Telangana

News September 1, 2025

నల్గొండ: ప్రజావాణిలో 99 ఫిర్యాదులు

image

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 99 ఫిర్యాదులు అందాయని, వాటిలో 30 జిల్లా అధికారులకు, 69 రెవెన్యూ శాఖకు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

News September 1, 2025

NZB: ‘KCRపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహారిస్తోంది’

image

తెలంగాణ ప్రజల కల్పతరువుగా నిర్మించిన కాళేశ్వరం నీటి ప్రాజెక్టును నీరుగార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహారిస్తోందని NZB జిల్లా BRS లీగల్ సెల్ కన్వీనర్ దాదాన్నగారి మధుసుధన్ రావు ఆరోపించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ KCRపై CBI విచారణ కుట్రపూరితమని పేర్కొన్నారు. KCRపై కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి కుట్ర శాసన సభ సాక్షిగా ప్రజల ముంగిటకి వచ్చిందని అన్నారు.

News September 1, 2025

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్లు

image

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. విద్యార్థిని సీటు, రహదారి సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, వెలుగుమట్ల చెరువు ఆక్రమణ వంటి సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News September 1, 2025

మెదక్: నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

image

మెదక్ జిల్లాలో వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీ శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అంతటా ఉన్న అన్ని పోలీస్ అధికారులు, సీఐలు, ఎస్ఐలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అన్నారు.

News September 1, 2025

NZB: అశోక్‌సాగర్ కెనాల్‌లో మృతదేహం కలకలం

image

NZB శివారులోని అశోక్‌సాగర్ కెనాల్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్టు 6వ టౌన్ SI వెంకట్రావు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు 35-40 సంవత్సరాల వరకు ఉండవచ్చని అంచనా వేశారు. క్రీం కలర్ డబ్బాల షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, క్లాసిక్ టైలర్ నవీపేట అని ఉందని సూచించారు.

News September 1, 2025

NLG: వీధి కుక్కలపై ప్రచారం.. కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్

image

వీధి కుక్కల బెడదను నివారించేందుకు మున్సిపల్, గ్రామీణ ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె సంబంధిత అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఆర్‌డీఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. తద్వారా ఈ సమాచారం వారి కుటుంబాలకు చేరుతుందని ఆమె పేర్కొన్నారు.

News September 1, 2025

MBNR: ALERT.. నేటి నుంచి పోలీస్ యాక్ట్:SP

image

మహబూబ్ నగర్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రశాంతతను పెంపొందించేందుకు నేటి నుంచి ఈనెల 30 వరకు జిల్లా అంతటా 30 పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. పోలీస్ ఉన్నత అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎటువంటి పబ్లిక్ మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు చేపట్ట రాదని, నిషేదిత ఆయుధాలు వాడరాదని, లౌడ్ స్పీకర్‌లు, డీజేలు నిషేధమన్నారు. నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు.

News September 1, 2025

HYD: రూ.2 కోట్లతో స్వీపింగ్ కోసం టెండర్!

image

స్వీపింగ్ మిషన్లకు సంబంధించిన కాంట్రాక్ట్ రద్దు చేసిన GHMC, అద్దె యంత్రాల కోసం మళ్లీ టెండర్లును పిలిచి నవ్వుల పాలవుతుంది. ఎల్బీనగర్, శేర్లింగంపల్లి, ఖైరతాబాద్ జోన్ ప్రాంతాల్లో స్విపింగ్ కోసం దాదాపు రూ.2 కోట్లు చెల్లించేందుకు టెండర్లను పిలిచారు. జీహెచ్ఎంసీ అధికారుల తీరు, తీసుకునే చర్యలపై స్థానిక జోన్ ప్రాంతాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News September 1, 2025

HYD: గణపతి నిమజ్జనాలకు ఈ ప్రాంతాల్లో RTA వాహనాలు

image

నిమజ్జనాల కోసం RTA వాహనాలు అందించేందుకు సిద్ధమైంది. HYD వ్యాప్తంగా 12వాహన కేంద్రాలను నిమజ్జనాల కోసం గుర్తించింది. ఈ కేంద్రాల నుంచి మండపాలకు వాహనాలు తీసుకెళ్లొచ్చు. నెక్లెస్ రోడ్డు, మేడ్చల్, టోలిచౌకి, జూ పార్క్, మలక్‌పేట, కర్మన్‌ఘాట్, నాగోల్, గచ్చిబౌలి, మన్నెగూడ, పటాన్‌చేరు, వనస్థలిపురం, ఆటోనగర్ RTA కేంద్రాల నుంచి వాహనాలను మండపాలకు తరలించునున్నారు.

News September 1, 2025

మెదక్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

image

మెదక్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నెల 1 నుంచి 30 వరకు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కాలంలో జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిషేధమని హెచ్చరించారు. ఈ నిబంధనలకు సహకరించాలని ఆయన ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులను కోరారు.