Telangana

News July 10, 2024

ఆదిలాబాద్: ఇప్పటి వరకు 94 వేల మందికి లబ్ది

image

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద రూ.500 వంట గ్యాస్ సిలిండరు ప్రభుత్వం అందజేస్తోంది. జిల్లాలో పథకం కోసం సుమారు 3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వివరాలు సక్రమంగా ఉండి LPG సిలిండర్లు ఉన్నవారికి ఇప్పటి వరకు జిల్లాలో 94వేల మంది లబ్ది పొందారని జిల్లా పౌరస రఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. సబ్సిడీని డీబీటీ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు.

News July 10, 2024

సిరిసిల్ల: గుండెపోటుతో గల్ఫ్ కార్మికుడి మృతి

image

గుండెపోటుతో ఓ గల్ఫ్ కార్మికుడు మృతిచెందిన ఘటన తంగళ్లపల్లి మండలంలోని మల్లాపూర్‌లో జరిగింది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజేశ్ ఉపాధి నిమిత్తం గత పదేళ్లుగా గల్ఫ్‌లో ఉంటున్నాడు. 6 నెలల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

News July 10, 2024

సౌదీలో నూత్‌పల్లి వాసి మృతి.. కోటపాటిని కలిసిన కుటుంబ సభ్యులు

image

డొంకేశ్వర్ మండలం నూత్‌పల్లికి చెందిన సాయన్న సౌదీలో ఈనెల 4న మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయన్న మృతదేహాన్ని తొందరగా స్వదేశానికి రప్పించాలని కోరుతూ ఆర్మూర్‌లో ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడును కలిసి అభ్యర్థించారు. స్పందించిన కోటపాటి సౌదీ రాయబార కార్యాలయానికి కావలసిన సమాచారాన్ని పంపించామని పేర్కొన్నారు.

News July 10, 2024

WNP: బిల్డింగ్‌పై నుంచి పడి వ్యక్తి మృతి

image

నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అమరచింత‌లోని జగన్ వాడలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన ఉప్పరి కర్రెన్న (55) నిర్మాణంలో ఉన్న భవనంలో తాపీ మేస్త్రీ వద్ద దినసరి కూలీగా పనిచేసే వాడని, బిల్డింగ్ పై ఏర్పాటు చేసిన విందులో పాల్గొనే క్రమంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి కిందపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News July 10, 2024

గంగాపూర్: అంబులెన్స్‌లో ప్రసవం..

image

హవేలి ఘనపూర్ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన మన్నె మల్లేశం భార్య కల్పనకు పురిటి నొప్పులు రాగా అంబులెన్స్‌కు సమాచారం తెలిపారు. మెదక్ MCH ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో నొప్పులు ఎక్కువ కాగా EMT శ్రీహరి డెలివరీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. వారిని మెదక్ ఆస్పత్రిలో అడ్మిట్ చేసినట్లు పేర్కొన్నారు. పైలెట్ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

News July 10, 2024

ఇల్లందు: మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడి ఆత్మహత్య

image

మున్సిపల్ చెత్త సేకరణ వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్న ఏ.కార్తీక్ (28) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం రామవరానికి చెందిన కార్తీక్ ఇల్లెందు మున్సిపాలిటీలో హరితహారంలో వర్కర్‌గా పనిచేస్తున్న రమేశ్ వద్ద ఉంటూ తడి, పొడి చెత్త సేకరణ వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్న కార్తీక్.. మంగళవారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి ఉరివేసుకున్నాడు.

News July 10, 2024

MBNR: ఇంటర్ విద్యలో బదిలీలకు రంగం సిద్ధం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటర్ విద్యలో ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. జూనియర్ అధ్యాపకులు, ప్రిన్సిపల్, బోధనేతర సిబ్బంది బదిలీ కానున్నారు. బదిలీలకు సంబంధించిన మార్గ దర్శకాలు ఒకటి, రెండు రోజుల్లో కమిషనర్ కార్యాలయం నుండి విడుదల కానున్నాయని జిల్లా ఇంటర్ కార్యాలయం వర్గాలు తెలిపాయి. ఇంటర్ విద్యలో బదిలీలకు “జీరో సర్వీసు”ను పరిగణలోకి తీసుకోబోమని అధికారులు పేర్కొన్నారు.

News July 10, 2024

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తా: మాజీ ఎంపీ

image

గెలుపు ఓటములతో సంబందం లేకుండా ప్రజల సమస్యల పరిష్కారానికై పోరాడుతానని మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధిగా నా విజయం కోసం శక్తివంచన లేకుండా అహర్నిశలు కష్టపడి పని చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నాపై నమ్మకంతో ఓట్లు వేసిన జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. కార్యకర్తలకు ఏ సమస్యా వచ్చిన అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

News July 10, 2024

HYD: గ్రూప్-2 అభ్యర్థులు తొందర పడొద్దు: చనగాని

image

గ్రూప్-2 అభ్యర్థులు తొందర పడొద్దని, CM రేవంత్ సానుకూలంగా ఉన్నారని TPCC అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. గ్రూప్-2 అభ్యర్థుల విజ్ఞప్తికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. బీఆర్ఎస్ ఉచ్చులో పడకుండా ప్రిపరేషన్‌కు సిద్ధం కావాలని చనగాని దయాకర్ సూచించారు. DSC పరీక్ష వాయిదా ఉండదని స్పష్టం చేశారు. నిరుద్యోగుల పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి అని, త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ విడుదల చేస్తారని వెల్లడించారు.

News July 10, 2024

HYD: గ్రూప్-2 అభ్యర్థులు తొందర పడొద్దు: చనగాని

image

గ్రూప్-2 అభ్యర్థులు తొందర పడొద్దని, CM రేవంత్ సానుకూలంగా ఉన్నారని TPCC అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. గ్రూప్-2 అభ్యర్థుల విజ్ఞప్తికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. బీఆర్ఎస్ ఉచ్చులో పడకుండా ప్రిపరేషన్‌కు సిద్ధం కావాలని చనగాని దయాకర్ సూచించారు. DSC పరీక్ష వాయిదా ఉండదని స్పష్టం చేశారు. నిరుద్యోగుల పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి అని, త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ విడుదల చేస్తారని వెల్లడించారు.