Telangana

News July 11, 2024

ఉమ్మడి జిల్లాలో గృహలక్ష్మి సంఖ్య@3,85,343

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 8,54,491 మంది గృహ విద్యుత్తు వినియోగదారులు ఉండగా.. వీరిలో 5,12,694 మంది గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా 1,27,351 మందికి ‘0’బిల్లులు రావాల్సి ఉందని విద్యుత్ అధికారులు తెలిపారు. జూన్ మాసంలో 3,65,311 మంది గృహ విద్యుత్తు వినియోగదారులు ‘0’ బిల్లులు అందుకోగా, జులైలో ఈ సంఖ్య 3,85,343లకు చేరింది. ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య మరో 20 వేలకు పెరిగింది.

News July 11, 2024

HYD: ఆగస్టు 5న స్టాండింగ్ కమిటీ ఎన్నిక

image

బల్దియా స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్న షాహిన్ బేగం మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 12 నుంచి 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అర్హత పొందిన నామినేషన్ల వివరాలు 23న వెలువరిస్తారు. ఉపసంహరణ గడుపు 26వ తేదీ వరకు ఉంటుంది. ఆగస్టు 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News July 11, 2024

HYD: ఆగస్టు 5న స్టాండింగ్ కమిటీ ఎన్నిక

image

బల్దియా స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్న షాహిన్ బేగం మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 12 నుంచి 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అర్హత పొందిన నామినేషన్ల వివరాలు 23న వెలువరిస్తారు. ఉపసంహరణ గడుపు 26వ తేదీ వరకు ఉంటుంది. ఆగస్టు 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News July 11, 2024

రేపు మెదక్ జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెలలో ప్రారంభం కానున్న హెచ్సీఏ బీ1 డివిజన్ 2-డే లీగ్‌లో పాల్గొనేందుకు అండర్-25 ఉమ్మడి మెదక్ జిల్లా జట్టును ఈ నెల 12న ఉదయం 10 గంటలకు ఎంపిక చేయనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్రెడ్డి తెలిపారు. సంగారెడ్డి లోని జూబ్లీక్లబ్ ప్రాంగణంలోని ఎంఎస్ అకాడమీలో ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు.

News July 11, 2024

గోదావరిఖని: దంత వైద్య విభాగంలో క్లిష్టమైన ఆపరేషన్

image

గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలోని దంత వైద్య విభాగంలో మొట్ట మొదటిసారిగా అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను నిర్వహించారు. వ్యక్తికి సంబంధించి ముఖంలోని ఆరు దవడ ఎముకలు విరిగిపోవడంతో దంత వైద్య నిపుణులు 6 మినీ ప్లేట్లు, 20 స్క్రూలు బిగించి ఆపరేషన్ విజయవంతం చేశారు. వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్ అభినందించారు.

News July 11, 2024

బీర్కూర్: అప్పులు తీర్చలేక యువకుడి సూసైడ్

image

బీర్కూరు మండలం బరంగేడ్గి గ్రామంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన వడ్ల కృష్ణమూర్తి(36) వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల నూతన గృహాన్ని అప్పులు చేసి నిర్మించారు. అప్పులు ఇచ్చినవారు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.

News July 11, 2024

జైపూర్: KGBV నుంచి హైదరాబాద్‌కు పారిపోయిన విద్యార్థినులు

image

KGBV నుంచి ఇద్దరు విద్యార్థినులు పారిపోగా పోలీసులు వీరిని హైదరాబాదులో గుర్తించారు. జైపూర్ KGBV నుంచి ఇద్దరు విద్యార్థినులు బుధవారం ఉదయం 3 గంటలకు పారిపోయారని అధికారిణీ శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఈమేరకు దర్యాప్తు ప్రారంభించి CC కెమెరాలను పరిశీలించి భాగ్యనగర్ రైల్లో హైదరాబాద్ వెళ్లినట్లు గుర్తించామని శ్రీరాంపూర్ CI. మోహన్, SI.రాములు తెలిపారు.

News July 11, 2024

మణుగూరు: వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు 

image

కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీసులు ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని రక్షించారు. పట్టణంలోని సురక్షా బస్టాండ్ సమీపంలో జాఫర్ అనే వ్యక్తి పురుగు మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. అనంతరం 100కు ఫోన్‌ చేసి చెప్పాడు. మణుగూరు బ్లూకోట్ పోలీసులు జాఫర్‌ను గుర్తించి ఆసుపత్రికి తరలించి ప్రాణాలు పోకుండా కాపాడారు. పోలీసులను పలువురు అభినందిస్తున్నారు.

News July 11, 2024

NLG: రైలులో యువతితో అసభ్య ప్రవర్తన.. నిందితుడు అరెస్ట్

image

రైలులో యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడు బిశ్వాల్‌‌ను నల్గొండ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతితో పాటు రైలు నుంచి కిందపడి గాయాలపాలైన బిశ్వాల్ మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా బుధవారం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని నల్గొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

News July 11, 2024

పంచాయతీరాజ్ పర్యవేక్షకులకు స్థానచలనం

image

ఆదిలాబాద్ జిల్లాలో వివిధ చోట్ల పనిచేస్తున్న 11 మంది పంచాయతీరాజ్ పర్యవేక్షకులకు స్థానచలనం కలగనుంది. జోనల్ స్థాయిలో జరిగే ఈ బదిలీల్లో జడ్పీ నుంచి వివరాలు ఉన్నతాధికారులకు నివేదించగా ఉద్యోగుల పేర్లతో జాబితాను పంపించారు. ఎక్కడైనా అయిదు చోట్ల ప్రాధాన్యం వారీగా వీరు ఖాళీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీరితోపాటు జోనల్ స్థాయి పోస్టులైన పీఆర్ సీనియర్ అసిస్టెంట్లు ఏడుగురు బదిలీ కానున్నారు.