Telangana

News July 10, 2024

హైదరాబాద్‌: డిజిటల్ ప్లాన్ సక్సెస్.. తీరనున్న కష్టాలు

image

TGSRTCలో‌ టికెట్‌ కొనేవారికి చిల్లర కష్టాలు తీరనున్నాయి. డిజిటల్‌ చెల్లింపు‌ల విధానం తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బండ్లగూడ డిపోలో పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టారు. 70 బస్సుల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిజిటల్ పేమెంట్స్‌ విజయవంతమయ్యాయి. ఆటోమెటిక్ ఫెయిర్ కలెక్షన్ సిస్టమ్ ద్వారా ఫోన్ పే, G pay, Paytm, డెబిట్, క్రెడిట్ కార్డుతోనూ చెల్లింపు చేయవచ్చు. SHARE IT

News July 10, 2024

హైదరాబాద్‌: డిజిటల్ ప్లాన్ సక్సెస్.. తీరనున్న కష్టాలు

image

TGSRTCలో‌ టికెట్‌ కొనేవారికి చిల్లర కష్టాలు తీరనున్నాయి. డిజిటల్‌ చెల్లింపు‌ల విధానం తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బండ్లగూడ డిపోలో పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టారు. 70 బస్సుల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిజిటల్ పేమెంట్స్‌ విజయవంతమయ్యాయి. ఆటోమెటిక్ ఫెయిర్ కలెక్షన్ సిస్టమ్ ద్వారా ఫోన్ పే, G pay, Paytm, డెబిట్, క్రెడిట్ కార్డుతోనూ చెల్లింపు చేయవచ్చు. SHARE IT

News July 10, 2024

NZB: ఆన్‌లైన్ మోసం..ఫోన్‌కు బదులు బెల్ట్

image

ఫోన్‌కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే బెల్ట్ వచ్చిన ఘటన నవీపేట మండలం శివతండాలో జరిగింది. గ్రామస్థుల ప్రకారం.. రైతు జీవన్‌కు గతనెల 10న ఓ ఆన్‌లైన్ కంపెనీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రూ. 25వేల ఫోన్..మీకు లక్కీ డ్రాలో రూ.5 వేలకు వచ్చిందని చెప్పారు. దీంతో రైతు సమ్మతించారు. నిన్న ఆర్డర్‌బాక్స్‌ను పోస్ట్‌మెన్ జీవన్‌కు ఇచ్చి రూ.5 వేలు తీసుకున్నాడు. డబ్బాను తెరిచి చూడగా అందులో బెల్ట్ ఉండటంతో రైతు అవాక్కయ్యాడు.

News July 10, 2024

మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తిన వరద

image

మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద పోటెత్తింది. 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న బ్యారేజీకి ఇన్‌ఫ్లో 20, 260 క్యూసెక్కులు ఉండగా మంగళవారం ఇన్‌ఫ్లో 35,200 క్యూసెక్కులు పెరిగింది. దీంతో మొత్తం 85 గేట్లు ఎత్తి.. అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ రివర్ బెడ్ లెవల్ సముద్ర మట్టానికి 88 మీటర్లు కాగా.. 89.60 మీటర్ల ఎత్తులో వదర ప్రవహిస్తోంది.

News July 10, 2024

జేఎల్ ఫలితాలు.. మెట్‌పల్లి యువతి రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు

image

ఇటీవల విడుదలైన ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల పోస్టుల ఫలితాల్లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన యువతి రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు సాధించింది. పట్టణంలోని కళానగర్‌కు చెందిన జనమంచి సాయిశిల్ప ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆంగ్ల విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. గతంలో 4 ఉద్యోగాలు సాధించిన సాయిశిల్ప.. గురుకుల డిగ్రీ ఆంగ్ల అధ్యాపకురాలు పోస్టుల ఫలితాల్లో రాష్ట్రంలోనే రెండో ర్యాంకు సాధించింది.

News July 10, 2024

STATE 1ST ర్యాంక్ సాధించిన ఆదిలాబాద్ యువకుడు

image

ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2015 బ్యాచ్‌కు చెందిన బీ.కాం. విద్యార్థి యోగేంద్రసింగ్ జూనియర్ లెక్చరర్ల పోస్టులకు జరిగిన పరీక్ష ఫలితాలలో హిందీ సబ్జెక్టులో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ప్రిన్సిపల్ డాక్టర్ అచ్చి శ్రీనివాస్, కామర్స్ ప్రిన్సిపల్ డాక్టర్ జలగం అనిత, తన హిందీ గురువు T. ప్రతాప్ సింగ్, అధ్యాపకులు జగరామ్, దయాకర్ యువకుడిని సన్మానించి అభినందించారు.

News July 10, 2024

వరంగల్ నగరవాసులకు ఏసీపీ హెచ్చరిక

image

వరంగల్ నగరంలో ఏసీపీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లో రాత్రి 11.50 నిమిషాల ప్రాంతంలో కొంతమంది యువకులు రోడ్డుపై వెళ్తుండగా వారిని ఆపి ఏసీపీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి రోడ్లపై మీకు ఏం పని అంటూ.. వివరాలు ఆరా తీశారు. మరోసారి రాత్రి పూట రోడ్లపై కనిపిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

News July 10, 2024

సంగారెడ్డి: ప్రతిరోజు మధ్యాహ్న భోజన వివరాలను పంపాలి

image

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వివరాలను ప్రతిరోజు ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని డీఈవో వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈనెల 10 నుంచి ప్రతి రోజు ఫోటో తప్పనిసరిగా పంపాలని చెప్పారు. విద్యార్థి పూర్తి వివరాలను నమోదు చేయాలని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని ప్రధానోపాధ్యాయులకు మెమో జారీ చేస్తామని తెలిపారు.

News July 10, 2024

కాంగ్రెస్, BRSపై డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు

image

దొంగలు దొంగలు ఒకటై నడిగడ్డ ప్రాంతాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని MP డీకే అరుణ BRS, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పరీక్ష విమర్శలు చేశారు. గద్వాల విజయోత్సవ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాకుండా అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తనను ఓడించాలని శపథాలు చేసి ఊరూరు తిరిగి ప్రచారం చేసినా ప్రజలకు తానేంటో తెలుసునని, అందుకే తనను గెలిపించాలని డీకే అరుణ అన్నారు.

News July 10, 2024

HYD: ఒక్క క్లిక్.. KG TO PG పుస్తకాలు!

image

ఒక్క క్లిక్ చేస్తే విద్యా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుందని HYD లైబ్రరీ అధికారులు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కేజీ నుంచి పీజీ విద్యార్థుల పుస్తకాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (https://ndl.iitkgp.ac.in) వెబ్‌సైట్‌లో లభిస్తాయి. నీట్, జేఈఈ, యూజీసీ నెట్, గేట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ పోటీ పరీక్షల మెటీరియల్స్‌ ఉన్నాయి.