Telangana

News July 10, 2024

MBNR: రాష్ట్రీయ బాల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MBNR, NGKL డీఈవోలు రవీందర్, గోవిందరాజులు తెలిపారు. 5 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలు అర్హులని, https://awards.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఉమ్మడి MBNR జిల్లాలోని పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా HMలు, ఉపాధ్యాయులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, న్యూఢిల్లీలో ఈ పురస్కారాలను అందిస్తారని అన్నారు.

News July 10, 2024

మెదక్: పశువుపై చిరుత దాడి

image

రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద చిరుత పులి సంచరిస్తుందని రైతులు తెలిపారు. గత రాత్రి గ్రామానికి చెందిన ఇప్ప రాజు అనే రైతుకు చెందిన వ్యవసాయ పొలం వద్ద పశువుపై చిరుత పులి దాడి చేసి చంపేసింది. ఉదయం పొలం వద్దకు వెళ్ళిన రైతులు పశువును చూసి ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. చిరుత పులి సంచారంపై స్థానికులు భయాందోళన గురవుతున్నారు.

News July 10, 2024

కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.50 కోట్లు మంజూరు

image

కాకతీయ విశ్వవిద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం “రాష్ట్రీయ ఉచ్చితర్ శిక్షా అభియాన్ (రుసా-RUSA) రాష్ట్ర ప్రభుత్వం తరుఫున 60:40 నిష్పత్తిలో రూ.50 కోట్లు 2020లో మంజూరు చేశారు. ఇందులో గతంలో రూ.15 కోట్లు విశ్వవిద్యాలయంలోని K-Hub భవన నిర్మాణం, వసతుల కొరకు విడుదల చేసారు. ప్రస్తుతం మిగతా రూ.35 కోట్లు పరిశోధన ప్రాజెక్టుల నిమిత్తం ఉత్తర్వులను విడుదల చేసింది.

News July 10, 2024

వనపర్తి: ప్రేమ పేరుతో మోసం..

image

ప్రేమ పేరుతో ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు చేశామని ఎస్సై బి.సురేశ్ తెలిపారు. వనపర్తి జిల్లా పెద్ద మందడికి చెందిన సంతోష్ గత మూడేళ్ల నుంచి ఓ యువతిని ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. వివాహంపై ఆ యువతి ప్రశ్నించగా తప్పించుకు తిరుగుతున్నాడు. పెద్దలతో మాట్లాడినా మార్పు రాకపోవడంతో మోసం చేసిన సంతోష్‌తో పాటు అతని తల్లి జానకిపై మంగళవారం కేసు నమోదు అయినట్లు ఎస్సై తెలిపారు.

News July 10, 2024

నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం..!

image

నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాని వెల్లడించింది. నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సరైనా వర్షాలు లేక జిల్లాలోని ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి.

News July 10, 2024

భార్యపై అనుమానం.. మల్కాజిగిరిలో మర్డర్

image

అనుమానంతో భార్యను చంపేశాడో భర్త. మల్కాజిగిరి పోలీసుల వివరాల ప్రకారం.. విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన రాజేందర్‌(45), కృష్ణకుమారి(38) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. కాచిగూడలోని ఓ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సుగా‌ పని చేస్తున్న ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి‌ గొడవ పడి‌ విచక్షణ రహితంగా దాడి చేశాడు. దెబ్బలు తాళలేక కృష్ణకుమారి గదిలోనే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 10, 2024

MBNR: ప్రాజెక్ట్ కింద భూసేకరణ చెల్లింపులను తక్షణమే చేయాలి: ఎంపీ

image

ప్రాజెక్ట్ కింద భూసేకరణ చెల్లింపులను తక్షణమే చేయాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సీఎం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. జూరాల నుంచి పాలమూరు-రంగారెడ్డికి నీరు తీసుకుంటేనే PRSI పథకం పూర్తవుతుంది. NRPTలో టెక్స్‌టైల్ పార్కు, గద్వాలలో హ్యాండ్లూమ్ పార్కు, ఉమ్మడి MBNR జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు.

News July 10, 2024

భార్యపై అనుమానం.. మల్కాజిగిరిలో మర్డర్

image

అనుమానంతో భార్యను చంపేశాడో భర్త. మల్కాజిగిరి పోలీసుల వివరాల ప్రకారం.. విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన రాజేందర్‌(45), కృష్ణకుమారి(38) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. కాచిగూడలోని ఓ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సుగా‌ పని చేస్తున్న ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి‌ గొడవ పడి‌ విచక్షణ రహితంగా దాడి చేశాడు. దెబ్బలు తాళలేక కృష్ణకుమారి గదిలోనే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 10, 2024

నల్గొండ: ప్రాణం తీసిన గడ్డివాము పంచాయతీ

image

అనంతగిరి మండలం వెంకట్రాంపురంలో గడ్డి వాము పంచాయతీ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పల్లె సుధాకర్, తుళ్లూరు అచ్చయ్య గడ్డివాము విషయంలో గొడవపడ్డారు. అచ్చయ్య సుధాకర్‌ను నెట్టి వేయగా సుధాకర్ తలకు తీవ్ర గాయమైంది. హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనంతగిరి ఎస్ఐ తెలిపారు.

News July 10, 2024

పెద్దపల్లి: ఏడో తరగతి విద్యార్థి మృతి

image

ఏడో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. SI సాంబమూర్తి వివరాల ప్రకారం.. ఎలిగేడు మండలానికి చెందిన సదయ్య కుమారుడు శ్రీవత్సవ్‌(13)కు ఒక కన్ను కనిపించకపోవడంతో రేకుర్తిలోని ప్రభుత్వ అందుల పాఠశాలలో ఆరేళ్ల క్రితం చేర్పించారు. అయితే బాలుడు
దుస్తులు ఆరవేసే తీగపై ఉన్న టవల్‌ను మెడకు చుట్టుకొని ఆడుకుంటుండగా మరణించినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.