Telangana

News July 10, 2024

కల్వకుర్తి: పాముకాటుతో రైతు మృతి

image

కల్వకుర్తి పట్టణానికి చెందిన రైతు వసంత యాదయ్య(48) మంగళవారం పాముకాటుతో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన యాదయ్య రోజు మాదిరిగానే ఉదయం తన పొలానికి వెళ్లాడు. పొలం వద్ద బోరు మోటారు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పాము కాటేసింది. స్థానికులు గమనించి అతణ్ని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందారు. యాదయ్యకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.

News July 10, 2024

ADB: పంచాయతీ కార్యదర్శుల సీనియారిటీ జాబితా ప్రకటన

image

జిల్లా పంచాయతీ శాఖలో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. బాసర జోన్ పరిధిలో జరిగే గ్రేడ్-1, 2, 3 కార్యదర్శుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేసిన అధికారులు మంగళవారం ప్రకటించారు. గ్రేడ్-1లో ఎనిమిది మందికి గాను ఒకరు, గ్రేడ్-2లో 09 మందికి నలుగురు, గ్రేడ్-3లో 57 మందికి 41 మంది నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. వీరు తప్పనిసరిగా బదిలీపై వెళ్లనున్నారు. ఈమేరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారు.

News July 10, 2024

నేడు దేవరకొండకు జగన్నాథ రథయాత్ర

image

ఇస్కాన్ టెంపుల్ కూకట్‌పల్లి వారి ఆధ్వర్యంలో చేపట్టిన పూరి జగన్నాథ రథయాత్ర బుధవారం దేవరకొండ పట్టణానికి చేరుకోనుంది. ఇప్పటికే యాత్రకు సంబంధించిన కమిటీ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పట్టణానికి చేరుకోనున్న రథయాత్ర స్థానిక అయ్యప్పస్వామి దేవాలయం నుంచి ప్రారంభమై కొండల్రావు బంగ్లా వరకు కొనసాగనుంది. అనంతరం రాత్రి 7గంటలకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

News July 10, 2024

భద్రాద్రి: గుండెపోటుతో ఎస్ఐ మృతి

image

గుండెపోటుతో ఎస్ఐ మృతి చెందిన ఘటన బుధవారం దమ్మపేట మండలంలో చోటుచేసుకుంది. దమ్మపేట పోలీస్ స్టేషన్లో రెండో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సీమా నాయక్ ఖమ్మం నగరంలోని ఆయన నివాసంలో ఛాతి నొప్పితో కుప్పకూలిపోయారు. వెంటనే ఎస్ఐను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News July 10, 2024

జగిత్యాల: ఉరేసుకుని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

image

ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. శాఖాపూర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిని(19) మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News July 10, 2024

SRPT: చికిత్స పొందుతూ బాలిక మృతి

image

పురుగు మందు తాగిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. పట్టణ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాలు మేరకు.. సూర్యాపేటకు చెందిన బాలిక(15) మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఈనెల 6న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు సీఐ తెలిపారు.

News July 10, 2024

WGL: భార్యను చంపి భర్త ఆత్మహత్య

image

భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ పట్టణ కేంద్రంలోని లేబర్ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన చేరాలు(45).. భార్య స్వప్నను(40) సోమవారం రాత్రి రోకలిబండతో కొట్టి చంపి పోలీసులకు పట్టుబడతాననే భయంతో మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. ఈ ఘటనతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News July 10, 2024

మంచిర్యాలలో పేకాట రాయుళ్ల అరెస్ట్

image

మంచిర్యాలలోని ఒక రెస్టారెంట్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు ఆదేశాలతో మంగళవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరి వద్ద నుంచి రూ.1 లక్ష 78 వేలు నగదు స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు సమాచారం.

News July 10, 2024

KMM: బాలికను గర్భవతిని చేసిన యువకుడు

image

బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు గర్భవతిని చేశారు. ఎస్ఐ రవి కథనం ప్రకారం.. చండ్రుగొండ మండలంలోని ఇమ్మిడిరామయ్యబంజర్‌ వాసి కంపసాటి రవి ఓ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను ఫోన్‌లో బంధించానని ఎవరికైనా చెబితే వాట్సాప్‌లో పెడతానని బెదిరించాడు. బాలిక గర్భవతి కావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై పోక్సో కేసు నమోదైంది.

News July 10, 2024

నేడు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం..!

image

నేడు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. నిజామాబాద్‌తో పాటు పక్కనే ఉన్న నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సరైనా వర్షాలు లేక జిల్లాలోని ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి.