Telangana

News July 13, 2024

మెదక్: తాను చనిపోతూ.. నలుగురికి ప్రాణదానం

image

నిజాంపేట మండలం బాచేపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ లైన్‌ఇన్ స్పెక్టర్ శేరి శంకర్ తాను చనిపోతూ నలుగురికి ప్రాణదానం అందించారు. ఆయన ఇంట్లో ప్రమాదవశాత్తు గాయపడగా బ్రెయిన్ డెడ్ అయింది. కిమ్స్ వైద్యులు జీవన్ దాన్ ట్రస్ట్ గ్రీన్ ఛానల్ ద్వారా శంకర్ ఆర్గాన్స్ సేకరించారు. ముందుగానే భార్య పద్మ, కుమారులకు పరిస్థితి తెలిపి అవయవదానంపై అవగాహన కల్పించారు. వారు సహకరించడంతో ఆస్పత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

News July 13, 2024

ధర్మపురి: లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.83,815/- ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ 39,316/-, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.27,350/-, అన్నదానం రూ.17,149/-,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

News July 13, 2024

ఉమ్మడి పాలమూరులో మోస్తారు వర్షం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం నుంచి మోస్తరు వర్షం కురిసింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, కల్వకుర్తి, జడ్చర్ల, కోస్గి, మక్తల్, గద్వాల్, కొడంగల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అనంతరం సిబ్బంది పునరుద్ధరించారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులు సూచించారు.

News July 13, 2024

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే: డీకే అరుణ

image

కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో శంషాబాద్ మల్లిక గార్డెన్స్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

News July 13, 2024

HYD: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఎడ్యుకేషన్ లోన్

image

HYDలో ఎడ్యుకేషన్ లోన్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని SVITలో ఈ క్యాంప్ జరిగింది. జులై 15న షేక్‌పేటలోని నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ (11:30AM), 20న అబిడ్స్‌లోని మెథడిస్ట్ కాలేజీ (11:00AM)లో‌ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని విద్యార్థులు ఈ ఎడ్యుకేషన్ లోన్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SHARE IT

News July 13, 2024

రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల

image

చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం వనపర్తి కలెక్టరేట్‌లో రైతు భరోసాపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రైతులు, రాజకీయ నేతల అభిప్రాయాలు తీసుకొని రైతుభరోసా విధివిధానాలు రూపొందిస్తామన్నారు.

News July 13, 2024

పారదర్శకంగా ‘మహిళా శక్తి’ లబ్ధిదారుల ఎంపిక: కలెక్టర్

image

మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళా శక్తి కార్యక్రమంతో వివిధ యూనిట్ల స్థాపన కోసం పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపికలో వివక్షను ప్రదర్శిస్తూ పొరపాట్లకు ఆస్కారం కల్పిస్తే, సంబంధిత ఏపీఎంలను బాధ్యులుగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 13, 2024

ఎర్ర‌వెల్లిలో హిమాన్షు బర్త్‌డే వేడుక‌ల్లో కేసీఆర్

image

కేటీఆర్ కొడుకు హిమాన్షును బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆశీర్వదించారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ నివాసంలో హిమాన్షు త‌న‌ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. శతమానం భవతి అని తాతయ్య, నానమ్మ హిమాన్షును ఆశీర్వ‌దించారు. హిమాన్షు 19వ ఏట‌ అడుగు పెట్ట‌డంతో..19 కిలోల కేక్‌ను కుటుంబ స‌భ్యులు క‌ట్ చేయించారు. హిమాన్షు పుట్టిన రోజు వేడుక‌ల్లో కేసీఆర్ దంప‌తులు, కేటీఆర్ దంప‌తులు, అమ్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

News July 13, 2024

ఆసిఫాబాద్: ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి: కలెక్టర్

image

కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే శుక్రవారం పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

News July 13, 2024

‘స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోండి’

image

2024 విద్యా సంవత్సరానికి గాను విదేశాల్లో ఉన్నత విద్య కోసం క్రైస్తవ మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించనుంది. అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా ఈనెల 8 నుండి ఆగస్టు 7లోపు అప్లై చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి కే సంజీవరావు ప్రకటించారు. అప్లై చేసిన కాపీలను రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఆగస్టు 27 లోపు జిల్లా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.