Telangana

News July 11, 2024

నల్గొండ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో ఫుడ్ కోర్టు!

image

నల్గొండ జిల్లా కేంద్రంలో సుమారు రూ.కోటి వ్యయంతో ఫుడ్ కోర్టు ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ రోడ్డులో బీట్ మార్కెట్ యార్డుకు వెళ్లే ప్రధాన మార్గంలో ఫుడ్ కోర్టు నిర్మాణాలకు స్థలం కేటాయించారు. మంత్రి కోమటిరెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. వారం పది రోజుల్లో ఫలహారశాల నిర్మాణాలకు మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

News July 11, 2024

TGSRTC ఖమ్మం వైద్య అధికారి బదిలీ

image

ఉమ్మడి ఖమ్మం రీజియన్ TGSRTC వైద్యాధికారి డాక్టర్ గిరి సింహారావు బదిలీ అయ్యారు. సుదీర్ఘకాలంగా ఇక్కడ పని చేస్తున్న ఆయన మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. ఉన్నతాధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం ఆయన విధుల నుంచి రిలీవ్ అయ్యారు. గత 25 సంవత్సరాల పైగా ఖమ్మం రీజియన్‌లో ఆయన సేవలో అందించారు.

News July 11, 2024

MBNR: పాతాళానికి భూగర్భ జలాలు

image

ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలమట్టం నానాటికీ తగ్గిపోతోంది. వర్షాకాలం ప్రారంభమైనా జిల్లాలో భూగర్భ నీటిమట్టం పెరగడం లేదు. గత నెల ఉమ్మడి జిల్లాలో సగటున 9.33 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు పడిపోయాయి. గతేడాది జూన్లో భూగర్భ జలాలు 7.09 మీటర్ల లోతులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 2.24 మీటర్ల లోతులోకి ఇవి పడిపోయాయి. కృష్ణా పరివాహక ప్రాంతమైన GDWL, WNP, NGKL జిల్లాల్లో కూడా భూగర్భ జలాల పెరుగుదల కనిపించలేదు.

News July 11, 2024

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

image

భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. భద్రాచలంలో 11.5 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, రిజర్వాయర్ల నుంచి నీరు దిగువకు వస్తోంది. ఎగువన వాజేడు మండలం పేరూరు వద్ద కూడా నీటి మట్టం పెరుగుతోంది. కాగా కొత్త నీటితో గోదావరి కళకళలాడుతోంది. గోదావరి ప్రవాహం పెరుగుతుందని, గోదారి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News July 11, 2024

TGSRTC ఖమ్మం వైద్య అధికారి బదిలీ

image

ఉమ్మడి ఖమ్మం రీజియన్ TGSRTC వైద్యాధికారి డాక్టర్ గిరి సింహారావు బదిలీ అయ్యారు. సుదీర్ఘకాలంగా ఇక్కడ పని చేస్తున్న ఆయన మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. ఉన్నతాధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం ఆయన విధుల నుంచి రిలీవ్ అయ్యారు. గత 25 సంవత్సరాల పైగా ఖమ్మం రీజియన్‌లో ఆయన సేవలో అందించారు.

News July 11, 2024

NLG: వన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి

image

తిప్పర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాశం రామ్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

News July 11, 2024

మంత్రిని కలిసిన MLC జీవన్ రెడ్డి

image

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాల నియోజకవర్గ ఇరిగేషన్ అభివృద్ధిపై చర్చించారు. ఇరిగేషన్ పనులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మంత్రిని MLC కోరారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని జీవన్ రెడ్డి తెలిపారు.

News July 11, 2024

ADB: SC స్టడీ సర్కిల్ నుంచి 36 మంది గ్రూప్-1 మెయిన్స్‌కు ఎంపిక

image

ఇటీవల విడుదలైన గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాల్లో ఆదిలాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి 36 మంది అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించి మెయిన్స్‌కి ఎంపికైనట్లు స్టడీ సర్కిల్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ డాక్టర్ రమేష్ పేర్కొన్నారు. ఈ విజయానికి కారణం అత్యుత్తమ అధ్యాపక బృందం, రాష్ట్ర డైరెక్టర్, జిల్లా కలెక్టర్, జిల్లా షెడ్యూల్ అభివృద్ధి అధికారి సునీత ప్రోత్సాహంతో ఈ ఫలితాలు సాధించామని ఆయన పేర్కొన్నారు.

News July 11, 2024

కాజీపేట, వరంగల్ మీదుగా ఐఆర్ సీటీ ప్రత్యేక ప్యాకేజీ టూర్

image

కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ల మీదుగా ఐఆర్ సీటీ దివ్య దక్షిణ జ్యోతిర్లింగ యాత్ర ప్యాకేజ్ టూర్‌ను ప్రవేశ పెట్టినట్లు యాత్ర ఇన్చార్జ్ కొక్కుల ప్రశాంత్ తెలిపారు. యాత్ర ఆగస్టు 4న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై అదే నెల 12 వరకు సాగుతుందని తెలిపారు. యాత్ర మొత్తం 8 రాత్రులు, 9 పగలు ఉంటుందన్నారు. ఈ యాత్ర ప్రత్యేక రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, మీదుగా సాగుతుందని తెలిపారు.

News July 11, 2024

కేసముద్రం: బిల్డింగ్ పైనుంచి పడి విద్యార్థినికి గాయాలు

image

కేసముద్రంలోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలో ఓ విద్యార్థిని బిల్డింగ్ పైనుంచి పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన విద్యార్థినిని సిబ్బంది ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. 9వ తరగతి చదువుతున్న ఆమె.. వారం రోజుల క్రితం ఇంటికి వెళ్లింది. తిరిగి బుధవారం హాస్టల్లో చేరగా.. సా.5గం. ప్రాంతంలో గురుకులంలోని ఒకటో అంతస్తు పైనుంచి కిందపడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.