Telangana

News July 12, 2024

వర్ధన్నపేట: సినిమా థియేటర్‌లో ఘర్షణ.. యువకుడికి కత్తిపోట్లు

image

వర్ధన్నపేటలోని ఓ సినిమా థియేటర్‌లో శుక్రవారం కొందరు వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు పాల్పడ్డారు. ఈ గొడవల్లో విజయ్ అనే యువకుడిపై కత్తితో దాడి చేశారు. సదరు యువకుడికి కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. థియేటర్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News July 12, 2024

PU డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ పరిధిలోని డిగ్రీ 5, 6వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సాయంత్రం OSD మధుసూదన్ రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి రాజ్ కుమార్ విడుదల చేశారు. 6వ సెమిస్టర్ రెగ్యులర్/బ్యాక్ లాగ్ పరీక్షలో 60.55 శాతం ఉత్తీర్ణులు కాగా, 5వ రెగ్యులర్ సెమిస్టర్‌లో 55.44 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. మొత్తం 29 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు చెప్పారు.

News July 12, 2024

ADB: అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

image

అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ద్వార చేపడుతున్న నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలకు రహదారులు కోతకు గురైన వాటి వివరాలు, నిర్మాణ పనుల తీరును ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

News July 12, 2024

HYD: రేపు ఐకానిక్ బిల్డింగ్ ప్రారంభించనున్న CM

image

HYD నగరంలోని JNTUHలో రూ.36 కోట్లతో నిర్మించిన గోల్డెన్ జూబ్లీ ఐకానిక్ భవనాన్ని రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో ఇన్‌ఛార్జ్ వీసీ బుర్రా వెంకటేశం వెల్లడించారు. ప్రారంభోత్సవానికి అన్నింటిని సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

News July 12, 2024

ఆసిఫాబాద్: ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక టీమ్‌లు: ఎస్పీ

image

జిల్లాలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఆసిఫాబాద్, కాగజ్ నగర్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కొరకు జిల్లాలో 10మంది పోలీస్ సిబ్బంది చొప్పున 2టీంలను ఏర్పాటు చేసినట్లు జిల్లా SP,DV.శ్రీనివాస్ రావు తెలిపారు. SP మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ ప్రత్యేక టీంల ద్వారా ప్రతిరోజు వాహనాల తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News July 12, 2024

HYD: రేపు ఐకానిక్ బిల్డింగ్ ప్రారంభించనున్న CM

image

HYD నగరంలోని JNTUHలో రూ.36 కోట్లతో నిర్మించిన గోల్డెన్ జూబ్లీ ఐకానిక్ భవనాన్ని రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో ఇన్‌ఛార్జి వీసీ బుర్రా వెంకటేశం వెల్లడించారు. ప్రారంభోత్సవానికి అన్నింటిని సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

News July 12, 2024

భద్రకాళి వేద పాఠశాలలో దరఖాస్తులు ఆహ్వానం

image

వరంగల్‌లో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ ఆలయ ఆవరణలో గల వేదపాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు EO శేషుభారతి తెలిపారు. మాతృభాషలో చదవగలిగి, రాయగలిగిన 8-12 మధ్య వయస్సు ఉండి ఉపనయన సంస్కారం, ఉపాకర్నోత్సర్జనములు పూర్తైనవారు సంధ్యావందనం, అగ్నికార్యం, బ్రహ్మయజ్ఞంలు కంఠస్థం వచ్చినవారు పాఠశాలలో ప్రవేశానికి అర్హులన్నారు. ఈనెల 13 నుంచి 22వరకు వేద పాఠశాల వద్ద దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

News July 12, 2024

తానూర్: రోడ్డు ప్రమాదంలో విలేకరి మృతి

image

రోడ్డు ప్రమాదంలో విలేకరి మృతి చెందిన ఘటనా శుక్రవారం తానూర్ మండలంలో చోటుచేసుకుంది. స్టానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఎల్వి గ్రామానికి చెందిన ఓ ప్రముఖ పత్రిక విలేకరి గంగ రెడ్డి తన బైక్‌పై హంగీర్గ గ్రామం నుంచి తన స్వగ్రామానికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

News July 12, 2024

పార్టీ తుడిచి పెట్టేయడం ఎవరి తరం కాదు: మాజీ మంత్రి

image

 పార్టీని తుడిచి పెట్టేయడం ఎవరి తరం కాదని..తెలంగాణను సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు మళ్లీ కష్టం వచ్చిందని అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ తుడిచి పెట్టేయడం ఎవరి తరం కాదన్నారు. కన్న తల్లి లాంటి పార్టీని ఎమ్మెల్యేలు వదిలి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

News July 12, 2024

ఈనెల 15న పీయూలో సెమినార్

image

పాలమూరు యూనివర్సిటీలో ఈనెల 15న ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహిస్తున్నామని విభాగపు అధిపతి అర్జున్ కుమార్ తెలిపారు. శుక్రవారం అందుకు సంబంధించిన గోడ పత్రికలను వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మన్నెమోని కృష్ణయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్రాంత ఆచార్యులు డాక్టర్ అచలపతి, గడ్డం నరేష్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి హాజరుకానున్నారని తెలిపారు.