Telangana

News July 11, 2024

హైదరాబాద్‌: జూ పార్కుకు కొత్త జంతువులు

image

HYDలోని నెహ్రూ జూలాజికల్‌ పార్కు‌కు కొత్తగా జంతువులు వచ్చాయి. జంతు మార్పిడిలో భాగంగా UP కాన్పూర్‌ నుంచి రాయల్ బెంగాల్ పెద్దపులి(ఆడ)ని తీసుకొచ్చారు. మరో రెండు చిరుత పులుల జంటలు, జింకలు, కొన్ని పక్షులను‌ ‘జూ‌’కు షిఫ్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌ నుంచి కాన్పూర్‌కు‌ కూడా పలు జంతువులను తరలించారు. కాగా, మంగళవారం నుంచి ఆదివారం(8:30AM-4PM) వరకు జూ తెరిచి ఉంటుంది. సోమవారం సెలవు.
SHARE IT

News July 11, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా రాయల నాగేశ్వరరావు ప్రమాణస్వీకారం
> మణుగూరు: బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు
> ఉపాధ్యాయ బదిలీలపై ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష
> అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన
> తిరుమలాయపాలెంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సర్వే
> బూర్గంపాడులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

News July 11, 2024

నస్రుల్లాబాద్: పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ

image

పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసిన ఘటన నస్రుల్లాబాద్ మం.లో జరిగింది. పోలీసుల ప్రకారం.. శ్రీను, శ్రీకాంత్ అనే ఇద్దరు తమ తండ్రుల పేరిట ఉన్న ఇళ్లకు నకిలీ స్టాంపులు, పత్రాలు, రశీదులు, పంచాయతీ ధ్రువపత్రాలు తయారుచేశారు. అంతేగాక పంచాయతీ కార్యదర్శి రజిత సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఓ ఫైనాన్స్‌లో ఇద్దరు రుణాలు తీసుకొని చెల్లించకపోవటంతో సిబ్బంది ఆరా తీయగా విషయం బయటపడింది.

News July 11, 2024

నల్గొండ: ప్రేమ పేరుతో వేధింపులు యువతి సూసైడ్

image

ప్రేమ వేధింపులతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. చింతలగూడానికి చెందిన కళ్యాణి(19)ని అదే గ్రామానికి చెందిన శివ, మధు అనే ఇద్దరు యువకులు ప్రేమపేరుతో కొంతకాలంగా వేధిస్తున్నారు. ప్రేమించకుంటే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఈనెల 6న కళ్యాణికి ఫోన్లు చేస్తూ వేధించసాగారు. దీంతో కళ్యాణి పురుగు మందు తాగింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News July 11, 2024

KNR: రుణ మాఫీ పై ప్రచార లోపం.. రైతన్నలకు శాపం

image

రైతు రుణమాఫీపై స్పష్టత లేకపోగా ఏటా తీసుకున్న రుణాన్ని చెల్లించి తిరిగి తీసుకుంటే వడ్డీ బాధ పోయేది. కరీంనగర్ జిల్లాలో 1.34లక్షల మంది రైతులు రుణమాఫీ దారులు ఉండగా అందులో దాదాపు 60వేల మంది వడ్డీ కడుతూ వస్తున్నారు. ఇక రూ.2లక్షల రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఆగస్టు 15లోపు ప్రభుత్వం రుణమాఫీ ప్రకటన విధివిధానాలపై రైతన్నల్లో ఆందోళన నెలకొంది.

News July 11, 2024

ఆదిలాబాద్ జిల్లాలో 15 పాఠశాలలు మూత

image

ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 15 పాఠశాలలు పదోన్నతుల ప్రక్రియ తర్వాత మూతబడ్డాయి. జిల్లాలోని 12 మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఆయా పాఠశాలల్లో అత్యల్పంగా 10 మంది విద్యార్థులు ఉంటే.. అత్యధికంగా 50 మంది విద్యార్థులు ఉన్నట్లు విద్యాశాఖవర్గాలు చెబుతున్నాయి. మరో వైపు 80 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. అత్యవసర సమయంలో ఉపాధ్యాయుడు సెలవు పెడితే ఆయా పాఠశాలలకు అనధికారిక సెలవు ప్రకటించాల్సిందే.

News July 11, 2024

ఖమ్మం: భర్తను హత్య చేయించిన భార్య

image

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న భర్తను ప్రియుడితో హత్య చేయించిందో భార్య. DSP షేక్ అబ్దుల్ రెహ్మాన్ ప్రకారం.. కొత్తగూడెం పట్టణం గౌతంపూర్‌కాలనీకి చెందిన రమేశ్‌కు ఈశ్వర్‌కుమార్(38)భార్యతో వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలుసుకున్న ఈశ్వర్ భార్యతో గొడవపడే వాడు. దీంతో ప్రియుడితో కలిసి భర్త హత్యకు కుట్రపన్నింది. ఈనెల 6న ఈశ్వర్‌ను హత్య చేయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా వెలుగుచూసింది.

News July 11, 2024

అంగన్‌వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు: మంత్రి సీతక్క

image

రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు బోధించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. మహిళా భద్రత, చైల్డ్ కేర్‌పై అధికారులతో సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా చిన్నారులకు యూనిఫాంలు అందిస్తామన్నారు. అంగన్ వాడీల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు ‘అమ్మ మాట-అంగన్‌వాడీ బాట’ పేరుతో వెళ్తున్నట్టు చెప్పారు.

News July 11, 2024

HYD: ‘డెంగ్యూ‌కు వ్యతిరేకంగా పోరాడుదాం’

image

డెంగ్యూ నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. లిబర్టీలోని ప్రధాన కార్యాలయంలోని మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలితో కలిసి వైద్యఆరోగ్యశాఖ ఎంటమాలజీ, శానిటేషన్ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం రెగ్యూలర్‌గా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, దోమల నియంత్రణకు నగర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.

News July 11, 2024

HYD: ‘డెంగ్యూ‌కు వ్యతిరేకంగా పోరాడుదాం’

image

డెంగ్యూ నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. లిబర్టీలోని ప్రధాన కార్యాలయంలోని మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలితో కలిసి వైద్యఆరోగ్యశాఖ ఎంటమాలజీ, శానిటేషన్ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం రెగ్యూలర్‌గా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, దోమల నియంత్రణకు నగర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.