Telangana

News July 9, 2024

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌పై సీఎం కీలక ఆదేశాలు

image

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. MBNR కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం సమీక్షించారు. డిసెంబర్ 2025లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాల్సిందేనన్నారు. ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

News July 9, 2024

ఖమ్మం: జిల్లాలో సాగర్ కాలువలపై చోరీల కలకలం?

image

నాగార్జున సాగర్ ప్రధాన కాలువలపై ఉండే క్రాస్ రెగ్యులేటర్ల వద్ద షట్టర్లు ఎత్తేందుకు, దింపేందుకు ఉపయోగించే ఇత్తడి చక్రాలు చోరీకి గురవుతున్నాయని స్థానికులు తెలిపారు. ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలాలు, తనికెళ్ల, ఏన్కూరు, కల్లూరు ప్రాంతాల్లో క్రాస్ రెగ్యులేటర్లున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల అంతటా ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి.

News July 9, 2024

విదేశీ స్కాలర్ షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం

image

విదేశాల్లో చదువుకునే వారు స్కాలర్షిప్ పొందేందుకు అర్హులైన మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారి టి.విజేందర్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, డాక్టోరల్ కోర్సు అభ్యసిస్తూ ఉపకార వేతనం పొందవచ్చన్నారు. telangana epass.cgg.gov.inలో దరఖాస్తు తీసుకోవాలని సూచించారు.

News July 9, 2024

ఖమ్మం: TGSRTC ఎంప్లాయ్ వెల్ఫేర్ మెంబెర్స్‌తో RM సమావేశం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరి రామ్ అన్ని డిపోల ఎంప్లాయ్ వెల్ఫేర్ మెంబెర్స్‌తో ఈరోజు సమావేశం నిర్వహించారు. డిపోలో ఉన్న సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. డిపోలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన రీజనల్ మేనేజర్‌కుTGSRTC ఎంప్లాయ్ వెల్ఫేర్ మెంబెర్స్ పూలబొకే అందజేశారు.

News July 9, 2024

సంగారెడ్డి: చట్నీలో ఎలుక ఘటనపై అదనపు కలెక్టర్ ఫైర్

image

సంగారెడ్డి జిల్లాలోని జేఎన్టీయూలో చట్నీలో ఎలుక ఘటనపై అదనపు కలెక్టర్ మాధురి స్పందించారు. క్యాంపస్‌కు వెళ్లి విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్న ఆమె కిచెన్‌లో అపరిశుభ్రంగా ఉంటడంతో ప్రిన్సిపల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ కాంట్రాక్టర్‌ను మార్చాలని ఆదేశించారు. విద్యార్థులే కావాలని చట్నీలో ఎలుకను వేశారని ప్రిన్సిపల్ చెప్పగా తినే ఆహారంలో ఎందుకు వేస్తారని అదనపు కలెక్టర్ నిలదీశారు

News July 9, 2024

KNR: డ్రగ్స్ నియంత్రణపై కలెక్టర్ అవగాహన

image

అధికారులు, ప్రజలు అందరం కలిసి డ్రగ్స్ అనే మహమ్మారిని జిల్లా నుంచి తరిమికొడదామని, డ్రగ్స్ రహిత జిల్లాగా తయారు చేద్దామని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణపై ఎక్సైజ్‌శాఖ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ అవగాహన సమావేశం నిర్వహించారు. యువత డ్రగ్స్, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వ్యసనాల బారిన పడి యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు.

News July 9, 2024

వన మహోత్సవంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన మహోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలా జరుగుతోందని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు.

News July 9, 2024

మహిళా సంఘాలను బలోపేతం చేస్తాం: రేవంత్ రెడ్డి

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఇందిర మహిళా శక్తి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళా సంఘాలను అన్ని విధాల బలోపేతం చేస్తామని వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 3620 మహిళా సంఘాలకు రూ.334.2 కోట్ల నిధులను విడుదల చేశారు.

News July 9, 2024

ఉమ్మడి జిల్లాలో త్వరలోనే ‘రైతు భరోసా’

image

వానాకాలం పంటల నుంచే కౌలు రైతులకూ పెట్టుబడి సాయమందిస్తామని కాంగ్రెస్ సర్కారు స్పష్టం చేసింది. కౌలుదారులకు ‘రైతు భరోసా’పై మార్గదర్శకాలను త్వరలోనే రూపొందిస్తామని తెలిపింది. ఈమేరకు కౌలు రైతుల లెక్కలు తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం.. ఖమ్మం జిల్లాలో 3,42,803 మంది రైతులు, భద్రాద్రిలో 1.70 లక్షల మంది ఉన్నారు.

News July 9, 2024

సీతారాం ప్రాజెక్టు పంప్ హౌస్ కోసం చైనా ఇంజనీర్లు: మంత్రి

image

సీతారాం ప్రాజెక్టు పంప్ హౌస్ కోసం చైనా ఇంజనీర్లను రప్పిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చైనా నుంచి ఇంజనీర్లు రాగానే వారం రోజుల్లోనే ట్రయల్ రన్ పూర్తి అవుతుందన్నారు. ఆగస్టు నెలలో గోదావరి జలాలను వైరా ప్రాజెక్ట్ కు గోదావరి జలాలు తరలింపు పూర్తి చేస్తామన్నారు. సాగర్ నుంచి నీళ్లు రాకపోయినా వైరా ప్రాజెక్ట్ , లంకాసాగర్ సత్తుపల్లి, సాగర్ కాలువలకు నీటిని పంపిస్తామన్నారు.