Telangana

News July 9, 2024

నేరడిగొండ: ప్రమాదవశాత్తు లారీ డ్రైవర్ మృతి

image

లారీకి మరమ్మతులు చేస్తుండగా ఓ డ్రైవర్ ప్రమాదవశాత్తు మరణించిన ఘటన నేరేడిగొండ మండలం ఆరేపల్లిలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి రబ్బర్ లోడుతో తమిళనాడు-ఢిల్లీకి వెళ్తుండగా అకస్మాత్తుగా లారీ నిలిచిపోయింది. డ్రైవర్ లారీని నిలిపి హ్యాండ్ బ్రేక్ వేయకుండా టైర్ల వద్ద మరమ్మతులు చేస్తుండడంతో లారీ వెనక్కి వచ్చి డ్రైవర్‌పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడని పేర్కొన్నారు.

News July 9, 2024

ప్రియదర్శిని జూరాల UPDATES

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి ఇన్ ఫ్లో స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. అక్కడక్కడ కురుస్తున్న వర్షాల వల్ల ఇన్ ఫ్లో మరింత పెరిగి సోమవారం ప్రాజెక్టుకు 2,051 క్యూసెక్కుల ఇన్ ఫ్లో చేరినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 132 క్యూసెక్కులతో కలిపి మొత్తం 132 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 7.701 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

News July 9, 2024

NLG: గ్రూప్ 2 ఉచిత గ్రాండ్ టెస్టులు

image

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన tgpsc గ్రూప్-2 ఉచిత గ్రాండ్ టెస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.విజయ్కుమార్ తెలిపారు. ఈ నెలలో మొత్తం 4 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.

News July 9, 2024

భద్రాద్రి: డెంగ్యూతో డాక్టర్ మృతి

image

డెంగ్యూ వ్యాధితో డాక్టర్ మృతి చెందిన ఘటన మణుగూరు మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని పీవీ కాలనీకి చెందిన డాక్టర్ నాగవరపు దిలీప్ తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులుపరీక్షలు నిర్వహించగా డెంగ్యూ నిర్ధారణ అయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో డాక్టర్ దిలీప్ మరణించారు.

News July 9, 2024

పద్మాక్షి అమ్మవారికి పదివేల గాజులతో ప్రత్యేక అలంకరణ

image

హన్మకొండలో ప్రసిద్ధిచెందిన హనుమద్గిరి పద్మాక్షి దేవి ఆలయంలో శాఖంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పద్మాక్షి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. ఉత్సవాల్లో భాగంగా నేడు నాలుగవ రోజు అమ్మవారికి 10,008 గాజులతో, వివిధ రకాల పూలతో, కూరగాయలతో అలంకరించారు. అలాగే భక్తుల సమక్షంలో అమ్మవారికి హారతి ఇచ్చారు. స్థానిక భక్తులు గుట్టపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

News July 9, 2024

కార్పొరేషన్ ఛైర్మన్ల జాబితాలో ఉమ్మడి జిల్లాలో ఐదుగురికి చోటు

image

ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్ల జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐదుగురికి చోటు దక్కింది. ఇందులో ఇద్దరు వికారాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా.. ముగ్గురు రంగారెడ్డి జిల్లా వారున్నారు. మేడ్చల్ జిల్లా నుంచి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లభించలేదు. తొలి విడతలో పదవులు దక్కని వారంతా రెండో జాబితాలోనైనా తన పేరు వస్తుందని ఆశతో ఉన్నారు.

News July 9, 2024

ఖమ్మం జిల్లాలో వరుస భూవివాదాలు

image

ఖమ్మం జిల్లాలో భూ వివాదాలకు పరిష్కారం దొరకడం లేదు. భూ వివాదం పరిష్కారం గాక, భూమిని దున్నుకోలేక , ఇతరుల చెరలో ఉన్న భూమిని విడిపించుకోలేక ఆత్మహత్య చేసుకుంటేనో లేదా ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే తప్ప పరిష్కార మార్గం దొరకదన్న భావన బలపడుతుండడం అత్యంత ప్రమాదకరం. ఈ నేపథ్యంలో జిల్లాలో వరుస ఘటనలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ క్రమంలో దీనిపై అధికారులు రైతంగానికి అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.

News July 9, 2024

రాంచంద్రంపురం: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బండ్లగూడ మార్క్స్ నగర్‌లో ఒడిశాకు చెందిన సరోజ్ కుమార్(40) సెక్యూరిటీ గార్డ్ పని చేస్తున్నాడు. అతను గంజాయికి బానిసై ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి రూ.27,500 విలువ గల 1,100 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్, బైకును స్వాధీనం చేసుకున్నట్లు ఆర్సీపురం పోలీసులు తెలిపారు.

News July 9, 2024

నల్గొండ: డ్రోన్‌తో ఎరువుల పిచికారీ

image

రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన మంగినపల్లి నర్సిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో “డ్రోన్ వ్యవసాయ రసాయన పిచికారి” యంత్రాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని విద్యగా ఎంచుకోవడం దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

News July 9, 2024

MBNR: పదవీ కాలం ముగిసినా.. అందని వేతనాలు!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవీ కాలం ముగిసినప్పటికీ వారికి గౌరవ వేతనం అందలేదు. ZPTC, MPP, MPTC 8నెలల వేతనం చెల్లించాల్సి ఉంది. 2023 అక్టోబరు వరకు వేతనాలు అందాయి. ఆ తర్వాత వీరికి వేతనం అందలేదు. ఈనెల 3న MPPలు, MPTCల పదవీ కాలం ముగియగా, 4న జడ్పీ ఛైర్‌పర్సన్, ZPTCల పదవీ కాలం ముగిసింది. ZP ఛైర్‌పర్సన్‌కు నెలకు రూ. లక్ష, ZPTCలకు రూ.13 వేలు, MPTCలకు రూ.6,500 వేతనం ఉంది.