Telangana

News July 11, 2024

రేగోడ్: పాముకాటుతో వివాహిత మృతి

image

మండల పరిధిలోని గజ్వాడ గ్రామంలో చేను పనులు చేస్తుండగా గుర్ల రామమ్మకు పాము కాటు వేసింది. అక్కడే ఉన్న భర్త మల్లేశం, కుమారుడు రాజు అంబులెన్స్ కొరకు ప్రయత్నించగా అంబులెన్స్ అందుబాటులో రాలేదు. చేను వరకు ఆటో పిలిపించుకొని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆలస్యం కావడంతో రామమ్మ మృతి చెందింది. అంబులెన్స్ అందుబాటులో ఉంటే తన భార్య ప్రాణం దక్కేదని భర్త మల్లేశం బోరున వినిపించాడు.

News July 11, 2024

పెద్దపల్లి: అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. దీనికి 2004 జులై 3 నుంచి 2008 జనవరి 3 మధ్య జన్మించి పెళ్లికాని యువతీ, యువకులు అర్హులని చెప్పారు. జులై 28లోగా https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు వెబ్ సైట్ చూడాలని కోరారు.

News July 11, 2024

సిద్దిపేట: ఏఎస్ఐ ఉమ్మారెడ్డిపై బదిలీ వేటు

image

రవి అడ్వకేట్ పై దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చినందున టూ టౌన్ ఏఎస్ఐ ఉమారెడ్డిని సిద్దిపేట టూ టౌన్ నుంచి జిల్లా కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ సీపీ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారని అడిషనల్ డిసిపి యస్.మల్లారెడ్డి తెలిపారు. అడ్వకేట్ పై దాడి విషయంలో టూ టౌన్ ఇన్స్‌పెక్టర్ ఉపేందర్‌పై ఆరోపణలు రాగా గజ్వేల్ ఏసిపి కే.పురుషోత్తంరెడ్డిని విచారణ అధికారిగా నియమించామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.

News July 11, 2024

గణాంకాల హ్యాండ్ బుక్‌ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

image

ఖమ్మం: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 2023-2024 సంవత్సర జిల్లా గణాంకాల హ్యాండ్ బుక్‌ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాస్, డిఆర్డీవో సన్యాసయ్య, జడ్పి సిఇఓ ఎస్. వినోద్, సింగరేణి మండల మహిళా సమైఖ్య అధ్యక్షురాలు సుహాసిని, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News July 11, 2024

మెదక్: స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

మెదక్ స్టేడియంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమును జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. మెదక్ ఆర్డీవో రమాదేవి, తహశీల్దార్ శ్రీనివాసరావులతో కలిసి క్షేత్ర పర్యటనలో భాగంగా స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలను చేశారు. సీసీ టీవీల పర్యవేక్షణ, సెక్యూరిటీ పకడ్బందీగా నిర్వహించాలని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల అధికారులకు సూచించారు.

News July 11, 2024

సంగారెడ్డి: జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

image

సంగారెడ్డి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఎస్పీ రూపేష్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి గంజాయి, మాదకద్రవ్యాలు తరలిస్తున్నారా పరిశీలించారు. జిల్లాలో ఎవరైనా మాదకద్రవ్యాలు, గంజాయి తరలిస్తే 87126 56777 నెంబర్‌కు ఫోన్ చేయాలని ఎస్పీ రూపేష్ సూచించారు. వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

News July 11, 2024

తాడ్వాయి: నేను టీచర్ అవుతా: తులసి

image

తాను బాగా చదువుకొని టీచర్ అవుతానని తక్కల్లగూడెం గుత్తిగూడెం ఆదివాసీ బిడ్డ పూనెం తులసి అంటోంది. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ కార్యక్రమంలో తన పాత్రను నేచురల్ చేసినట్లు చెప్పింది. “గూడెంలోని జీవనశైలి, కుటుంబ పోషణ” విధానంపై పాత్ర చేశానని, తనతోపాటు గూడెంలోని పిల్లలందరూ చదువుకోవాలన్న తులసి కోరిక మేరకు ఇటీవల మంత్రి సీతక్కస్కూల్ భవనం నిర్మించి ప్రారంభించారు. తులసి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

News July 11, 2024

బొంరాస్‌పేట: అండగా ఉంటాను, అధైర్య పడకు: కేటీఆర్

image

బొంరాస్ పేట మండలం BRS పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు నెహ్రూ నాయక్ భార్య సుమిత్ర బాయి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం హైదరాబాదులోని తన నివాసానికి పిలిపించుకుని పరామర్శించారు. అధైర్య పడకండి, నేను మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మండల నాయకులు ఉన్నారు.

News July 11, 2024

దేవరకద్ర: బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఎంపీకి వినతి పత్రం

image

మహబూబ్ నగర్ ఎంపీగా గెలుపొంది తొలిసారి దేవరకద్ర‌లో కృతజ్ఞత సభకు విచ్చేసిన డీకే అరుణకి కొండ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా స్వాగతం పలికి శాలువ కప్పి సన్మానం చేశారు. అనంతరం దేవరకద్ర‌లోని వ్యాపారస్తులు అందరు కలిసి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఎంపీకి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎగ్గని నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

News July 11, 2024

పొతంగల్‌లో పేకాటాడుతున్న 9 మంది అరెస్ట్

image

పోతంగల్ మండలం జల్లాపల్లి గ్రామంలో పోలీసులు పేకాటాడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు. వారికి అందిన సమాచారం మేరకు పేకాట స్థావరం పై దాడి చేసినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. 9 మందిని అదుపులోకి తీసుకొని రూ.70,350 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. గ్రామాల్లో ఎవరైనా పేకాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.