Telangana

News July 9, 2024

వరంగల్ మార్కెట్లో పత్తి ధర రూ.7,240

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం రూ.7,200 పలికిన క్వింటా పత్తి.. ఈరోజు రూ.40 పెరిగి, రూ.7,240 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. పత్తి ధర మరింత పెరగాలని రైతన్నలు ఆకాంక్షిస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ మార్కెట్ కు సరుకులు తీసుకొని రావాలని అధికారులు కోరుతున్నారు.

News July 9, 2024

BREAKING.. WGL: సెప్టిక్ ట్యాంక్‌లో పడి బాలుడి మృతి

image

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి వద్దకు తల్లితో వచ్చిన బాలుడు.. ఆడుకుంటూ వెళ్లి మూత తెరిచిఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడ్డాడు. కాగా, మృతుడి కుటుంబం MHBD జిల్లాకురవి మండలం సుదనపల్లికి చెందినవారు కాగా.. ఉపాధి నిమిత్తం పెద్దపల్లిలో ఉంటున్నారు.

News July 9, 2024

BREAKING.. KNR: సెప్టిక్ ట్యాంక్‌లో పడి బాలుడి మృతి

image

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి వద్దకు తల్లితో వచ్చిన బాలుడు.. ఆడుకుంటూ వెళ్లి మూత తెరిచిఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడ్డాడు. కాగా, మృతుడి కుటుంబం MHBD జిల్లాకురవి మండలం సుదనపల్లికి చెందినవారు కాగా.. ఉపాధి నిమిత్తం పెద్దపల్లిలో ఉంటున్నారు.

News July 9, 2024

NGKL: హర్షసాయి పేరుతో ఘరానా మోసం

image

హర్షసాయి పేరు చెప్పి మోసానికి పాల్పడిన ఘటనపై ఉప్పనుంతలలో కేసు నమోదైంది. SIలెనిన్ వివరాలు.. NLG జిల్లాకు చెందిన హనుమంత్ NGKL జిల్లా దేవదారికుంటతండాలో ఇటుకబట్టి ప్యాపారం చేస్తున్నాడు. మే14న హర్షసాయి పేరు చెప్పి ఫోన్‌ చేసి ఆర్థికసాయం చేస్తానని నమ్మించాడు. అందుకు కొంత డబ్బు ఫోన్‌పే చేయాలనగా నమ్మిన బాధితుడు రూ.54,500 పంపించాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశాడు.

News July 9, 2024

జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు: ఎంపీ RRR

image

ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతానని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. సోమవారం కూసుమంచిలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యూనివర్సిటీలు, ఎయిర్ పోర్టు ప్రాధాన్యతగా తీసుకుని వాటి ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, పాలేరు రిజర్వాయర్‌ను వాటర్ స్పోర్ట్స్‌కు అనువుగా మార్చాలనే ఆలోచన ఉందని తెలిపారు.

News July 9, 2024

HYD: మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ

image

HYD శివారు మొయినాబాద్‌లో గల ఓ ఫామ్ హౌస్‌లో నలుగురు యువతులు, ఏడుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. సురంగల్ గ్రామ పరిధిలోని ఫామ్ హౌస్‌లో అర్ధరాత్రి ముజ్రా పార్టీ పేరుతో అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి నలుగురు అమ్మాయిలను తీసుకువచ్చినట్లు సమాచారం.

KNR: ఒకే గదిలో 5 తరగతుల విద్యార్థులు

image

ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంపై ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చిగురుమామిడి మం. లాలయ్యపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1-5 తరగతుల్లో 30 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ స్కూల్‌లో రెండు గదులు ఉండగా ఒకటి శిథిలావస్థకు చేరింది. దీంతో వర్షం పడితే అన్ని తరగతుల విద్యార్థులకు ఒకే గదిలో పాఠాలు చెబుతున్నారు. మిగతా సమయాల్లో బయట చెబుతున్నారు.

News July 9, 2024

మెదక్ జిల్లాకు 15 మంది ఎంఈవోలు కావలెను!?

image

కార్పొరేట్‌కు దీటుగా సర్కారు బడుల్లో విద్యను అందిస్తామని ‌ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయులపై MEOల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో PS-607, హైస్కూల్స్-124, ZPHSలు-140 ఉన్నాయి. అయితే జిల్లాలో 21 మండలాలుండగా.. కొన్ని మండలాలకు సీనియర్‌ HMలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, 15 MEO పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

News July 9, 2024

బ్రెయిన్ డెడ్.. ఐదుగురికి అవయవదానం 

image

నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లికి చెందిన రైతు రంగారావు (53) జూన్ 28న ఇంట్లో ఉన్నట్టుండి కిందపడిపోయారు. కుటుంబీకులు అతడిని హైదారాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగంలో పది రోజులపాటు వైద్యం అందించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. జీవన్ దాన్ వైద్య బృంద సభ్యులు అతడి భార్య రేణుక ఇతర కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించగా ఐదుగురికి అవయవాలు దానం చేశారు.