Telangana

News July 9, 2024

జేఎల్ఎం అభ్యర్థులకు రేపు స్తంభం ఎక్కే పరీక్ష

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని జూనియర్ లైన్మెన్ల (జేఎల్ఎం) అభ్యర్థులకు బుధవారం ఎంపిక పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఖమ్మం ఎస్ఈ ఏ.సురేందర్ తెలిపారు. రెండు పోస్టుల భర్తీకి స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహించడంతో పాటు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే అర్హులైన అభ్యర్థులకు సమాచారం ఇచ్చిన నేపథ్యాన వారు హాజరుకావాలని సూచించారు.

News July 9, 2024

వరంగల్: ‘ఈనెల 18 వరకు ఫీజు చెల్లించాలి’

image

కాకతీయ యూనివర్సిటీ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్(ఎంఎస్ డబ్ల్యూ) 2023-2024 రెండో ఏడాది టర్మ్ ఫీజు, పరీక్షల ఫీజులను ఈనెల 18 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించాలని యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం తెలిపారు. దూరవిద్య కేంద్రంలోని ఎస్బీఐ కౌంటర్లో ఫీజు చెల్లించుకోవాలని పేర్కొన్నారు. త్వరలోనే రెండోవ ఏడాది తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

News July 9, 2024

దుబ్బాక: కూతురు ప్రేమ పెళ్లి.. తండ్రి సూసైడ్

image

కూతురు ప్రేమపెళ్లి చేసుకోవడంతో మనోవేదనకు గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన దుబ్బాక మండలంలో జరిగింది. SI గంగరాజ్ వివరాలు.. అచ్చుమాయిపల్లికి చెందిన సోమారపు లింగం పొలానికి వెళ్లి రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఫొన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. రాత్రి పొలం వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. కూతురు ప్రేమ వివాహంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

News July 9, 2024

వరంగల్: ఫిర్యాదు కోసం కార్యక్రమంలో టోల్ ఫ్రీ నెంబర్

image

వరంగల్ జిల్లాలో వచ్చే రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపిన నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఏమైనా ఫిర్యాదులుంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3434, మొబైల్ నంబరు 91542 52936 సంప్రదించాలన్నారు.

News July 9, 2024

ఖమ్మం: ఆశా కార్యకర్త సూసైడ్

image

బోనకల్ మండలంలోని ఓ ఆశా కార్యకర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాపల్లికి చెందిన జీ.పుల్లమ్మ(38) ఆశా కార్యకర్తగా పనిచేస్తోంది. భర్త బ్రహ్మం మద్యానికి బానిసై ఆమెను వేధిస్తున్నాడు. ఆదివారం కూడా మద్యం తాగొచ్చాడు. ఆమెతో గొడవపడి రాత్రి ఇంటి నుంచి వెళ్లి పాఠశాలలో పడుకున్నాడు. సోమవారం ఉదయం ఇంటికి వెళ్లి చూడగా పుల్లమ్మ విగతజీవిగా ఉంది.

News July 9, 2024

వరంగల్: తన ఇంటినే బడిగా మార్చారు

image

WGL జిల్లాలో విషాదం నెలకొంది. తన ఇంటినే బడిగా మార్చి అనేకమందికి అక్షరాలు నేర్పించిన చదువుల తల్లి HYDలో ఆదివారం మృతి చెందింది. పర్వతగిరికి చెందిన యశోదమ్మ(101) ఏడు దశాబ్దాల క్రితమే భర్త సహకారంతో పర్వతగిరితో పాటు.. చుట్టు పక్కల గ్రామాల వారికి తమ ఇంటి వద్ద చదువు బోధించింది. మాజీ మంత్రి దయాకర్ రావు సైతం ఆమె వద్ద ఓనమాలు నేర్చుకున్నారు. ఆమె HYDలో మరణించగా.. పర్వతగిరిలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.

News July 9, 2024

కరీంనగర్ జిల్లా యువతికి రూ.34.4 లక్షల ప్యాకేజీ

image

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భారీ ప్యాకేజీ సంపాదించి KNR జిల్లాకు చెందిన ఓ యువతి ఔరా అనిపించింది. HZBDకు చెందిన CSE విద్యార్థిని యాల్ల కృష్ణవేణి ఓ కంపెనీలో రూ.34.4 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందింది. కృష్ణవేణి మాట్లాడుతూ.. తమది మధ్య తరగతి కుటుంబం కావడంతో నాన్న కష్టం చూసి చదివానని, భారీ ప్యాకేజీతో పొందడం సంతోషంగా ఉందని పేర్కొంది. కోడింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించడం తనకు కలిసొచ్చిందని తెలిపింది.

News July 9, 2024

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: డీఈవో

image

ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి రూ.26 లక్షలు స్వాహా చేసిన ఘటనపై అధికారులు విచారణలో వేగం పెంచారు. ఉద్యోగి రామకృష్ణ వివిధ పాఠశాలకు సంబంధించిన నిధులను డ్రా చేసి ఉండొచ్చని అనుమానంతో అప్రమతమైన అధికారులు ఆ దిశగా పరిశీలిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ తెలిపారు.

News July 9, 2024

CM రేవంత్‌రెడ్డి పర్యటన షెడ్యూల్ ఇలా..!

image

☞ఉదయం 12 గం.: బేగంపేట్ విమానాశ్రమం నుంచి బయలుదేరుతారు
☞12:45: మహబూబ్ నగర్ చేరుకుంటారు
☞12:45-1:00: ఉమ్మడి జిల్లా ప్రముఖులతో ముఖాముఖి
☞1:00 గం.: మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన
☞1:45-4:45: ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశం
☞5:00-5:45: భూత్పూర్ ఓ ఫంక్షన్ హాల్‌లో పార్టీ నాయకులతో సమావేశం
☞సాయంత్రం 6 గం.: HYDకు తిరుగు ప్రయాణం

News July 9, 2024

వనపర్తికి “స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌” మంజూరు

image

నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వనపర్తికి “స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌”ను మంజూరు చేసిందని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 65 ఐటీఐ సెంటర్లను స్కీల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలుగా నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.