Telangana

News July 12, 2024

వరంగల్: నిన్నటి కంటే రూ.1500 పెరిగిన మిర్చి ధర

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌లో శుక్రవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి.
> ఏసీ తేజ మిర్చి నిన్న క్వింటాకు రూ.నిన్నటిలాగే రూ.18,300 పలికింది.
> ఏసీ 341 రకం మిర్చి సైతం గురువారం లాగే రూ.14,500 పలికింది.
> వండర్ హాట్(WH) మిర్చి మాత్రం గత 2రోజులతో పోలిస్తే భారీగా పెరిగింది. మొన్న రూ.14,800 ధర పలకగా.. నిన్న రూ.15,000కి చేరింది. నేడు మరింత పెరిగి రూ.16,500 అయింది.

News July 12, 2024

MBNR: గృహజ్యోతి పథకంలో లోపాలు సరి చేసేందుకు చర్యలు

image

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహజ్యోతి పథకంలో నెలకొన్న లోపాలను సరి చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. 200 యూనిట్ల లోపు వినియోగించిన కొంతమంది వినియోగదారులకు జీరో బిల్లు రాలేదు దీంతో వారికి అధికారులు మరో అవకాశం ఇచ్చారు. USC నెంబర్ మార్చుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు మేలు జరగనుంది.

News July 12, 2024

మంచిర్యాల: జువెలర్స్ యజమానుల పరారీ..!

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ జువెలర్స్ షాప్ యజమానులు పట్టణ ప్రజలకు రూ.కోట్లలో టోకరా వేసి పరారయ్యారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో సంచలనం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని జువెలర్స్ యజమాని, అతని కుమారుడు కొంతకాలంగా నమ్మకంగా ఉంటూ పలువురు నుంచి బంగారు ఆభరణాలతో పాటు నగదు రూపంలో పెద్ద ఎత్తున అప్పులు చేసి పరారయ్యారని తెలిపారు. గురువారం మొత్తం కుటుంబ సభ్యులు ఇంటిని వదిలి వెళ్ళిపోయారన్నారు.

News July 12, 2024

బడ్జెట్ సమావేశాలపై చర్చించిన బీజేపీ ఎమ్మెల్యేలు

image

రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాదులోని బీజేఎల్పీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ..ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆదిలాబాద్ పాయల్ శంకర్, తదితర ఎమ్మెల్యేలు ఉన్నారు.

News July 12, 2024

పెద్దపల్లి జిల్లాలో 12వ శతాబ్ధం నాటి అరుదైన విగ్రహం

image

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో అరుదైన విగ్రహాన్ని గుర్తించారు. పెద్దపల్లికి చెందిన చరిత్ర పరిశోధకుడు సతీశ్.. ఇటీవల ఆలయాన్ని సందర్శించిన సమయంలో అరుదైన అష్ట మహిషులతో కూడిన విగ్రహాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ విగ్రహం 12వ శతాబ్ధంలో కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదిగా భావిస్తున్నట్లు తెలిపారు.
SHARE

News July 12, 2024

WNP: మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

image

వరనపర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలు(14)పై గురువారం ఆత్యాచారం జరిగిందని సీఐ నాగభూషణం తెలిపారు. అదే గ్రామానికి చెందిన యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పాడ్డారని పేర్కొన్నారు. అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు గ్రామస్థులు గుర్తించి దేహశుద్ధి చేశారు. బాధితురాలి మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

News July 12, 2024

వరంగల్: 24 హత్యలు, 59 హత్యాయత్నం కేసులు

image

వరంగల్ జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. 7 నెలల్లో కమిషనరేట్ పరిధిలో 24 హత్యలు, 59 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాశీబుగ్గ, జులైవాడలో కుటుంబ తగాదాలతో భార్యలను భర్తలు హతమార్చారు. గతనెల 30న అర్థరాత్రి మట్టెవాడలో రోడ్డుపై నిద్రిస్తున్న కూలీని స్థానిక వ్యక్తి హత్య చేశాడు. భూ వివాదంలో బుర్హన్‌పల్లి మాజీ సర్పంచిని దారుణంగా హత్య చేశారు. నిన్న 16చింతల్‌లో దంపతుల హత్య జరిగిన విషయం తెలిసిందే.

News July 12, 2024

ఒడిశాకు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి 

image

మధిర: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఒడిశా బయలుదేరారు. కాగా 2015లో ఒడిస్సా రాష్ట్రంలోని అంగుల్ జిల్లాలోని నైని బొగ్గు గని సింగరేణికి కేటాయించారు. ఈ బొగ్గు గని ప్రారంభం సజావుగా నిర్వహణకు సహకరించాల్సిందిగా కోరేందుకు డిప్యూటీ సీఎం ఒడిశా వెళ్లారు. మరికొద్ది సేపట్లో ఒడిశా సీఎం మోహన్ చరణ్‌తో డిప్యూటీ సీఎం భేటీ అయి బొగ్గు గని ప్రారంభంపై చర్చించనున్నారు.

News July 12, 2024

MBNR: గ్రూప్-1 మెయిన్స్‌కు మైనార్టీ అభ్యర్థులకు శిక్షణ

image

రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్, మైనార్టీ సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ కు ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా ఇన్చార్జి మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఆర్.ఇందిర తెలిపారు. హైదరాబాదులో నిర్వహించే ఉచిత శిక్షణకు ఆసక్తి, అర్హత గల మైనార్టీ అభ్యర్థులు ఈ నెల 19వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ల్యాండ్ ఫోన్ నం. 040-23236112ను సంప్రదించాలని పేర్కొన్నారు

News July 12, 2024

MBNR: RTC కార్గో ఏజెంట్ల కోసం సంప్రదించండి!

image

ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ లాజిస్టిక్ ఏజెంట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏటీఎం రవీందర్ తెలిపారు. ఆసక్తిగల వారు నగర పరిధిలో రూ.5 వేలు,మండల,గ్రామపరిధిలో రూ.వెయ్యి చెల్లించి తీసుకోవాలని,మిగతా వివరాల కోసం పృథ్వీరాజ్ (GDWL,వనపర్తి)-9154298609, శ్రీనివాస్ (SDNR,కల్వకుర్తి)-91542 98615,రాజ్ కుమార్ (MBNR,నారాయణపేట) -91542 98613, శరత్ యాదవ్ (కొల్లాపూర్,NGKL,అచ్చంపేట)-91542 98611 సంప్రదించాలన్నారు.