Telangana

News July 9, 2024

వేములవాడ: రేపు హుండీ లెక్కింపు

image

వేములవాడలోని అగ్రహారం ఆంజనేయస్వామి హుండీ లెక్కింపును ఈనెల 10న నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి మారుతి వెల్లడించారు. ఆలయ ఆవరణలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు హాజరు కావచ్చునని ఆయన తెలిపారు.

News July 9, 2024

బదిలీలకు దరఖాస్తు చేసుకోండి: జిల్లా కలెక్టర్

image

సాధారణ బదిలీల్లో భాగంగా అన్ని శాఖల జిల్లా ఆఫీసర్లు తమ సిబ్బంది ట్రాన్స్ ఫర్స్ దరఖాస్తులను ఈ నెల 12 లోపు ఇవ్వాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. బదిలీ దరఖాస్తులను 13 నుంచి 18 వరకు పరిశీలించనున్నట్లు తెలిపారు. మరోవైపు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో ప్రజల వద్ద నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. గ్రీవెన్స్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ఆఫీసర్లు చొరవ చూపాలన్నారు.

News July 9, 2024

అదనపు ఆదాయంపై ఆర్టీసీ దృష్టి

image

ఉమ్మడి జిల్లాలో అదనపు ఆదాయంపై ఆర్టీసీ దృష్టి సారించింది. మహిళలు కేవలం ఉచిత ప్రయాణం అందించే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ప్రయాణిస్తుండడంతో.. డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అధికంగా ఉంటుండడంతో బస్సులు ఎక్కేందుకు పురుషులు ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు ఆర్టీసీ లక్ష్యే లక్ష్యం పేరుతో కసరత్తు చేస్తున్నారు.

News July 9, 2024

KTDM: గుండెపోటుతో స్టాఫ్ నర్స్ మృతి

image

భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి స్టాఫ్ నర్సు పి.కల్యాణి(36) విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో సోమవారం మృతిచెందారు. రోజువారీ విధుల్లో భాగంగా రాత్రి 8 గంటలకు ఆమె తనకు కేటాయించిన కాన్పు వార్డుకు వెళ్లి విధులు నిర్వహిస్తూ ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అప్రమత్తమైన వైద్యులు చికిత్స అందించినా పరిస్థితి విషమించి మృతి చెందినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు.

News July 9, 2024

HYD: 30.81 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం

image

GHMC పరిధిలో ఈ సంవత్సరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా 30.81 లక్షల మొక్కలు నాటాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది వరకు హరితహారం పేరిట జరిగిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని పేరును వనమహోత్సవంగా మార్చింది. అయితే బెల్టోపారం, గుల్మోహార్ వంటి వాటితో పాటు ఈసారి కానుగ, వేప, రావి వంటివి సైతం నాటనున్నారు.

News July 9, 2024

HYD: 30.81 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం

image

GHMC పరిధిలో ఈ సంవత్సరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా 30.81 లక్షల మొక్కలు నాటాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది వరకు హరితహారం పేరిట జరిగిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని పేరును వనమహోత్సవంగా మార్చింది. అయితే బెల్టోపారం, గుల్మోహార్ వంటి వాటితో పాటు ఈసారి కానుగ, వేప, రావి వంటివి సైతం నాటనున్నారు.

News July 9, 2024

ప్రతిరోజు 2 లక్షల మందికి పైగా ప్రయాణం: RM KMM

image

ఖమ్మం రీజియన్లో ప్రతిరోజు 517 బస్సులు నడుపుతున్నామని RM సరి రామ్ తెలిపారు. ఆయా బస్సులలో రెండు లక్షల నుంచి 2.30 లక్షల మంది ప్రయాణిస్తున్నారని ఆయన తెలిపారు. మహిళా ప్రయాణికుల కోసం లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని చెప్పారు. నెలవారి సీజన్ టికెట్ రిటర్న్, జర్నీ రాయితీ టికెట్, సూపర్ లగ్జరీ చార్జితో లహరి NON AC బస్సు లలో ప్రయాణం వంటి సదుపాయాలు అందిస్తున్నామని వివరించారు.

News July 9, 2024

ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న కూరగాయల సాగు

image

ఉమ్మడి జిల్లాలో ఏటా కూరగాయల సాగు తగ్గుతూ వస్తోంది. దీంతో కూరగాయలను వ్యాపారులు ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాలో కూరగాయల సాగుపై రైతులు ఆసక్తి చూపకపోవడంతో దిగుమతి తగ్గి డిమాండ్‌ పెరిగి ధరలు మండుతున్నాయి. దీనికి తోడు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉమ్మడి జిల్లాలో అరకొరగా సాగయ్యే కూరగాయలు సైతం మార్కెట్‌కు రావడం లేదు.

News July 9, 2024

యజమాని, కౌలుదారు ముందే మాట్లాడుకోవాలి: మంత్రి తుమ్మల

image

రైతుభరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఆగస్టు 15వ తేదీలోపు ముప్పై వేల కోట్లు రైతులకు ఇవ్వబోతున్నామన్నారు. రైతు భరోసాకు సంబంధించి రైతులు, కౌలు రైతులు మాట్లాడుకోవాలని, కౌలు తీసుకునే ముందు చర్చించుకోవాలన్నారు. పంట వేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలనేది సీఏం నిర్ణయమని స్పష్టం చేశారు.

News July 9, 2024

వైయస్సార్‌పై భట్టి కామెంట్స్

image

పాలకుడు ఎలా ఉండాలో వైయస్సార్ చూపించారని, ఆయన హయాంలో MLCగా పని చేయటం మర్చిపోలేనని డిప్యూటి సీఎం  భట్టి విక్రమార్క అన్నారు. వైయస్సార్ చివరి వరకు ప్రజల కోసమే పని చేశారని, సీఎంగా వైయస్సార్ తనదైన ముద్ర వేశారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీఎంబర్స్మెంట్, 108వంటి సేవలు దేశానికే ఆదర్శమని, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి పథకాలతో రైతుల సంక్షేమానికి పాటుపడ్డారని అన్నారు.