Telangana

News July 12, 2024

హైదరాబాద్‌లో సొరంగ మార్గం కష్టం.?

image

HYDలో టన్నెల్‌ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 45, KBR పార్కు కింద నుంచి 6.30 కిలోమీటర్ల మేర సొరంగాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఇందుకు రూ. 3 వేల కోట్లు అవుతుందని ఓ ఏజెన్సీ జీహెచ్ఎంసీకి నివేదిక సమర్పించింది. దీనికి తోడు జూబ్లీహిల్స్‌ రోడ్ నం. 2లో భూసేకరణ కొంత కష్టమేనని‌ అధికారులు చెబుతున్నారు. టన్నెల్ నిర్మాణంపై ముందుకు వెళుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

News July 12, 2024

కాళేశ్వరం ఆర్థిక అవకతవకలపై దృష్టి!

image

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలపై ఇప్పటివరకు విచారణ జరిపిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌.. ఇకపై ఆర్థిక అవకతవకలపై దృష్టి సారించనుంది. బ్యారేజీలకు తొలుత పరిపాలనాపరమైన అనుమతి ఎంత? మధ్యలో ఎన్నిసార్లు అంచనాలను సవరించారు? వాస్తవ వ్యయం ఎంత? సబ్‌ కాంట్రాక్టర్లకు ఎంతిచ్చారనే కోణంలో విచారణ చేపట్టనున్నారు. ఇందుకుగాను ఒక CAను సమకూర్చాలని కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

News July 12, 2024

SCAM ALERT .. WGL: రూ.50 వేలు ఇస్తే ఉద్యోగ నRయమక పత్రం!

image

డబ్బులిస్తే ANM, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగులకు సైబర్ నేరగాళ్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. అది నిజమనుకొని నిరుద్యోగులు DMHO ఆఫీస్‌కు పరుగులు తీస్తున్నారు. మీ పేరు జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగాల భర్తీ జాబితాలో ఉందని, రూ.50 వేలు ఇస్తే వారంలో నియామక ఉత్తర్వులు అందిస్తామని కాల్ చేస్తున్నారు. అయితే వాటిని నమ్మొద్దని ఫోన్ వస్తే ఫిర్యాదు చేయాలని DMHO వెంకటరమణ స్పష్టంచేశారు.

News July 12, 2024

KGNR: ముగ్గురు విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయురాలు

image

ఆసిఫాబాద్ జిల్లాలో ఓ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వారికి ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే పాఠాలు బోధిస్తోంది. కాగజ్‌నగర్ మండలం నజ్రుల్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక ప్రైమరీ బెంగాలీ పాఠశాలలో ఒకప్పుడు 13 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. ఆరెగూడ పాఠశాలలో పనిచేస్తున్న సంధ్యారాణికి డిప్యూటేషన్ ఇవ్వడంతో ఆమె ఈ పాఠశాలలోని ముగ్గురు విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.

News July 12, 2024

ఖమ్మంలో బయటపడ్డ ఏఆర్ కానిస్టేబుల్ రాసలీలలు..!

image

ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు రాసలీలలు బయటపడ్డాయి. ఏడాది క్రితం కోర్టు విషయంలో త్రివేణి అనే మహిళ కానిస్టేబుల్‌కు పరిచమైంది. చెల్లి అంటూ సదరు మహిళతో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల త్రివేణిపై అనుమానం వచ్చిన భర్త నిలదీయడంతో విషయం బయటపడింది. దీంతో త్రివేణి భర్త పోలీసులను ఆశ్రయించారు. కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని కోరాడు.

News July 12, 2024

NZB: ఆందోళన కలిగిస్తోన్న కుక్కల బెడద

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల దాడిలో గాయపడ్డ వారి సంఖ్య ఆందోళన గలిగిస్తోంది. 2023 డిసెంబరులో నిజామాబాద్ జిల్లాలో382 కుక్క కాటు కేసులు నమోదు కాగా కామారెడ్డి జిల్లలో 56 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరిలో NZBలో 376, KMRలో 32, ఫిబ్రవరిలో NZBలో 326, KMRలో 44, మార్చిలో NZBలో 326, KMRలో 38, ఏప్రిల్ లో NZBలో 335, KMRలో 40, మే నెలలో NZBలో 243, KMRలో 28 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి.

News July 12, 2024

పాలమూరు యువకుడికి ప్రధాని మోదీ లేఖ

image

ప్రధాన మంత్రి మోదీ యువకుడిని ప్రశంసిస్తూ లేఖను పంపించారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా NRPTలో నిర్వహించిన బహిరంగ సభలో అంత్వార్‌కు చెందిన శివ తాను గీసిన శివాజీ మహారాజ్, ప్రధాని మోదీ ఉన్న చిత్రపటాన్ని ప్రదర్శించాడు. చిత్రపటాన్ని PM తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా స్వీకరించారు. దీంతో అభినందిస్తూ ఢిల్లీ నుంచి ప్రశంస పత్రాన్ని పంపించారు. యువకుడు ఆనందం వ్యక్తం చేశాడు.

News July 12, 2024

సిరిసిల్ల: భయపెడుతున్న డెంగ్యూ!

image

ఉమ్మడి KNR వ్యప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. రెండ్రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి(M)లో డెంగ్యూ కేసు నమోదైంది. ఈ  ఏడాది మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. కాగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగ్యూ బారిన పడి చికిత్స పొందుతున్నవారి సంఖ్య లెక్కలోకి రావట్లేదు. జిల్లాలో 17 గ్రామాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 6 ప్రాంతాలను డెంగ్యూ హైరిస్క్‌ ప్రాంతాలుగా వైద్యాధికారులు గుర్తించారు.

News July 12, 2024

ముత్తు పదార్థాల నియంత్రణపై స్పెషల్ ఫోకస్: సీపీ

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రై సిటీలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు, వినియోగం జరిగే ప్రాంతాల వివరాలను పోలీస్ కమిషనర్ ఏసీపీలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు వరంగల్‌లో గంజాయికి సంబంధించి నమోదయిన కేసుల వివరాలను ఆరా తీశారు. డ్రగ్స్ పై కఠినంగా ఉండాలన్నారు.

News July 12, 2024

‘అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి’

image

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో అమ్మ ఆదర్శ పాఠశాల పనుల ప్రగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శపాఠశాల పనులు సకాలంలో ముగించాలన్నారు. కార్యక్రమములో ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, జిల్లా విద్యాధికారి బి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.