Telangana

News July 10, 2024

HYD: హోటళ్లు, రెస్టారెంట్లపై ఇలా ఫిర్యాదు చేయండి.!

image

HYD, RR, MDCL,VKB జిల్లాల్లోని హోటళ్లు, రెస్టారెంట్‌లు, చాయ్ బండ్లు, పానీపూరి బండ్లలో పాడైన ఆహారాన్ని విక్రయించడం, బిర్యానీలో బొద్దింక, పూరిలో గుండు పిన్ను లాంటివి రావడంతో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. కలుషిత ఆహారాన్ని గుర్తిస్తే వాట్సాప్ నం. 9100105795, 040-21111111, మెయిల్, ‘X’లో తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఫిర్యాదు అందితే వెంటనే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.
SHARE IT

News July 10, 2024

HYD: హోటళ్లు, రెస్టారెంట్లపై ఇలా ఫిర్యాదు చేయండి.!

image

HYD, RR, MDCL,VKB జిల్లాల్లోని హోటళ్లు, రెస్టారెంట్‌లు, చాయ్ బండ్లు, పానీపూరి బండ్లలో పాడైన ఆహారాన్ని విక్రయించడం, బిర్యానీలో బొద్దింక, పూరిలో గుండు పిన్ను లాంటివి రావడంతో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. కలుషిత ఆహారాన్ని గుర్తిస్తే వాట్సాప్ నం. 9100105795, 040-21111111, మెయిల్, ‘X’లో తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఫిర్యాదు అందితే వెంటనే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.SHARE IT

News July 10, 2024

సంగారెడ్డి: ‘ప్రతిభతో ఉద్యోగాలు సాధించాలి’

image

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతిభ కనబరిచిన వారికే ఉద్యోగావకాశాల సాధ్యమని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జ్యోతి పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని జిల్లా సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాను ఆమె ప్రారంభించారు. చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎం కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.

News July 10, 2024

బడి పిల్లల బాధ్యత మహిళా సంఘాలదే: రేవంత్

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో బడికి వెళ్లని పిల్లలను బడికి తీసుకొచ్చే బాధ్యతను మహిళా సంఘాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నేడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విద్యాశాఖపై నిర్వహించిన రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల పరిశుభ్రత బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించాలన్నారు. పైలట్ ప్రాజెక్టు ఇక్కడి నుంచే ఈ కార్యక్రమాలు ప్రారంభించాలని అన్నారు.

News July 10, 2024

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. కలెక్టరేట్లో లింగ నిర్ధారణ చట్టం పైన జిల్లాస్థాయి మల్టీ మెంబర్ కమిటీ సమావేశం నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ. లక్ష వరకు జరిమానా వేయనున్నట్లు తెలిపారు.

News July 10, 2024

CM రేవంత్ రెడ్డిని కలిసిన ఈరవత్రి అనిల్

image

తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో కార్పొరేషన్ పదవి ఇచ్చినందుకు ఆయనకు అనిల్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనిల్‌కు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

News July 10, 2024

పదేళ్ల పాలనలో గద్వాలకు చేసిందేమీ లేదు: డీకే అరుణ

image

పదేళ్ల BRS పాలనలో గద్వాల ఎలాంటి అభివృద్ధి జరగ లేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. బుధవారం పట్టణంలోని ఎస్వీ ఈవెంట్ హాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఇండ్లు, ఇండ్ల పట్టాలు, రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో మిగిలిన పనులు చేయలేదన్నారు. ఇక్కడి నేతలు అధికారం కొరకు పాకులాడుతున్నారని, ఎమ్మెల్యే బండ్ల ఏం చేసేందుకు కాంగ్రెస్‌లో చేరారని ప్రశ్నించారు.

News July 10, 2024

కొత్తగూడెం: ‘సింగరేణిపై కేంద్రం కుట్రలను ఉద్యమాల ద్వారా తిప్పికొట్టాలి’ 

image

చట్టసభలో ఉన్న మందబలంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటుందని కొత్తగూడెం శాసనసభ సభ్యుడు, సింగరేణి గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షుడు,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. చట్టాలను తీసుకొస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేటుకు ధారాదత్తం చేస్తోందని అన్నారు. అందులో భాగంగానే తెలంగాణలోని సింగరేణి సంస్థను దశలవారీగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు.

News July 10, 2024

NLG: ఆకతాయిలకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్

image

మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తూ పోలీస్ శాఖ వారికి రక్షణ కల్పిస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్, షీటీమ్ పోలీస్ స్టేషన్, భరోసా సెంటర్లను ఎస్పీ మంగళవారం పరిశీలించారు. ఆకతాయిలు మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ సందర్భంగా ఎస్సీ హెచ్చరించారు.

News July 10, 2024

KNR: డయేరియా నివారణకు కృషిచేయాలి: కలెక్టర్

image

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డయేరియా వ్యాధి నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నారులు డయేరియా వ్యాధి బారిన పడకుండా వైద్యాధికారులు ప్రత్యేకచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డయేరియా నివారణకు కృషిచేయాలన్నారు. ఈ వ్యాధి నివారణ తీసుకోవాల్సిన చర్యలపై ప్లాష్ మాబ్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు.