Telangana

News July 12, 2024

వనపర్తిలో మొక్కలు నాటిన మంత్రులు

image

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంపై ఉమ్మడి పాలమూరు జిల్లా సాంస్కృతిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా కార్యాలయంలో మంత్రుల మొక్కలు నాటారు.

News July 12, 2024

ADB: వరుస హత్యలు.. రోడ్డున బాధిత కుటుంబాలు..!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన హత్యలను పరిశీలిస్తే ఆస్తి తగదాలు, వివాహేతర సంబంధాలతో పాటు ప్రేమ వ్యవహారాలూ కారణమవుతున్నాయి. ఒకచోట వివాహేతర సంబంధం కారణంగా భార్యను భర్త అంతమొందించగా మరోచోట భర్తను భార్య హత్య చేయించింది. మరోచోట స్థిరాస్తి వివాదంలో రియల్ ఎస్టేట్ వ్యాపారికి నమ్మినబంటే నమ్మించి అతికిరాతంగా నరికి చంపేశాడు. దీంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది.

News July 12, 2024

BREAKING.. వరంగల్ జిల్లాలో మరో హత్య

image

పదహారుచింతల్‌లో జరిగిన హత్య మరవకముందే వరంగల్ జిల్లాలో మరో హత్య జరిగింది. గొర్రెకుంట శివారులో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు ఏపీకి చెందిన మేస్త్రీగా పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం మృతదేహాన్నిఎంజీఎంకు తరలించారు. కాగా, ఈ హత్య దుండగులు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

News July 12, 2024

కొత్తగూడ: ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

image

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజల సమస్యలను అధికారులు పరిష్కరించేందుకు కృషి చేయాలని సీతక్క సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ తదితరులున్నారు.

News July 12, 2024

బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో బీబీనగర్ నాయకులు

image

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాశం భాస్కర్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వారు తెలిపారు.

News July 12, 2024

WNP: మంత్రి మండలి సబ్ కమిటీ సమావేశం

image

రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంపై నియమించిన మంత్రి మండలి సబ్ కమిటీ సమావేశం శుక్రవారం డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ఉన్నతాధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

News July 12, 2024

అశ్వారావుపేట CI, నలుగురు కానిస్టేబుళ్లు సస్పెండ్!

image

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అశ్వారావుపేట ఎస్ఐ శ్రీనివాస్ ఆత్మహత్యకు కారకులైన సీఐ జితేందర్ రెడ్డితో పాటు, నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా SP రోహిత్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ, కానిస్టేబుళ్లు వేధింపులు గురి చేస్తున్నారంటూ, గడ్డి మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎస్ఐ మరణించిన విషయం తెలిసిందే. అటు సీఐ, కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

News July 12, 2024

వరంగల్: అధికంగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు పత్తి ధర రూ.160 పెరిగింది. నిన్న రూ.7,300 పలికిన క్వింటా పత్తి.. నేడు రూ.7,460కి చేరింది. ఈ వారంలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ధరలు మరింత పెరగాలని ఆ దిశగా వ్యాపారులు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

News July 12, 2024

ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలకు అటానమస్..

image

ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా దక్కిందని కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే మొట్టమొదట ఈ హోదా పొందిన ఘనతను సొంతం చేసుకుంది. దీంతో ప్రతి ఏటా రూ.12 లక్షల నిధులు(UGC), రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు, ప్రతి విభాగం బలోపేతం, నూతన కోర్సులు, క్షేత్ర పర్యటనలపై దృష్టి కేంద్రీకరించి ఉద్యోగావకాశాలు పెంచి మహిళా సాధికారతకు పెద్ద పీట వేయనున్నారు.

News July 12, 2024

అలర్ట్: ఆదిలాబాద్: మారిన PG పరీక్ష తేదీలు

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో PG వార్షిక పరీక్షల తేదీలు మారాయని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు జరగాల్సిన PG రెండో సంవత్సర పరీక్షలు AUG 20 నుంచి 25 వరకు జరుగుతాయన్నారు. ఆగస్టు 9 నుంచి 13 వరకు జరగాల్సిన PG మొదటి సంవత్సరం పరీక్షలు SEP 20 నుంచి 25 వరకు జరుగుతాయని వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయం గమనించాలని సూచించారు. SHARE IT