Telangana

News July 13, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> నేటి నుంచి సింగరేణి ప్యాసింజర్ రైలు పున: ప్రారంభం  > ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం > ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు > చింతకాని మండలంతో సీపీఎం నేత రామ నరసయ్య సంస్కరణ సభ > ఖమ్మంలో ప్రజానాట్యమండలి శిక్షణా తరగతులు > గోదావరి వరదపై ఉన్నతాధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష > మణుగూరులో సింగరేణి పరిరక్షణకై కార్మికుల దీక్షలు

News July 13, 2024

HYD: గంజాయి జాగ చెబితే రూ.2లక్షలు

image

HYD, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గత కొన్ని రోజులుగా డ్రగ్స్‌పై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్స్‌పై సమాచారం అందించిన వారికి నగదు బహుమతి అందిస్తామని నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. 100 కిలోలకుపైగా గంజాయి నిలువలు, సరఫరా సంబంధించిన సమాచారం ఇస్తే రూ.2లక్షల రివార్డు అందిస్తామన్నారు. గంజాయి ఎక్కడుందనే సమాచారం 8712671111కు వివరాలు ఇవ్వాలన్నారు.

News July 13, 2024

సూర్యాపేట: పర్మిషన్ లేకుండా సెలవు.. కలెక్టర్ సీరియస్

image

సూర్యాపేట జిల్లా సింగిరెడ్డి పాలెం పాఠశాల తనిఖీల్లో భాగంగా ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా సెలవులో ఉన్న HM నరేందర్, టీచర్ శ్రీనివాస్‌పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సీరియస్ అయ్యారు. షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విద్యాశాఖ అధికారిని ఆయన ఆదేశించారు. సమయపాలన పాటించి విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని కోరారు.

News July 13, 2024

రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల

image

పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో రూ.10వేలు జమ చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు భరోసాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని, అసెంబ్లీలో చర్చించిన తరువాతే తుది నిర్ణయం ఉంటుందన్నారు. పప్పు దినుసులతో సహా అన్ని పంటలను మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.

News July 13, 2024

KNR: భ్ర్రూణ హత్యల నిర్ధారణ.. హాస్పిటల్ సీజ్

image

HZBDలో గర్భ విచ్ఛిత్తి ఘటనతో ఇన్‌ఛార్జి DMHO సుజాత స్థానిక మాధవి హాస్పిటల్‌ను శుక్రవారం సీజ్ చేశారు. ఓ యువతి గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు ఆమెను ఈ హాస్పిటల్‌కు తీసుకొచ్చి గర్భవిచ్ఛిత్తి చేయించారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆమె తల్లిదండ్రులతో సహా పలువురిపై కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు.

News July 13, 2024

HYD: త్వరలో నీలోఫర్లో గర్భిణులకు SPECIAL

image

HYDలోని నీలోఫర్ పిల్లల ఆసుపత్రిలో గర్భిణుల కోసం ప్రత్యేకంగా మూడు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టేందుకు HALతో రూ.20.22 కోట్ల ఒప్పందం జరిగింది. రూ.10.20 కోట్లతో భవన నిర్మాణం, వైద్య పరికరాలకు రూ.10.02 కోట్లు ఖర్చు చేయనున్నారు. భవనం పూర్తయితే గైనిక్ ఓపి ప్రారంభమవుతుందని యాంటినెంటల్, 2D, ECHO, అల్ట్రా సౌండ్, మల్టీ పారామీటర్స్ వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తామని డా.ఉషారాణి తెలిపారు.

NZB: ఒకే రోజు రెండు పరీక్షలు..!

image

కమ్మర్‌పల్లికి చెందిన DSC అభ్యర్థిని శ్రీలాస్య సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసింది. అయితే తెలుగు, ఇంగ్లిష్ పోస్టులు వేర్వేరుగా ఉండటంతో రెండింటికి దరఖాస్తు చేసింది. ఈనెల 30న ఉ.9 గంటలకు మహబూబ్ నగర్‌ (TL), మ.2 గం హనుమకొండలో (EN) కేటాయించారు. దీంతో ఆమె పరీక్ష ఎక్కడ రాయాలో సందిగ్దంలో పడింది. కాగా దీనిపై విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. రెండు పరీక్షలు ఒకే చోట రాయోచ్చని తెలిపింది.

News July 13, 2024

HYDలో బీఆర్ఎస్‌ను వీడుతున్నారు!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో‌ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.‌ రాజధానిలో 18 మంది BRS MLAలు గెలిచినా.. ఇప్పటికే ముగ్గురు INCలో చేరారు. మరికొందరు‌ కూడా‌ చేరుతారని హస్తం నేతలు చెబుతున్నారు. దీనికితోడు మున్సిపల్‌ ఛైర్ పర్సన్‌లు, కార్పొరేటర్లు క్యూ కట్టారు.‌ జిల్లా స్థాయిలో‌ కీలక నేతలు‌ జంప్‌ అవడంతో గులాబీ శ్రేణులు‌ అయోమయంలో పడుతున్నారు. శనివారం మరో BRS MLA కూడా‌ పార్టీ మారుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.