Telangana

News July 11, 2024

NZB: చనిపోయిన విద్యార్థి కుటుంబానికి రూ.6 లక్షల నష్టపరిహారం

image

2013లో ప్రమాదవశాత్తు NZB ప్రభుత్వ బీసీ బాలుర బీసీ వసతి గృహంలో నాలుగో అంతస్థు నుంచి జె. శ్రీకాంత్ పడి మృతిచెందాడు. విద్యార్థి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని జాదవ్ పరుశురాం అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థి కుటుంబానికి వడ్డీతో కలిపి నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. నష్టపరిహారం రూ.6 లక్షలు, వడ్డీరూ.3,07,900, కోర్టు ఖర్చులు రూ.35,042 మెత్తం 9,42,842 మంజూరు చేసింది.

News July 11, 2024

నేడు ఆదిలాబాద్ జిల్లాకు నలుగురు మంత్రులు

image

ఆదిలాబాద్ జిల్లాలో నేడు నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. ఉట్నూరులో నిర్వహించే రైతు భరోసా ప్రజాభిప్రాయ సేకరణలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి తుమ్మల, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి సీతక్క హాజరుకానున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ తెలిపారు. మండల కేంద్రంలోని KB కాంప్లెక్స్ లో ఉ.10.30కు నిర్వహించే ఈ సభలో వీరు పాల్గొంటారు.

News July 11, 2024

మహబూబ్‌నగర్: రేపు ఉద్యోగ మేళా!

image

మహబూబ్ నగర్ పట్టణంలోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఈనెల 12న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి జానీపాషా తెలిపారు. SSC పాస్ లేదా ఫెయిల్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ డిప్లొమా, బీటెక్ చదివి 18 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు గల అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, బయోడేటాతో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలన్నారు.

News July 11, 2024

కాటారం: అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య

image

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన BHPL జిల్లా కాటారం మండలం మేడిపల్లిలో జరిగింది. SI అభినవ్ వివరాల ప్రకారం.. మేడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బస్వాపూరకి చెందిన లింగయ్య(35) రెండున్నర ఎకరాలను రెండేళ్ల క్రితం కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లతో పంట దిగుబడి రాకనోవడంతో రూ.4 లక్షల అప్పయ్యాడు. మనస్తాపం చెందిన రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 11, 2024

KMM: రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రజలు నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అందించే పలు పథకాలు పొందాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో పథకాలకు అర్హులైనా.. రేషన్ కార్డు లేక అనర్హులుగా మగిలిపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వం త్వరలోనే రేషన్ కార్డులు జారీ చేస్తామనడంతో ఆశలు చిగురిస్తున్నాయి.

News July 11, 2024

సిద్దిపేట: చికిత్స పొందుతూ బాడీ బిల్డర్ మృతి

image

సిద్దిపేటకు చెందిన ప్రముఖ బాడీ బిల్డర్ సోహైల్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వారం రోజుల క్రితం మిరుదొడ్డి ప్రాంతంలో మరో యువకుడితో కలిసి క్రికెట్ ఆడి ద్విచక్ర వాహనం పై తిరిగి సిద్దిపేటకు వస్తుండగా ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సోహైల్ మృతి చెందాడు.

News July 11, 2024

WGL: ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లితండ్రి మృతి.. UPDATE

image

వరంగల్ జిల్లా <<13605294>>16చింతల్‌లో హత్య<<>> జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. నవంబర్‌లో గూడూరు మం. వాసి నాగరాజుతో దీపిక ప్రేమపెళ్లి జరగగా.. మనస్ఫర్ధలతో విడిపోయారు. దీంతో దీపిక కుటుంబంపై పగ పెంచుకున్న నాగరాజు అర్ధరాత్రి తల్వార్‌తో దీపిక కుటుంబంపై దాడి చేశాడు. ఈ దాడిలో యువతి తల్లి సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా.. NSPT ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తండ్రి శ్రీనివాస్ మృతి చెందాడు. నిందితుడు పరారయ్యాడు.

News July 11, 2024

ఉమ్మడి జిల్లాలో గృహలక్ష్మి సంఖ్య@3,85,343

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 8,54,491 మంది గృహ విద్యుత్తు వినియోగదారులు ఉండగా.. వీరిలో 5,12,694 మంది గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా 1,27,351 మందికి ‘0’బిల్లులు రావాల్సి ఉందని విద్యుత్ అధికారులు తెలిపారు. జూన్ మాసంలో 3,65,311 మంది గృహ విద్యుత్తు వినియోగదారులు ‘0’ బిల్లులు అందుకోగా, జులైలో ఈ సంఖ్య 3,85,343లకు చేరింది. ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య మరో 20 వేలకు పెరిగింది.

News July 11, 2024

రేపు వనపర్తికి డిప్యూటీ సీఎం, మంత్రులు రాక

image

రైతుభరోసా పథకంపై ఈ నెల 12న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతులతో కలిసి అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని వనపర్తిలో నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ కమిటీ సభ్యులు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

News July 11, 2024

హైదరాబాద్‌: జూ పార్కుకు కొత్త జంతువులు

image

HYDలోని నెహ్రూ జూలాజికల్‌ పార్కు‌కు కొత్తగా జంతువులు వచ్చాయి. జంతు మార్పిడిలో భాగంగా UP కాన్పూర్‌ నుంచి రాయల్ బెంగాల్ పెద్దపులి(ఆడ)ని తీసుకొచ్చారు. మరో రెండు చిరుత పులుల జంటలు, జింకలు, కొన్ని పక్షులను‌ ‘జూ‌’కు షిఫ్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌ నుంచి కాన్పూర్‌కు‌ కూడా పలు జంతువులను తరలించారు. కాగా, మంగళవారం నుంచి ఆదివారం(8:30AM-4PM) వరకు జూ తెరిచి ఉంటుంది. సోమవారం సెలవు. SHARE IT