Telangana

News July 12, 2024

MHBD: మంచం పడుతున్న ఏజెన్సీ ప్రాంతం!

image

MHBD జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల్లోని పలుగ్రామాల ప్రజలు విష జ్వరాలకు వణికిపోతున్నారు. ఇంటికొకరు మంచానికి పరిమితమం అవుతుండటంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏజెన్సీలో ఏ చిన్న జ్వరం వచ్చినా.. టౌన్‌కి రావాల్సి ఉండటంతో రాలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి గ్రామాలు, గూడేల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఏజెన్సీ ప్రజలు కోరుతున్నారు.

News July 12, 2024

కరీంనగర్: మద్యం తాగి వాహనం నడిపితే జైలు

image

మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు కరీంనగర్ కోర్టు జైలు శిక్ష విధించినట్లు కరీంనగర్ ట్రాఫిక్ సీఐ కరీముల్లా ఖాన్ గురువారం తెలిపారు. ముగ్గురికి మూడు రోజుల జైలు శిక్ష, రూ.7,000 జరిమానా విధించారు. మిగతా ఇరవై మందికి రూ.35,500 జరిమానా విధించినట్లు సీఐ కరీముల్లా ఖాన్ వివరించారు.

News July 12, 2024

ఇల్లందు: మహిళ ఆత్మహత్య

image

ఇల్లందు మండల పరిధిలోని లచ్చగూడెం పంచాయతీకి చెందిన ఓ మహిళ గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కోడెం అనసూయ (51) కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. బాధ భరించలేక గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. పరీక్షించిన రైతులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

News July 12, 2024

MBNR: RTC కార్గో ఏజెంట్ల కోసం సంప్రదించండి!

image

ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ లాజిస్టిక్ ఏజెంట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏటీఎం రవీందర్ తెలిపారు. ఆసక్తిగల వారు నగర పరిధిలో రూ.5 వేలు,మండల,గ్రామపరిధిలో రూ.వెయ్యి చెల్లించి తీసుకోవాలని,మిగతా వివరాల కోసం పృథ్వీరాజ్ (GDWL,వనపర్తి)-9154298609, శ్రీనివాస్ (SDNR,కల్వకుర్తి)-91542 98615,రాజ్ కుమార్ (MBNR,నారాయణపేట) -91542 98613, శరత్ యాదవ్ (కొల్లాపూర్,NGKL,అచ్చంపేట)-91542 98611 సంప్రదించాలన్నారు.

News July 12, 2024

తిప్పర్తి: యువతి సూసైడ్.. పరారీలో నిందితులు

image

మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామ పరిధిలోని చింతల గూడేనికి <<13605754>>యువతి <<>>ఆత్మహత్యకు కారణమైన నిందితులు పరారీలో ఉన్నారు. ఇద్దరు యువకులు కళ్యాణిని వేధించడంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతికి కారణమైన యువకులను పట్టుకోవడానికి పోలీసులు 3 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. పోన్ సిగ్నల్స్ ఆధారంగా వారిని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 

News July 12, 2024

FLASH.. ములుగు: లారీ, బస్సు ఢీ.. 15 మందికి గాయాలు

image

ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద లారీ, బస్సు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. హన్మకొండ నుంచి ములుగు వైపు వస్తున్న లారీ, ములుగు నుంచి హన్మకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 15 మందికి గాయాలైనట్లు సమాచారం. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 12, 2024

WGL: కళా తోరణానికి పుష్ప సోయగం

image

జనగామ జిల్లా ముఖద్వారం పెంబర్తి శివారు ఏకశిలా కళా తోరణం వద్ద ఉన్న జాతీయ రహదారుల విభాగిని ముఖ్య కూడళ్లలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన పూలమొక్కలు ఆకట్టుకుంటున్నాయి. రహదారి మీదుగా వెళ్లే ప్రయాణికుల మనసును దోచేలా ఉన్న పూల మొక్కలు, రంగు రంగుల పుష్పసోయగంతో తోరణం కొత్త అందాలను సంతరించుకుంది.

News July 12, 2024

సిద్దిపేట: మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్టు

image

సిద్దిపేట జిల్లాలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటనలో ఒకరిని అరెస్టు చేసినట్లు చేర్యాల సీఐ శ్రీను తెలిపారు. మద్దూరు మండలానికి చెందిన 16 ఏళ్ల బాలికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గీసుకొండ మండలం రెడ్డిపాలెంకు చెందిన కొండేపోగు మధుబాబు (23) కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడినట్టు వివరించారు. ఈ ఘటనలో మధుబాబును నిన్న అరెస్టు చేసినట్లు సీఐ శ్రీను వివరించారు.

News July 12, 2024

బోధన్: విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి

image

సాలంపాడ్ క్యాంపు చెందిన రాంబాబు(36)అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంబాబు గురువారం ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి బోరుబావి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌గురై మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 12, 2024

సింగరేణి నివాస గృహాల ఖాళీ చేసేందుకు కసరత్తు

image

సింగరేణి సంస్థకు సంబంధించిన నివాస గృహాల ఖాళీ చేసేందుకు కసరత్తు చేస్తుంది. రిటైర్డ్ ఉద్యోగులు, విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో తొలగించిన కార్మికులు, సంస్థ గృహాల్లో అనధికారికంగా ఉంటున్న వారిని ఖాళీ చేయించేందుకు యజమాన్యం విజిలెన్స్ విచారణ చేస్తుంది. ఇప్పటికే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలా కాని విషయంలో నివాస గృహాలకు సంబంధించి నీరు, కరెంటు కట్ చేసేందుకు సిద్ధమవుతోంది.