Telangana

News July 11, 2024

WGL: ఎంజీఎం ఆస్పత్రిలో ఆగిన గుండె పరీక్షలు

image

ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కు అయిన ఎంజీఎం ఆస్పత్రిలో గుండె సంబంధిత అత్యవసర సేవలు నిలిచిపోయాయి. అత్యాధునిక యంత్రాలున్నా సరైన టెక్నీషియన్లు లేక 2డీ ఏకో పరీక్షలు చేయడం లేదు. 2డీ ఎకో పరీక్షల కోసం బుధవారం పేషంట్లను కేఏంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆర్ఎంఓ-3 శ్రీనివాస్ స్పందిస్తూ పరీక్షలు చేయడం లేదనే విషయం తన దృష్టికి రాలేదని, పరిశీలించి నేడు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

News July 11, 2024

WGL: భూ నిర్వాసితులకు రూ.10.38 కోట్ల పరిహారం అందజేత

image

మంచిర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ కారిడార్ నిర్మాణానికి సంబంధించి వరంగల్ జిల్లా మీదుగా 38.2 కిలోమీటర్ల మేర వెళ్లే రహదారి కోసం 160 హెక్టార్ల భూసేకరణ పూర్తి చేసినట్లు కలెక్టర్ సత్య శారద దేవి తెలిపారు. మొత్తం 168 మంది భూ నిర్వాసితులకు రూ.10.38 కోట్ల నష్టపరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మిగిలిన రైతులకు కూడా త్వరలో పరిహారం చెల్లిస్తామని అన్నారు.

News July 11, 2024

HYD: JOBS.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ

image

HYDలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీకాం, బీబీఎం పాసై 28 ఏళ్ల వయసు మించని వారు అర్హులు. పోస్టును అనుసరించి రూ.21,500 నుంచి రూ.90,000 జీతం ఉంటుంది. జులై 11 దరఖాస్తుకు చివరి తేదీ. మరిన్ని వివరాలకు https://bel-india.in/job-notifications/ వెబ్‌సైట్‌ చూడండి. SHARE IT

News July 11, 2024

HYDలో JOBS.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ

image

HYD భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీకాం, బీబీఎం పాసై 28 ఏళ్ల వయసు మించని వారు అర్హులు. పోస్టును అనుసరించి రూ.21,500 నుంచి రూ.90,000 జీతం ఉంటుంది. జులై 11 దరఖాస్తుకు చివరి తేదీ. మరిన్ని వివరాలకు https://bel-india.in/job-notifications/ వెబ్‌సైట్‌ చూడండి. SHARE IT

News July 11, 2024

HYDలో JOBS.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ

image

HYDలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీకాం, బీబీఎం పాసై 28 ఏళ్ల వయసు మించని వారు అర్హులు. పోస్టును అనుసరించి రూ.21,500 నుంచి రూ.90,000 జీతం ఉంటుంది. జులై 11 దరఖాస్తుకు చివరి తేదీ. మరిన్ని వివరాలకు https://bel-india.in/job-notifications/ వెబ్‌సైట్‌ చూడండి. SHARE IT

News July 11, 2024

17.9 అడుగులకు చేరిన పాకాల సరస్సు నీటి మట్టం

image

ఖానాపూర్ మండలంలో గల పాకాల సరస్సు నీటి మట్టం ఇటీవల కురిసిన వర్షాల ధాటికి 17.9 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 30 అడుగులుగా ఉంది. పాకాల సరస్సులోని నీరు వచ్చి చేరుతుండటంతో ఇప్పటికే రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్దమై వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందుకోసం పాకాల నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

News July 11, 2024

మంత్రిని కలిసిన ఏమ్మెల్సీ జీవన్ రెడ్డి

image

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాల నియోజకవర్గ ఇరిగేషన్ అభివృద్ధిపై చర్చించారు. ఇరిగేషన్ పనులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మంత్రిని MLC కోరారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని జీవన్ రెడ్డి తెలిపారు.

News July 11, 2024

ప్రకాశం జిల్లాలో ఖమ్మం బాలిక ఆత్మహత్య

image

ప్రకాశం జిల్లా మేదరమెట్లలో బుధవారం ఖమ్మం జిల్లాకు చెందిన బాలిక(14) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిరోజుల క్రితం కూలీ పనుల నిమిత్తం ప్రకాశం జిల్లాలో బంధువుల వద్ద ఉంటూ, పనికి వెళ్తుంది. ఈక్రమంలో బుధవారం అర్ధరాత్రి బాలిక కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాలు వెతకగా చెట్టుకు ఉరేసుకుని కనిపించిందని బాలిక తండ్రి దేవయ్య తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News July 11, 2024

BREAKING.. KNR: ఆర్టీసీ బస్సులో ఫిట్స్‌తో ప్రయాణికుడు మృతి

image

కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సులో ఫిట్స్‌తో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. ఈ ఘటన రామడుగు మండలం వెదిర గ్రామంలో చోటుచేసుకుంది. KNR నుంచి గంగాధరకు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న రాజయ్యకు ఫిట్స్ వచ్చింది. దీంతో తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకునే సరికి మృతిచెందినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 11, 2024

MBNR: ‘ఆధారాలు ఉంటే క్రమశిక్షణ చర్యలు తప్పవు’

image

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో స్పౌజ్ విభాగంలో ప్రత్యేక పాయింట్లు పొందిన వారి వివరాలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా చాలా మంది స్పౌజ్ పాయింట్లు ఉపయోగించుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంఈవోలు స్పౌజ్ బదిలీలను పరిశీలించి నివేదికలు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆధారాలు ఉంటే క్రమ శిక్షణ చర్యలు తీసుకోనున్నారు.