Telangana

News July 12, 2024

ఎర్ర‌వెల్లిలో హిమాన్షు బర్త్‌డే వేడుక‌లు..ఆశీర్వదించిన కేసీఆర్

image

కేటీఆర్ కొడుకు హిమాన్షును బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆశీర్వదించారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ నివాసంలో హిమాన్షు త‌న‌ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. శతమానం భవతి అని తాతయ్య, నానమ్మ హిమాన్షును ఆశీర్వ‌దించారు. హిమాన్షు 19వ ఏట‌ అడుగు పెట్ట‌డంతో..19 కిలోల కేక్‌ను కుటుంబ స‌భ్యులు క‌ట్ చేయించారు. హిమాన్షు పుట్టిన రోజు వేడుక‌ల్లో కేసీఆర్ దంప‌తులు, కేటీఆర్ దంప‌తులు, అమ్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

News July 12, 2024

భైంసా: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

image

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చాత గ్రామానికి చెందిన చందుల సాయిలు గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై మద్యం మత్తులో పరుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుని కుమారుడు అంజయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు.

News July 12, 2024

టియు: పీజీ పరీక్షలు వాయిదా..

image

టియు & అనుబంధ కళాశాలలో ఈనెల 15 నుండి ప్రారంభమయ్యే పీజీ IV సెమిస్టర్ పరీక్షలు డిఎస్సీ, గ్రూప్-2 పరీక్షల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఏపిఈ, ఐపిసిహెచ్, ఐఎంబీఏ, రెగ్యులర్, బ్యాక్లాగ్, ఎంబీఏ, ఎంసీఏ బ్యాక్ లాగ్ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. కాగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

News July 12, 2024

వరంగల్: స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని కలెక్టరేట్ ఎదుటధర్నా

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని SFI నాయకులు శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. అనంతరం SFI నాయకులు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా AEO కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా కార్యదర్శి యారా ప్రశాంత్, అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ మరియు నాయకులు పాల్గొన్నారు.

News July 12, 2024

హ్యాండ్లూమ్స్ స్పెషల్ ఎక్స్‌పోలో పాల్గొన్న ప్రభుత్వ విప్

image

వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుక్రవారం హైదరాబాద్‌లోని పద్మశాలి బాయ్స్ హాస్టల్ ఆవరణలో మంగళగిరి హ్యాండ్లూమ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాండ్లూమ్ స్పెషల్ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేతన్నల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.

News July 12, 2024

కంది: ఉపాధ్యాయురాలి సస్పెండ్

image

సంగారెడ్డి జిల్లా కందిలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు తన్వీర్ ఫాతిమాను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని దండించారని తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయురాలిపై ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. మండల విద్యాధికారి నివేదిక ఆధారంగా టీచర్‌ను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News July 12, 2024

రామగుండం: పోలీస్ కమిషనరేట్‌లో SIల బదిలీలు

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్సైలు బదిలీ అయ్యారు. రామగుండం SIసతీష్ – NTPC-SIగా, NTPC-SIఉదయ్ కిరణ్‌ని VRకు బదిలీ చేశారు. GDK-1 SI సమ్మయ్య- రామగుండం SIగా, RGM-SI ఉషారాణి VRకు, VRలో ఉన్న బానేష్ – GDK-1Townకు, GDK-SI సౌజన్య- బెల్లంపల్లికి, బెల్లంపల్లి-SIప్రశాంత్‌ను- GDK-1కు బదిలీ చేశారు. మరో ఇద్దరు SIలు బదిలీ అయ్యారు.

News July 12, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజుల సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 2రోజులు సెలవులు రానున్నాయి. శని, ఆదివారాలు వారాంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు గమనించి 2 రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకురావద్దని అధికారులు తెలిపారు. సోమవారం యథావిధిగా మార్కెట్ ప్రారంభమవుతుందని తెలిపారు.

News July 12, 2024

HYD: రూ.5,979 కోట్ల నష్టాల్లో మెట్రో

image

HYD నగరంలో 2017లో ప్రారంభమైన మెట్రో రైలులో 2024 ఫిబ్రవరి వరకు 50 కోట్ల మంది రాకపోకలు సాగించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. అయితే ఆరేళ్లుగా HYD మెట్రో తీవ్ర నష్టాల్లోనే ఉన్నట్లు వివరించారు. 2022 మార్చి 31 నాటికి రూ.4,108.37 కోట్ల నష్టాలు, అలాగే 2023 మార్చి 31 నాటికి రూ.5,424.37 కోట్లకు పెరిగాయని, 2024 మార్చి 31 నాటికి రూ.5,979.36 కోట్లకు చేరినట్లు స్పష్టం చేశారు.

News July 12, 2024

వన మహోత్సవంలో పూర్తి లక్ష్యాలను సాధించాలి: విజయేందిర

image

వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండలాల వారీగా వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన సమావేశంలో వనమహోత్సవం, అమ్మ ఆదర్శ పాఠశాల, ప్రజాపాలన కేంద్రాలు, మహిళా శక్తి కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మొక్కలు నాటి లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.