Telangana

News July 13, 2024

నడిగూడెం: తెల్లబల్లి గ్రామంలో 50 మంది డెంగ్యూ జ్వరం

image

నడిగూడెం మండలంలోని తెల్లబల్లి గ్రామంలో డెంగ్యూ జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సుమారు 50 మందికి పైనే డెంగ్యూ జ్వరానికి గురై చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాంతకంగా మారక ముందే అధికారులు వైద్య సిబ్బంది స్పందించి ప్రజలు డెంగ్యూ జ్వరాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News July 13, 2024

గాంధారి: ప్రమాదవశాత్తు యువకుడు మృతి

image

విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన గాంధారి మండలం నేరల్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నవీన్ (27) ఇంట్లో ఫ్యాన్ తిరగడం లేదని స్టూల్ వేసుకొని మరమ్మతులు చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు చేతి వేలికి విద్యుత్తు షాక్ తగలడంతో పక్కన ఉన్న గోడపై పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆయన మృతి చెందాడు.

News July 13, 2024

బోగత జలపాతం వెళ్ళేవారికి సీఐ కీలక సూచన

image

వాజేడు మండలం బోగత జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులకు సీఐ కుమార్ కీలక సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో జలపాతంలో వరద పెరుగుతుందని హెచ్చరించారు. పర్యాటకులు లోతైన ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. గతంలో అనేకమంది భోగత జలపాతంలో మునిగి మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News July 13, 2024

NZB: చీర గొంతుకు చుట్టుకొని బాలుడి మృతి

image

ఎడపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఠాణాకలాన్‌కు చెందిన నవదీప్(14) మెడకు ప్రమాదవశాత్తు చీర చుట్టుకోవడంతో మృతి చెందాడని SI వంశీకృష్ణ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. నవదీప్ సామాన్లు సర్దేందుకు చీర సాయంతో సజ్జపైకి ఎక్కాడు. దికే క్రమంలో ప్రమాదవశాత్తు చీర మెడకు చుట్టుకుని ఉరిపడింది. బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

News July 13, 2024

లక్ష్మణచందా: సరస్వతీ కెనాల్ పై కూలిన బ్రిడ్జి

image

లక్ష్మణచందా మండలంలోని వడ్యాల్ సమీపంలో గల సరస్వతి కెనాల్ పై ఉన్న ఆయకట్ట బ్రిడ్జి గురువారం కుప్పకూలింది. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరిన అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు బ్రిడ్జి కూలిపోవడంతో ఆయకట్టు కింద ఉన్న రైతులు తమ పొలాలకు ఎలా వెళ్లి పండించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకొని త్వరగా కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

News July 13, 2024

సంగారెడ్డి: ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసిన ఇద్దరిపై కేసు

image

ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసిన ఇద్దరు మహిళలపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు మాధవి ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్‌కు చెందిన అనూరాధ, జహీరాబాద్‌కు చెందిన మరియమ్మపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసినట్లు సీఐ ఎన్.భాస్కర్ తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్ నర్సు, ఎఎన్ఎం ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని నకిలీ ఉత్తర్వులు ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

News July 13, 2024

గద్వాల: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

image

కుటుంబ కలహాల వల్ల మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాలు మేరకు.. పట్టణానికి చెందిన పద్మ (36)కు కొన్ని రోజులుగా భర్తతో గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో గురువారం రాత్రి మరోసారి గొడవ జరిగింది. దీంతో శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఫిర్యాదులతో కేసు నమోదు చేశామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.

News July 13, 2024

BREAKING.. WGL: రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి

image

మామునూరులో జ్యాతిబాఫులే పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని హోంగార్డు సుధాకర్ మృతి చెందాడు. మామునూరు పీఎస్‌లో విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 13, 2024

వరంగల్: రూ.3 కోట్లు మోసం.. వ్యక్తి అరెస్ట్

image

వరంగల్ ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామానికి చెందిన మధుకర్ అనే వ్యాపారిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. దాదాపు దశాబ్ద కాలంగా శ్రీ కనకమహాలక్ష్మీ ట్రేడర్ పేరుతో వ్యాపారుల నుంచి రూ.3 కోట్లు మోసం చేసినట్లు బాధితుడు జూలూరి కృష్ణమూర్తి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

News July 13, 2024

వ్యవసాయంపై ఆధారపడిన వారికే సాయం: మంత్రి జూపల్లి

image

రాష్ట్రంపై అప్పుల భారం ఎక్కువైనా అన్నదాతలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం రైతు భరోసా సమావేశంలో మాట్లాడుతూ.. అయితే అర్హులైన రైతులు, వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారికి మాత్రమే సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతుల అభిప్రాయాలు సేకరిస్తోందని పేర్కొన్నారు.