Telangana

News July 11, 2024

MBNR: పద్మశ్రీ కొండప్పకు రూ.25 లక్షల నగదు పురస్కారం

image

నారాయణపేట జిల్లా దామరగిద్ధ మండల కేంద్రానికి చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత దాసరి కొండప్పకు బుధవారం CM రేవంత్ రెడ్డి నగదు పురస్కారం అందజేశారు. సచివాలయంలో రూ.25 లక్షల చెక్కును అందించి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి, అధికారులు పాల్గొన్నారు. పాలమూరు వాసులు హర్షం వ్యక్తం చేశారు.

News July 11, 2024

BREAKING.. వరంగల్ జిల్లాలో భార్యాభర్తల హత్య

image

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. చెన్నారావుపేట మండలం పదహారుచింతల్‌లో కుటుంబకలహాలు, ప్రేమవ్యవహారంలో బన్ని అనే వ్యక్తి భార్యాభర్తలపై కత్తితో దాడిచేశాడు. ఈ ఘనటలో దంపతులు బానోతు శ్రీనివాస్, సుగుణ మృతి చెందగా.. కుమారుడు, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఎంజీఎంకు తరలించారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 11, 2024

బదీలీల ప్రక్రియను పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

image

ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ఖమ్మం జిల్లాలో పారదర్శకంగా జరగాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్‌లో ఉద్యోగుల బదిలీ ప్రక్రియపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఉద్యోగ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ బదిలీలకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నాలుగు సంవత్సరాలు ఓకే చోట పనిచేసిన వారిని బదీలీ చేస్తామని, జూలై 9 నుండి 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 11, 2024

వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలి: కలెక్టర్

image

పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాద్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాలోని హెడ్మాస్టర్లతో సమావేశం నిర్వహించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఇప్పటి నుండి ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. డిసెంబర్ లోపు సిలబస్ పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించాలని అన్నారు.

News July 11, 2024

సంగారెడ్డి: గ్రూప్-1 మెయిన్స్ ఫ్రీ కోచింగ్

image

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-1 మెయిన్స్ ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ బుధవారం తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 17 వరకు వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థి కుటుంబ వార్షికోత్సవం రూ.5 లక్షల లోపు ఉండాలని చెప్పారు. కోచింగ్ సమయంలో నెలకు రూ. 5000 స్టైపాండ్ చెల్లిస్తారని తెలిపారు.

News July 11, 2024

కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మను కలిసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

image

కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు బుధవారం పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. శాంతిభద్రలకు నియోజకవర్గ ప్రజలు సహకరిస్తారని ఆయన పేర్కొన్నారు.

News July 11, 2024

ADB: నిబంధనలు పాటించకపోతే వాహనాలు సీజ్: DSP

image

వాహనదారులు నిబంధనలు పాటించకపోతే వాహనాన్ని సీజ్ చేయటంతో పాటు కేసులు నమోదు చేస్తామని ఆదిలాబాద్ DSP జీవన్ రెడ్డి హెచ్చరించారు. ట్రాఫిక్ CI ప్రణయ్ కుమార్, SI ముబీన్‌తో కలిసి DSP పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. గత వారం రోజుల్లో 321 వాహనాలను సీజ్ చేశామన్నారు. తాజాగా బుధవారం 55 వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.

News July 11, 2024

వరంగల్: భూమిని కోల్పోయిన వారికి నష్టపరిహారం అందించాలి: సీఎం

image

రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో బాధితులకు చెల్లించే పరిహారం విషయంలో మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం హైద్రాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవితో మాట్లాడారు. ఈ సందర్భంగా వరంగల్ – ఖమ్మం కారిడార్ లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్‌కు సీఎం సూచించారు.

News July 11, 2024

విద్య ద్వారానే నిజమైన అభివృద్ధి : మంత్రి పొన్నం ప్రభాకర్

image

విద్య ద్వారానే నిజమైన అభివృద్ధి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అన్నివర్గాలకు ఉన్నత విద్య అందించడానికి రాజీవ్ గాంధీ వేసిన బాటలు రహదారులుగా మారాయని ఆయన పేర్కొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సాంకేతిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తే .. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థులకు ఫీజు రాయితీ ఇచ్చి డాక్టర్లను, ఇంజనీర్లను చేశారన్నారు.

News July 11, 2024

జాతీయ రహదారులకు భూసేకరణ పూర్తి చేయాలి:సీఎం

image

జాతీయ రహదారుల నిర్మాణానికి గడువులోగా భూ సేకరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నత స్థాయి అధికారులతో కలిసి సీఎం వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫిరెన్స్‌‌‌లోని ఖమ్మంలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల పాల్గొని భూ సేకరణ అంశంపై చర్చించారు.