Telangana

News July 12, 2024

సీఎం రేవంత్‌తో భేటీ అయిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ఎమ్మెల్యేలు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. సీఎంను బేటి అయిన వారిలో పినపాక ఎమ్మెల్యే పాయం, అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ఎంపీ RRR లు ఉన్నారు.

News July 12, 2024

షాద్‌నగర్: ఘోర ప్రమాదం.. లారీ కిందపడి వ్యక్తి మృతి

image

షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరులోని Y జంక్షన్‌లో 3 లారీలు ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో లారీ బోల్తాపడటంతో లారీ కింద స్కూటీ ఇరుక్కుపోయింది. స్కూటీపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడిని పెంజర్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసుకు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News July 12, 2024

ఆదిలాబాద్: మహాలక్ష్మి ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన మహాలక్ష్మి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ రాజార్షి షా శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్ శాలువాతో సత్కరించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. సిజినల్ వ్యాధుల ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలను విద్యార్థులకు వివరించారు. ఆయన వెంట అధికారులు తదితరులు ఉన్నారు.

News July 12, 2024

ఆ గ్రామానికి ఏమైంది? నెల రోజుల్లో పదిమంది మృతి

image

సుజాతనగర్ మండలం గరీబ్ పేటలో మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. నెల రోజుల్లో గ్రామంలో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకోగా, ఏడుగురు అనారోగ్యంతో మరణించారు. నెల రోజుల్లోనే పదిమంది మృతి చెందడంతో గ్రామంలో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామానికి శాంతి పూజ చేయించాలని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. అటు గ్రామంపై అధికారులు దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

News July 12, 2024

వేధింపుల కేసులో నిందితుల అరెస్టు

image

మాడుగులపల్లి మండలం చింతలగూడెంలో ఆకతాయి వేధింపులకు గురై <<13605754>>కళ్యాణి <<>>అనే యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కళ్యాణి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వేధింపులకు గురిచేసిన నిందితులు ఆరూరి శివ, కొమ్మనబోయిన మధులను పోలీసులు అదుపులోకి తీసుకొని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

News July 12, 2024

ఆదిలాబాద్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్‌పై అవగాహన

image

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు అనిల్ గోస్వామి, జాట్ వీరి ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్ కొరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఈ నెల 28 వరకు ఉందని తెలిపారు. ఆ తదుపరి అక్టోబర్ 18, 2024న రిటన్ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 12, 2024

వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నకు రికార్డు ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రికార్డు ధర పలుకుతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా నేడు క్వింటా మక్కలు రూ.2,645 పలికింది. దీంతో మక్కలు పండించిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారంలో మక్కల ధరలు చూస్తే.. సోమవారం రూ.2,605, మంగళవారం రూ.2,615, బుధవారం రూ.2,620, గురువారం రూ.2,635 పలికాయి.

News July 12, 2024

సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్ రావు లేఖ

image

సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. బ్రాహ్మణ సంక్షేమాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని హరీశ్‌ రావు విమర్శించారు. సంక్షేమ పరిషత్‌ ద్వారా అమలు చేసే పథకాలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. విద్య, ఉపాధి వంటి పథకాలు ఆగిపోవడం విచారకరమన్నారు. కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ అగమ్యగోచరంగా కావడం బాధాకరమని లేఖలో పేర్కొన్నారు.

News July 12, 2024

ఒడిస్సా సీఎంతో డిప్యూటీ సీఎం భేటీ..!

image

ఒడిశాలోని లోక్‌సేవా భవన్‌లో శుక్రవారం ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌తో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. 2015లో సింగరేణికి కేటాయించిన నైని బొగ్గు గనుల్లో తవ్వకాలు చేపట్టడానికి సహకరించాలని డిప్యూటీ సీఎం కోరారు. దీనిపై ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించారు. అనంతరం సీఎంకు డిప్యూటీ సీఎం సింగరేణికి బొగ్గు బ్లాకుల ఆవశ్యకతను వివరించారు. ఈ భేటీలో సింగరేణి CMD పాల్గొన్నారు.

News July 12, 2024

కొడంగల్: టీచర్లు రాక పాఠశాలకు తాళం

image

ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారులు చదువుకు దూరమవుతున్నారు. పాఠశాలకు హాజరుకాని విద్యార్థులను దారిలో పెట్టాల్సిన టీచర్లే విధులకు ఎగనామం పెట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. శుక్రవారం కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని పాత కొడంగల్ ప్రాథమిక పాఠశాలకు తాళం ఉండడంతో టీచర్ కోసం విద్యార్థులే ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. టీచర్ల రాకపోవడంతో పిల్లలు తిరిగి ఇళ్లకు వెళ్లారు.