతీల్లో పైసల్లేవ్..!

image

జిల్లాలో 468 జీపీలు ఉన్నాయి. పంచాయతీల్లో పైసల్లేకుండా పోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో GPల ఖజానా నిండుకుంది. ఓ వైపు ట్రాక్టర్ల కిస్తీలు పేరుకుపోతుండగా మల్టీపర్పస్ కార్మికులకు నెలల తరబడి జీతాలివ్వలేని దుస్థితి. ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఆదాయం కలిగిన, మేజర్ జీపీలను మినహాయిస్తే చిన్న పంచాయతీల్లో పాలన కార్యదర్శులకు పెనుభారంగా మారుతోంది.

News July 13, 2024

కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం 65.39 లక్షలు

image

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో గల హుండీల ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. 35 రోజులకు గాను ఆలయంలో గల 12 హుండీల ద్వారా వచ్చిన ఆదాయం లెక్కించగా నగదు రూ.65 లక్షల 39 వేల 167 సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 41 గ్రాముల బంగారం, కిలో 850 గ్రాముల వెండి, 38 విదేశీ కరెన్సీలు వచ్చినట్లు పేర్కొన్నారు.

News July 13, 2024

MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొహర్రం సందడి

image

మొహర్రం సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాలలో, పట్టణాలలో పెద్ద పీర్లు, తానే అబ్దుల్లా, ఖాసీం, అలీ అక్బర్ పీర్ల చావిడిలో పీర్లు కొలువు దీరడంతో సందడి నెలకొంది. శుక్రవారం వీటికి చావిడిలో ప్రతిష్టించి, పూజల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. చావిడిల ఎదురుగా అలాయ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 17న ఊరేగింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

News July 13, 2024

మెదక్‌ జిల్లాలో ఊపందుకున్న వరి నాట్లు

image

వర్షాకాలం మొదలు కావడంతో వరినాట్లు జోరందుకున్నాయి. దీంతో గ్రామాల్లో కూలీల కొరత ఏర్పడింది. నాటువేసే సమయం అయిపోతుందనే ఉద్దేశంతో గ్రామాల్లోని కొందరు యూపీ, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీలను పిలిపించి నాట్లు వేయిస్తున్నారు. తక్కువ ఖర్చుతో త్వరగా నాట్లు వేస్తున్న కూలీల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఎకరాకు రూ.4500 చొప్పున తీసుకుని వేగంగా నాటేస్తుండడంతో రైతులు వీరి వైపే మొగ్గు చూపుతున్నారు.

News July 13, 2024

చింతకాని: ఆధార్ అప్‌డేట్ అంటూ.. నగదు స్వాహా

image

ఆధార్ కార్డు అప్‌డేట్ చేస్తానని నగదు దోచుకెళ్లిన ఘటన చింతకాని మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామంలో ఓ వ్యక్తి ఆధార్ కార్డు అప్‌డేట్ చేస్తానని వేలిముద్రలు ద్వారా తమ బ్యాంక్ అకౌంట్‌లో నగదును స్వాహా చేశాడని ఆలస్యంగా గ్రహించి బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News July 13, 2024

బొగత జలపాతం వెళ్లే వారికి సీఐ కీలక సూచన

image

వాజేడు మండలం బొగత జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులకు సీఐ కుమార్ కీలక సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో జలపాతంలో వరద పెరుగుతుందని హెచ్చరించారు. పర్యాటకులు లోతైన ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. గతంలో అనేకమంది భోగత జలపాతంలో మునిగి మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.