Telangana

News September 1, 2025

NLG: జిల్లాలో పరిషత్ ఎన్నికల సందడి

image

పరిషత్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతుంది. జిల్లాలో పోలింగ్ కేంద్రాలు వాటి స్థితిగతులను పరిశీలించి జాబితా రూపకల్పన చేసి నివేదికలను ఉన్నత అధికారులకు పంపించేందుకు కసరత్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 33 ఎంపీపీలు, 353 ఎంపీటీసీ, 31 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. కలెక్టర్ ఆమోదంతో పోలింగ్ స్టేషన్లో తుది జాబితాను ఎంపీడీవోలు ప్రచురించనున్నారు.

News September 1, 2025

NZB: గణపతుల నిమజ్జనానికి ఇలా వెళ్లాలి: CP

image

8 ఫీట్ల లోపు విగ్రహాలు నెహ్రూపార్క్, అర్సపల్లి, జాన్కంపేట్, నవీపేట మీదుగా బాసరకు వెళ్లాలని CP సాయిచైతన్య చెప్పారు. 8 ఫీట్ల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలు పులాంగ్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్, బస్టాండ్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, శివాజీ చౌక్, దుబ్బా, జీజీ కాలేజీ చౌరస్తా, బైపాస్ రోడ్డు, ముబారక్ నగర్, మాణిక్ బండార్, దాస్ నగర్, మాక్లూర్, నందిపేట్ మండలంలోని ఉమ్మెడ వద్ద గోదావరి బ్రిడ్జి వద్దకు వెళ్లాలన్నారు.

News September 1, 2025

WGL: ఆగస్టు మాసాన్ని ఒక్కసారి నెమరేసుకుందామా..!

image

1. ఓరుగల్లు నగరాన్ని ముంచెత్తిన వానలు
2. కాంగ్రెస్ జనహిత పాదయాత్ర
3. DCCB, సొసైటీల పదవీ కాలం పెంపు
4. ఖిలా వరంగల్ తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు
5. వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం
6. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
7. యూరియా కొరతతో రైతుల ధర్నాలు
8. పంద్రాగస్టు వేడుకలు
9. శ్రావణమాసంతో ఆలయాలు కిటకిట
10. భద్రకాళి ఆలయ ఈవోల బదిలీ

News September 1, 2025

MDK: షీ టీమ్స్ కఠిన చర్యలు.. మహిళల భద్రతే లక్ష్యం: ఎస్పీ

image

ఆగస్టు నెలలో షీ టీమ్స్ కఠిన చర్యలు తీసుకుని 2 ఎఫ్‌ఐఆర్‌లు, 18 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ డీవి శ్రీనివాసరావు తెలిపారు. మహిళల భద్రత కోసం 73 మందికి కౌన్సెలింగ్ ఇచ్చామని, 47 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఫిర్యాదుల కోసం పోలీస్ హెల్ప్‌లైన్ 100 / 8712657963 అందుబాటులో ఉందని, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని ఎస్పీ హామీ ఇచ్చారు.

News September 1, 2025

వరంగల్: మళ్లీ ముసురుకుంటున్న వాన..!

image

మూడు రోజులుగా గెరువిచ్చిన వాన మళ్లీ ముసురుకుంటోంది. ఆదివారం రాత్రి నుంచి చినుకులు పడుతూనే ఉన్నాయి. సోమవారం ఉదయం నగరంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. జిల్లాలో సరాసరి 35 మి.మీ వర్షపాతం నమోదు కాగా ఖానాపూర్‌లో 88 మి.మీ అధిక వర్షపాతం నమోదయ్యింది. అలాగే చెన్నరావుపేటలో 80 మి.మీ, నల్లబెల్లిలో 67.1 మి.మీ వర్షపాతం నమోదు కాగా మిగతా మండలాల్లో మోస్తరు నుంచి సాధారణ వర్షపాతం నమోదైంది.

News September 1, 2025

మెదక్‌లో భారీ వర్షం.. అత్యధిక వర్షపాతం నమోదు

image

మెదక్ పట్టణంలో అర్ధరాత్రి నుంచి ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో 46.3 మి.మీ., సర్ధనలో 43.3 మి.మీ., మెదక్ మండలం రాజుపల్లిలో 36.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. చేగుంటలో 16 మి.మీ.లకుపైగా వర్షం పడింది. దీంతో మెదక్, హవేలీ ఘనపూర్, రామాయంపేట, పాపన్నపేట మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

News September 1, 2025

కరీంనగర్ జిల్లాకు మొండిచేయి

image

సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలు (నంబరు 20101/02)కు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించిన విషయం తెలిసిందే. అయితే, జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో కూడా హాల్టింగ్ కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. జమ్మికుంటలో హాల్టింగ్ కల్పిస్తే.. HZBD, HSNB, పరకాల, భూపాలపల్లి, మానకొండూరు ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలగనుంది. సమస్యపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చొరవ చూపాలని కోరుతున్నారు.

News September 1, 2025

మద్యం తాగి హంగామా చేసే కఠిన చర్యలు- SP

image

ఉత్సవాల పేరుతో మద్యం తాగి హంగామా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. నిమజ్జన ఘాట్ల వద్ద డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని, పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల పరిస్థితిని నిరంతరం పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ శాంతి భద్రతకు సహకరించాలన్నారు.

News September 1, 2025

NIMSలో పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు

image

నేటి నుంచి పంజాగుట్టలోని నిమ్స్‌లో చిన్నారులకు బ్రిటన్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత గుండె ఆపరేషన్లు జరగనున్నాయి. ఈ శిబిరం సెప్టెంబర్ 21 వరకు జరగనుంది. మంగళ, గురు, శుక్రవారాలలో ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఆస్పత్రిలో సంప్రదించవచ్చు. పుట్టుకతో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లలను పరీక్షించి, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తారు.
SHARE IT

News September 1, 2025

NZB: ధ్వంసమైన అంతర్రాష్ట్ర బ్రిడ్జి

image

రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం బ్రిడ్జి వరద కారణంగా ధ్వంసమైంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద రావడంతో మునిగిపోయింది. బ్రిడ్జిపై నుంచి సైతం వరద నీరు ప్రవహించడంతో రోడ్డు మార్గం ధ్వంసం అయింది. మహారాష్ట్ర నుంచి వరద నీరు తగ్గుముఖం పడటంతో త్రివేణి సంగమం వద్ద సైతం వరద ఉద్ధృతి తగ్గింది.