Telangana

News July 11, 2024

బోనమెత్తిన డిప్యూటీ సీఎం సతీమణి

image

మధిర: ఆషాఢ బోనాలు సందర్భంగా ప్రజా భవన్ నుంచి డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు నందిని విక్రమార్క సంప్రదాయంగా బోనాలు తయారు చేశారు. అనంతరం బోనాలను ఎత్తుకొని ఎల్లమ్మ తల్లికి సమర్పించారు. అదేవిధంగా ఎల్లమ్మ తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.

News July 11, 2024

పంచాయతీల్లో బదిలీలకు అధికారుల సన్నాహాలు..!

image

పంచాయతీల్లో బదిలీలు చేసేందుకు అధికారులు సన్నాహలు చేస్తున్నారు. ఒకేచోట నాలుగేళ్ల నిండిన వారందిరికి ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పుడున్న మండలం కాకుండా వేరేచోటుకు మార్చాలని ఆదేశాలు రావటంతో అధికారులు జాబితా తయారు చేస్తున్నారు. జిల్లాలో 530 పంచాయతీలు ఉన్నాయి. 464 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తుండగా అందులో 150 మందికి, ఎంపీవోలు 18, సిబ్బంది 25 మంది బదిలీలకు అవకాశం ఉంది.

News July 11, 2024

సిరిసిల్ల: డిప్లమా అగ్రికల్చర్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

సిరిసిల్ల జిల్లాలో డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్‌టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్(దేశీ)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా ఆత్మ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ భాస్కర్ తెలిపారు. దేశీలో 80 దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, జిల్లాలోని ఎరువుల విక్రయ, క్రిమిసంహారక లై సెన్స్, పదో తరగతి చదివిన డీలర్లు అర్హులుగా పేర్కొన్నారు.

News July 11, 2024

మధిర: రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

image

మధిర మండలం మడుపల్లి గ్రామంలో నిన్న రోడ్డు పక్కకు ఓ <<13600268>>కారు <<>>దూసుకెళ్లి డ్రైవర్‌కు గాయాలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడ్డ కారు డ్రైవర్ రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. రమేశ్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News July 11, 2024

రైతుల ఆలోచనే ప్రభుత్వ ఆలోచన: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

image

రైతుల ఆలోచనే ప్రభుత్వ ఆలోచన అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఉట్నూర్ పట్టణంలోని కేబీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. రైతులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పవచ్చని అన్నారు.

News July 11, 2024

కాలేశ్వరం మేడిగడ్డ బ్యారేజీకి పెరిగిన వరద ప్రవాహం

image

భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన అంబట్పల్లి గ్రామంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. 16.17 టీఎంసీ నిల్వ సామర్థ్యం కలిగిన బ్యారేజీకి మంగళవారం ఇన్ఫో 35,200 క్యూసెక్కులు రాగా.. బుధవారం 41,500 క్యూసెక్కులకు పెరిగింది. బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరదను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రవాహం 89.90 మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.

News July 11, 2024

ADB: గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శుల సీనియారిటీ జాబితా

image

జిల్లా పంచాయతీ శాఖలో పనిచేసే గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శుల సీనియారిటీ జాబితాను అధికారులు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 320 మంది గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. ఇందులో 245 మంది నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. వీరిలో 40% మాత్రమే బదిలీచేయాలనే నిబంధనల మేరకు 128 మందిని అర్హులుగా గుర్తించారు. సంబంధిత సీనియారిటీ జాబితా సిద్ధం చేసిన అధికారులు కలెక్టర్ అనుమతితో నోటీస్ బోర్డుపై ఉంచారు.

News July 11, 2024

పెరుగుతున్న పాలమూరు జిల్లా జనాభ

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏటా జనాభా పెరుగుతూనే ఉంది. 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం.. 35,26,605 ఉన్న జనాభా 2024 సంవత్సరం వచ్చేసరికి.. 41,62,093కు చేరింది.. ఈ 12 సంవత్సరాలలో.. 6,35,488 జనాభా పెరిగింది. నెలకు సగటున 50 వేల జనాభా పెరుగుతూనే ఉంది. కుటుంబ నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని, ఆపరేషన్లకు ముందుకొచ్చిన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ తెలిపారు.

News July 11, 2024

ఉమ్మడి జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో 25.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా మరికల్లో 22.0 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో 1.3 మి.మీ, వనపర్తి జిల్లా సోలిపూర్లో 1.0 మి.మీ, గద్వాల జిల్లాలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 11, 2024

వరంగల్ మార్కెట్లో రూ.100 తగ్గిన పత్తి ధర

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు మళ్లీ తగ్గింది. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఈరోజు రూ.100 పడిపోయింది. సోమవారం రూ.7,200 పలికిన క్వింటా పత్తి.. మంగళవారం రూ.7,24, బుధవారం రూ.7,400 పలికింది. ఈ క్రమంలో నేడు రూ.7,300కి తగ్గింది. దీంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు.