Telangana

News July 10, 2024

నిజామాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

image

బైక్‌పై తరలిస్తున్న 2.250 కిలోల ఎండు గంజాయిని నిజామాబాద్‌లోని చంద్రశేఖర్ కాలనీ ఎక్స్‌రోడ్ వద్ద ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నగరంలో బాబా ఖాన్‌, బీబీపేట్‌కి చెందినకిషన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

News July 10, 2024

HYD: బెట్టింగ్‌ తీసిన ప్రాణం

image

ఆన్‌లైన్ బెట్టింగ్ మరొకరి ప్రాణం తీసింది. పోచారం PS పరిధి శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్ 3rd ఇయర్ స్టూడెంట్ నితిన్(21) మంగళవారం రైల్‌ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండలో ఉంటున్న పేరెంట్స్ వద్ద కాలేజీ ఫీజు కోసం అని రూ. 1.3 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బులు బెట్టింగ్‌‌లో పొగొట్టాడు. కష్టం చేసి తెచ్చిన డబ్బు వృథా చేశావని పేరెంట్స్ మందలించడంతో‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 10, 2024

HYD: బెట్టింగ్‌ తీసిన ప్రాణం

image

ఆన్‌లైన్ బెట్టింగ్ మరొకరి ప్రాణం తీసింది. పోచారం PS పరిధి శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్ 3rd ఇయర్ స్టూడెంట్ నితిన్(21) మంగళవారం రైల్‌ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండలో ఉంటున్న పేరెంట్స్ వద్ద కాలేజీ ఫీజు కోసం అని రూ. 1.3 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బులు బెట్టింగ్‌‌లో పొగొట్టాడు. కష్టం చేసి తెచ్చిన డబ్బు వృథా చేశావని పేరెంట్స్ మందలించడంతో‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 10, 2024

ఈశ్వరమ్మ ఘటనలో నిందితులకు శిక్ష పడేలా చూస్తాం: కమిషన్

image

కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషనర్ బగ్గి వెంకటయ్య బుధవారం సందర్శించారు. చెంచు మహిళా ఈశ్వరమ్మపై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. వారు ఆమె ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. దాడి చేసిన వారిపై కఠిన శిక్షలు పడేలా ఎస్పీకి ఆదేశించామని చెప్పారు. చెంచులపై దాడి జరిగితే సహించేది లేదని, ఎలాంటి వారికైనా శిక్ష తప్పదని వారు హెచ్చరించారు.

News July 10, 2024

ఆర్టీసీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు: RM KMM

image

ఆర్టీసీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లింక్‌లను నమ్మవద్దని ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. అధికారికంగా సంస్థ నోటిఫికేషన్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తుందని తెలిపారు. అనవసరంగా మోసపూరిత లింకులను క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేయొద్దని సూచించారు.

News July 10, 2024

టీచర్‌గా మారిన నారాయణపేట కలెక్టర్

image

నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ టీచర్‌గా మారి 9వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. నారాయణపేట మండలం జాజాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్ పరిశీలించి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లలకు అందించే ఆహార పదార్థాలను పరిశీలించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు.

News July 10, 2024

ఖమ్మం జిల్లాలో వారం రోజులుగా ఆత్మహత్యల పరంపర!!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుస ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. పొలాల దగ్గర గొడవలతో రైతులు గుండె చెడి పురుగు మందే పరమాన్నంగా భావిస్తున్నారు. కొందరు అధికారులు సైతం ఉద్యోగ విధుల్లో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరగడం వంటి కారణాలతో ఆత్మహత్యలకు వరుస కడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే నలుగురు రైతులు ఆత్మహత్యకు ప్రయత్నించగా, ఇద్దరు అధికారులు సైతం ఉసురు తీసుకోవడానికి యత్నించారు.

News July 10, 2024

సంగారెడ్డి: రేపటి టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం వాయిదా

image

ఈనెల 11న నిర్వహించాల్సిన టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం వాయిదా వేసినట్లు జిల్లా అధ్యక్షులు జావిద్ అలీ బుధవారం తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తున్నందున సమావేశాన్ని వాయిదా వేసినట్లు చెప్పారు. జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News July 10, 2024

సిదిపేట: విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య !

image

సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శేఖర్(31), సౌమ్య మణి(28) దంపుతులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News July 10, 2024

KNR: గ్రూప్-1 మెయిన్స్‌కు ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

గ్రూప్-1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. కరీంనగర్, పెద్దపల్లి , జగిత్యాల జిల్లాలకు చెందిన ఔత్సాహికులు తమ దరఖాస్తులను వెబ్ సైట్ www.tgbcstudycircle.cgg.gov.inలో ఈ నెల 19 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 75 రోజుల పాటు నిర్వహించే శిక్షణ ఈనెల 22న మొదలవుతుందన్నారు.