Telangana

News July 10, 2024

వరంగల్ మార్కెట్‌లో వివిధ ఉత్పత్తుల ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు పల్లికాయ, పసుపు తరలివచ్చాయి. ఈ క్రమంలో క్వింటా పసుపు ధర రూ.12,501 పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ.6110 పలకగా.. పచ్చి పల్లికాయ ధర రూ.4300 పలికింది. మరోవైపు మక్కలు రూ. 2620, 5531 మిర్చి 13వేల ధర పలికాయి. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులు తగుజాగ్రత్తలు పాటిస్తూ సరుకులు మార్కెట్‌కు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.

News July 10, 2024

HYD: మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

image

HYD మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాలు.. యూనివర్సిటీలో అగ్రికల్చర్ థర్డ్ ఇయర్ చదువుతున్న హరినాథ్ పురుగుమందు తాగాడు. అనంతరం వసతి గృహం 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఈ క్రమంలో విద్యుత్ వైర్లు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 10, 2024

బిక్కనూరులో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

బిక్కనూర్ శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి ఆటోమొబైల్ సామాన్ తరలిస్తున్న టాటా ఏస్ వాహనం బిక్కనూర్ వద్ద డివైడర్‌ను ఢీకొంది. కరీంనగర్‌కు చెందిన శేఖర్(47) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ సాయికుమార్ కేసు నమోదు చేశారు.

News July 10, 2024

HYD: మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

image

HYD మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాలు.. యూనివర్సిటీలో అగ్రికల్చర్ థర్డ్ ఇయర్ చదువుతున్న హరినాథ్ పురుగుమందు తాగాడు. అనంతరం వసతి గృహం 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఈ క్రమంలో విద్యుత్ వైర్లు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 10, 2024

నాగార్జున సాగర్ జలాశయం సమాచారం

image

నాగార్జున సాగర్ జలాశయం ప్రాజెక్టు వివరాలును అధికారులు బుధవారం తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 503.30 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 120.5754 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది.

News July 10, 2024

పాలమూరు చేపలకు డిమాండ్

image

ఉమ్మడి జిల్లాలోని నీటి వనరుల్లో చేపల ఉత్పత్తి 40 శాతం సహజ సిద్ధంగా, 60శాతం ప్రభుత్వం ఇచ్చిన చేప విత్తనంతో జరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో చేపల పెంపకానికి ప్రత్యేక చెరువులు నిర్మించి మందులు, దాణా వేస్తారు. ఉమ్మడి జిల్లాలో ఇలా చేయరు. బంగారు తీగ, రోహు, బొచ్చ, కొర్రమీను వంటి చేపలు నాచు, ఇతర జలచరాలను తింటూ సహజ సిద్ధంగా పెరుగుతున్నాయి. సహజంగా పెరిగే పాలమూరు చేపలు రుచికరంగా ఉండటంతో మంచి డిమాండ్ ఉంది.

News July 10, 2024

అశ్వారావుపేట పోలీసులను వెంటాడుతున్న వరుస విషాదాలు

image

అశ్వారావుపేట సర్కిల్‌లో పోలీసులను వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్య ఘటనను మరువకముందే.. దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో రెండో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సీమా నాయక్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో అశ్వారావుపేట సర్కిల్ పరిధిలోని పోలీసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

News July 10, 2024

MHBD: విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎంపీ

image

రైతు భరోసా పథకంపై నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంపీ బలరాం నాయక్ చెప్పారు.

News July 10, 2024

కరీంనగర్: రుణమాఫీపై కదలిక.. చిగురిస్తున్న ఆశలు

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పంట రుణమాఫీపై అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా సహకార సంఘాల పరిధిలోని డీసీసీబీ, ఎస్బీఐ బ్యాంకుల్లో రూ.2 లక్షల లోపు పంట రుణం తీసుకున్న రైతుల వివరాలను అధికారులు సేకరించారు. ఆయా బ్యాంకుల రికార్డుల ఆధారంగా రైతుల వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. ఎట్టకేలకు రుణమాఫీపై కదలిక రావడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

News July 10, 2024

పొన్నం ప్రభాకర్‌ను కలిసిన తీన్మార్ మల్లన్న

image

మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను బుధవారం ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన సందర్భంగా మల్లన్నను మంత్రి పొన్నం ప్రభాకర్ శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.