Telangana

News July 12, 2024

‘వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టండి’

image

 గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని MHBD జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ,  అమ్మ ఆదర్శ పాఠశాలలు తదితర అంశాలపై సంబధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయడానికి పక్కా యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు.

News July 12, 2024

‘జనాభా నియంత్రణపై ఫోకస్ పెట్టాలి’

image

ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని DMHO కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆరోగ్య కార్యకర్తలకు హనుమకొండ DMHO డా.సాంబశివరావు పలు సూచనలు చేశారు. జనాభాను అరికట్టేందుకు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులైన వ్యాసెక్టమీ లేదా ట్యూబెక్టమీ ఆపరేషన్లు మాత్రమే కాకుండా, కాన్పుల మధ్య అంతరం కోసం తాత్కాలిక గర్భనిరోధక పద్ధతులను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆరోగ్య కార్యకర్తలపై ఉందన్నారు.

News July 12, 2024

MBNR: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్

image

CM రేవంత్ రెడ్డిని గద్వాల కాంగ్రెస్ ఇంచార్జి సరిత తిరుపతయ్య గురువారం సచివాలయంలో MP మల్లురవితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాల్సిందిగా కోరుతూ సీఎంకు సరిత వినతిపత్రం సమర్పించారు. పెండింగ్ లో ఉన్న పలు ప్రభుత్వ భవనాల నిర్మాణం, ప్రాజెక్టులకై ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆమె వినతిపత్రంలో పేర్కొన్నారు. గట్టు కృష్ణమూర్తి, శ్రీధర్ పాల్గొన్నారు.

News July 12, 2024

నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి: కామారెడ్డి కలెక్టర్

image

జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిని నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఇరిగేషన్, పంచాయతీరాజ్, R&B, నేషనల్ హైవే, RWS, EWIDC, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. 

News July 12, 2024

ఇంటింటా ఇన్నోవేషన్ 2024.. ఆగస్టు 3లోగా పంపండి

image

సిరిసిల్లలో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఔత్సాహికులు తమ ఆవిష్కరణల వివరాలు ఆగస్టు 3లోగా పంపాలని కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. గురువారం తన ఛాంబర్లో ఇంటింటా ఇన్నోవేషన్ 2024 పోస్టర్ ఆవిష్కరించారు. తమ ఆవిష్కరణకు సంబంధించిన 2 నిమిషాల నిడివి వీడియో, 4 ఫోటోలు, పేరు, ఫోన్ నంబర్, వయసు, గ్రామం, జిల్లా పేరు తదితర వివరాలతో 9100678543కు వాట్సాప్ చేయాలన్నారు.

News July 12, 2024

తెలంగాణలో ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాల ఏర్పాటు: మంత్రి దుద్దిళ్ల

image

అమెరికా టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం మైక్రోలింక్ నెట్‌వర్క్స్ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో తమ ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం మైక్రోలింక్ గ్లోబల్ ప్రతినిధులు, భారతీయ భాగస్వామి పీఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ శ్రీరంగారావు మంత్రితో HYD సచివాలయంలో సమావేశమయ్యారు.

News July 12, 2024

తెలంగాణలో ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాల ఏర్పాటు: మంత్రి దుద్దిళ్ల

image

అమెరికా టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం మైక్రోలింక్ నెట్‌వర్క్స్ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో తమ ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం మైక్రోలింక్ గ్లోబల్ ప్రతినిధులు, భారతీయ భాగస్వామి పీఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ శ్రీరంగారావు మంత్రితో సచివాలయంలో సమావేశమయ్యారు.

News July 12, 2024

మహిళా శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

ఖమ్మం: మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేయడమే మహిళా శక్తి పథకం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మహిళా శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళల సామాజిక భద్రత కోణంలో సంఘాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

News July 11, 2024

వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఎస్ఐల బదిలీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్ఐలు బదిలీ అయ్యారు. కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మొత్తం 27 మందికి స్థానచలనం కల్పిస్తూ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలని సీపీ సూచించారు.

News July 11, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓రూ.2 వేల కోట్లతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి:ఎంపీ ఈటల
✓రాచకొండ పోలీస్ కమిషనర్ అధికారిగా సుధీర్ బాబు
✓కొత్తపేట: ఆమరణ నిరాహార దీక్ష విరమించిన అశోక్ సార్
✓ఖైరతాబాద్: ఈసారి 70 అడుగుల ఎత్తులో గణేశుడు
✓బోనాల ఊరేగింపు కోసం కర్ణాటక రూపవతి ఏనుగు రాక
✓మేడ్చల్:బాలిక పై అత్యాచారం..20 ఏళ్ల జైలు శిక్ష
✓కూకట్పల్లి: నకిలీ ఐఏఎస్ సందీప్ అరెస్ట్
✓GHMC:ఆగస్టు 5న స్టాండింగ్ కమిటీ ఎన్నిక