Telangana

News July 10, 2024

నల్గొండ: బీటెక్ విద్యార్థి సూసైడ్

image

ఆన్‌లైన్ బెట్టింగ్ మరొకరి ప్రాణం తీసింది. పోచారం PS పరిధి శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్ స్టూడెంట్ నితిన్(21) మంగళవారం రైల్‌ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన నితిన్ కాలేజీ ఫీజు కోసం రూ.1.3 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బులు బెట్టింగ్‌‌లో పోగొట్టాడు. తల్లిదండ్రులు మందలించడంతో‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 10, 2024

MBNR: సీఎంకి ఎమ్మెల్యే విజయుడు ఇచ్చిన వినతి పత్రంపై స్పందన

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే విజయుడు పాల్గొని అలంపూర్ అభివృద్ధి గురించి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం దీనికి బుధవారం సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలంపూర్ నియోజకవర్గంలో మహిళా రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు నిర్మించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

News July 10, 2024

వరంగల్ మార్కెట్లో పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర క్రమంగా పెరుగుతోంది. సోమవారం రూ.7,200 పలికిన క్వింటా పత్తి.. మంగళవారం రూ.7,240 అయింది. ఈరోజు మరింత పెరిగి రూ.7,400 అయినట్లు అధికారులు తెలిపారు. ధరలు పెరగడం కొంత ఉపశమనం కలిగించే విషయమైనప్పటికీ, మరింత పెరగాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు.

News July 10, 2024

HYD: కాంగ్రెస్ ప్రభుత్వానికి KTR Request

image

HYD శివారులోని కొత్వాల్‌గూడ ఎకో పార్కు నిర్మాణ పనులు కొనసాగించాలని KTR తెలంగాణ CMOని కోరారు. 125 ఎకరాల్లో అద్భుతమైన ఎకో పార్క్‌ ప్రాజెక్టును 2022 అక్టోబర్‌లో ప్రారంభించామన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్న చివరిరోజు వరకు పనులు కొనసాగించామన్నారు. కానీ, గత 7 నెలలుగా ప్రాజెక్టు ముందుకు కదలలేదని‌ పేర్కొన్నారు. నగరవాసులకు అహ్లాదాన్ని పంచే‌ పార్క్‌ పనులు పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

News July 10, 2024

HYD: కాంగ్రెస్ ప్రభుత్వానికి KTR Request

image

HYD శివారులోని కొత్వాల్‌గూడ ఎకో పార్కు నిర్మాణ పనులు కొనసాగించాలని KTR తెలంగాణ CMOని కోరారు. 125 ఎకరాల్లో అద్భుతమైన ఎకో పార్క్‌ ప్రాజెక్టును 2022 అక్టోబర్‌లో ప్రారంభించామన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్న చివరిరోజు వరకు పనులు కొనసాగించామన్నారు. కానీ, గత 7 నెలలుగా ప్రాజెక్టు ముందుకు కదలలేదని‌ పేర్కొన్నారు. నగరవాసులకు అహ్లాదాన్ని పంచే‌ పార్క్‌ పనులు పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

News July 10, 2024

ఆదిలాబాద్: ఈనెల చివరన ప్రాజెక్టులను సందర్శించనున్న సీఎం

image

తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులపై దృష్టి సారించారు CM రేవంత్ రెడ్డి. అదిలాబాద్ జిల్లాలో ఈనెల చివరి వారంలో ప్రాజెక్టుల సందర్శన పేరిట పర్యటించనున్నారు. సదర్మాట్, మత్తడి వాగు ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించి 2025 మార్చిలోగా పనులు పూర్తి చేసేందుకు నిర్ణయించారు. సీఎంతో పాటు ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క కూడ ఇదే జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది.

News July 10, 2024

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు UPDATES

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద మంగళవారం తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం 2,051 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. మంగళవారం సాయంత్రానికి 583 క్యూసెక్కులకు తగ్గిందన్నారు. ప్రాజెక్టు నుంచి 132 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.740 టీఎంసీలు ఉన్నట్లు పేర్కొన్నారు.

News July 10, 2024

సూర్యాపేట: ఓటర్ ఐడీ చెల్లదు.. బస్సు దిగు..!

image

‘ఆర్టీసీ బస్సులో ఓటర్ ఐడీ చెల్లదు. టికెట్ తీసుకో లేదంటే బస్సు దిగి పో’ అంటూ తన పట్ల కండక్టర్ దురుసుగా ప్రవర్తించినట్లు నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వగ్రామానికి వెళ్లేందుకు మంగళవారం కోదాడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ఎక్కానని , సదరు కండక్టర్ ఓటర్ ఐడీ చెల్లదంటూ మధ్యలోనే దించేశారని బాధితురాలు వాపోయారు.

News July 10, 2024

మంచిర్యాల: ఆత్మహత్యాయత్నం చేసిన ఆరోతరగతి విద్యార్థిని

image

హాస్టల్ నుంచి తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లడం లేదంటూ విద్యార్థిని భవనం పైనుంచి దూకిన ఘటన నస్పూర్‌లో చోటుచేసుకుంది. కస్తూర్బాలో 6వ తరగతి చదువుతున్న అక్షర అనే బాలిక తను హాస్టల్లో ఉండనని ఇంటికి తీసుకువెళ్లాలంటూ తల్లిదండ్రులను కోరింది. అందుకు వారు నిరాకరిస్తూ హాస్టల్‌లోనే ఉంటూ చదవాలన్నారు. దీంతో మనస్తాపానికి గురైన అక్షర హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

News July 10, 2024

MBNR: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థుల పరీక్షల షెడ్యూల్

image

ఉమ్మడి జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో పీజీ మొదటి, రెండోవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల యొక్క వార్షిక పరీక్షల షెడ్యూలు విడుదల చేశామని ఉమ్మడి జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు వచ్చే నెల ఆగస్టు 20 నుంచి ప్రారంభం కానున్నాయని మిగతా వివరాలకు వారిని సంప్రదించగలరని పేర్కొన్నారు.