Telangana

News July 9, 2024

మెదక్: గట్టు పంచాయితీ.. కట్టేసి కొట్టారు !

image

కొల్చారం మండలం సంగాయి పేట గ్రామంలో ఇరువు వర్గాల మధ్య గట్టు పంచాయితీ తలెత్తింది. మాట మాట పెరిగి ఘర్షణ జరగడంతో ఒకరి తలకు తీవ్రంగా గాయం కాగా రక్తస్రావమైంది. మరొకరిని రేకుల షెడ్డు పైపుకు తాడుతో కట్టేసి కొట్టినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న కుల్చారం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 9, 2024

ఖమ్మం: హోంగార్డ్ ఆఫీసర్స్‌కు ఆర్థిక సహాయం

image

ఖమ్మం జిల్లాలోని హోంగార్డు ఆఫీసర్స్‌కు ఆర్థిక సహాయాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అందజేశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోనే హోంగార్డులకు అదేవిధంగా హోంగార్డు కుమార్తెల వివాహలు కోసం మంజురైన, ఆర్థిక సహాయాన్ని పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ నగదు చెక్కులను పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందుకున్న వారిలో హోంగార్డు ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, ఉపేందర్, నవీన్, కోటేశ్వరరావు, కిషన్ ఉన్నారు.

News July 9, 2024

కేసీఆర్‌పై అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు

image

మాజీ సీఎం కేసీఆర్‌పై సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్‌ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈమేరకు బీఆర్‌ఎస్‌ ధూళిమిట్ట మండల యూత్‌ అధ్యక్షుడు సాయిలు ఆధ్వర్యంలో పలువురు మద్దూరు ఏఎస్సై జగదీశ్వర్‌కు ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో ఆదిత్యచౌదరి రాయుడు అనే వ్యక్తి మద్యం సీసాలతో కూడిన కుర్చిలో కూర్చున్నట్లు కేసీఆర్‌ ఫొటోను మార్ఫింగ్‌ చేసి పోస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు.

News July 9, 2024

KMM: ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులకు టోకరా!

image

ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులను మోసం చేసిన నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఉద్యోగాల పేరుతో 60 మంది అమాయక నిరుద్యోగుల నుంచి ఘరానా మోసగాళ్లు రూ.4,08,00,000 వసూలు చేశారని మీడియా సమావేశంలో వెల్లడించారు. మొత్తం 13 మంది నిందితులను గుర్తించగా పది మందిని అరెస్ట్ చేశామన్నారు. రూ.కోటి 47 లక్షల 14 వేలు, 4 తులాల బంగారం, ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు.

News July 9, 2024

KMM: రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం: మాజీ MLA

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు చూసి బాధగా ఉందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాంతారావు అన్నారు. పొద్దుటూరులో ఒక రైతు, భద్రాద్రి జిల్లా జానకిపురంలో మరో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. రైతులెవరూ ధైర్యం కోల్పోవద్దని, రైతాంగానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అండగా ఉంటారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని ఆయన మండిపడ్డారు.

News July 9, 2024

నామినేటెడ్ పోస్టుల్లో ఖమ్మంకి పెద్దపీట..!

image

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవుల నియామకాలు జరుపుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి జీవో నెంబర్ 442ను విడుదల చేసి, రెండు సంవత్సరాలు పదవుల్లో కొనసాగే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాకు నాలుగు పదవులు రాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఒక్క పదవి వచ్చింది.

News July 9, 2024

సంగారెడ్డి: విజ్ఞాన్ మంథన్‌కు దరఖాస్తు చేసుకోవండి

image

జిల్లాలోని 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు విజ్ఞాన్ మంథన్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి మంగళవారం తెలిపారు. సెప్టెంబర్ 15లోగా www.vvm.org.in వెబ్ సైట్‌లో రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులను ప్రభుత్వం అందిస్తుందన్నారు.

News July 9, 2024

ఖమ్మం నగరంలో రేపు డిప్యూటీ సీఎం పర్యటన

image

ఖమ్మం నగరంలో బుధవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా డిప్యూటీ సీఎం కలెక్టరేట్‌లో రైతు భరోసాపై నిర్వహించే సమావేశంలో హాజరవుతారని అన్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గమనించాలని పేర్కొన్నారు.

News July 9, 2024

జనగామ: ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

image

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ పంచాయతీ కార్యదర్శి పట్టుబడిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో జరిగింది. గ్రామ తాజా మాజీ సర్పంచ్ భర్త గవ్వాని నాగేశ్వరరావు పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో కార్యదర్శిని సంప్రదించారు. ఈ క్రమంలో కార్యదర్శి లంచం డిమాండ్ చేశారు. నేడు రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం అతణ్ని విచారిస్తున్నారు.

News July 9, 2024

ఖమ్మం జిల్లాపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్  

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాకు చెందిన కిన్నెరసాని, ఖమ్మం జిల్లాకు చెందిన కనకగిరి అటవీ ప్రాంతాలను చేర్చారు. కిన్నెరసాని అభయారణ్యానికి పెట్టింది పేరు. 635చ.కి.మీ.లో ఇది విస్తరించింది. కనకగిరి రిజర్వు ఫారెస్ట్ 20,923హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది. పాల్వంచలో త్వరలోనే సఫారీ, ట్రెక్కింగ్ ఏర్పాటు చేయనున్నారు.