Telangana

News July 9, 2024

సంగారెడ్డి: అరుణాచలానికి ప్రత్యేక బస్సులు

image

ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకొని సంగారెడ్డి నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఉపేందర్ మంగళవారం తెలిపారు. ఆసక్తి గలవారు www.tgsrtconline.in వెబ్ సైట్‌లో రిజర్వేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 19న సంగారెడ్డి నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 9, 2024

నేడే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

image

సుప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం నేడు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు జరిగే కళ్యాణోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సోమవారం సాయంత్రం అమ్మవారిని పెళ్లికూతురుగా ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు. పుట్టమన్ను తీసుకొచ్చి ఎస్ఆర్ నగర్ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఎల్లమ్మ దేవస్థానానికి పెద్ద ఎత్తున ఒగ్గు కళాకారులు ఊరేగింపుతో ఎదుర్కోళ్ల ఉత్సవం నిర్వహించారు.

News July 9, 2024

లంబాడిపెల్లి టూ హాలీవుడ్ రేంజ్!

image

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపెల్లికి చెందిన ఓ యూట్యూబ్ ఛానల్ యాక్టర్ రసూల్ ప్రభాస్ కల్కి సినిమాలో నటించి అందరి మన్నులను పొందాడు. గతంలోనూ సత్తి గాని రెండెకరాల సినిమాలో కీలకపాత్ర పోషించాడు. ఆ సినిమా వేడుకల్లో కల్కి డైరెక్టర్ నాగ అశ్విన్ హాజరయ్యారు. ఈ క్రమంలో రసూల్(మని వర్షిత్) చురుకుదనాన్ని గుర్తించి కల్కి సినిమాలో అవకాశం ఇచ్చినట్లు యూట్యూబ్ ఛానల్ టీం వాళ్లు తెలిపారు.

News July 9, 2024

నేడే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

image

సుప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం నేడు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు జరిగే కళ్యాణోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సోమవారం సాయంత్రం అమ్మవారిని పెళ్లికూతురుగా ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు. పుట్టమన్ను తీసుకొచ్చి ఎస్ఆర్ నగర్ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఎల్లమ్మ దేవస్థానానికి పెద్ద ఎత్తున ఒగ్గు కళాకారులు ఊరేగింపుతో ఎదుర్కోళ్ల ఉత్సవం నిర్వహించారు.

News July 9, 2024

సిద్దిపేట: ‘ప్రతి ఇంటి నుంచి ఇన్నోవేటర్ తయారు కావాలి’

image

ప్రతి ఇంటి నుంచి ఒక ఇన్నోవేటర్ తయారు కావాలని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి పిలుపునిచ్చారు. నూతన ఆవిష్కరణలకు సిద్దిపేట జిల్లా వేదికగా నిలవాలని సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమ పోస్టర్ ను విడుదల చేశారు. వారితో ఆర్డీవో సదానందం, ఈడీఎం ఆనంద్, మునిసిపల్ కమిషనర్ ప్రసన్నలక్ష్మి ఉన్నారు.

News July 9, 2024

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలి: ఎస్పీ

image

జిల్లాలోని బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని SP రక్షిత కె మూర్తి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారులతో ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఆమె నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొన్నారు. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలన్నారు.

News July 9, 2024

MDK: ఇంటింటా ఇన్నోవేటర్-24కు దరఖాస్తులు ఆహ్వానం

image

మెదక్: ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే కొత్తరకం ఆవిష్కరణల కొరకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉమ్మ డి మెదక్ జిల్లా నుంచి ప్రజా సమస్యలకు పరిష్కారం చూపేలా రూపొందించిన ప్రాజెక్టుకు సంబంధించి 2 నిమిషాల నిడివిగల వీడియో, ఫోటోలతో పాటు తమ వ్యక్తిగత వివరాలను ఆగస్టు 3లోపు 9100678543 నంబరుకు పంపాలన్నారు. ఆసక్తి గలవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

News July 9, 2024

NZB: ఇంటింటా ఇన్నోవేషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న ఇంటింటా ఇన్నోవేషన్- 2024 కార్యక్రమ పోస్టర్‌ను సోమవారం నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవిష్కరించారు. ప్రతి ఏడాది తరహాలోనే ఈ ఏడాది సైతం ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వివరించారు.

News July 9, 2024

ఆదిలాబాద్: ముగిసిన EAPCET కౌన్సెలింగ్.. 715 మంది హాజరు

image

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశించేందుకు ఎప్‌సెట్‌ తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో 3 రోజులపాటు జరుగగా సోమవారంతో ముగిసింది. నేడు 201 మంది హాజరు కాగా మొత్తం 715 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ వెరీఫికేషన్ పూర్తయినట్లు కోఆర్డినేటర్ వీరస్వామి తెలిపారు. జులై 15 వరకు వెబ్ అప్షన్లు పెట్టుకోవాలని, 19న సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు.

News July 9, 2024

మందుబాబులూ ఆలోచించండి.. రైతుల ఆవేదన

image

రాత్రి వేళల్లో మద్యం తాగి పంట పొలాల్లో ఆ మద్యం బాటిళ్ళను పడేసే మందుబాబులు ఒక్కసారి ఆలోచించండి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం గట్ల మధ్య మద్యం సేవించి వెళ్లే కొందరు యువకులు బాటిళ్ళను పొలం గట్లపై పగలగొడుతుండడంతో ఆ మద్యం బాటిళ్లు పంట పొలాల్లో పడి సేద్యం చేసే సమయంలో రైతన్నల కాళ్లకు గాయాలు అవుతున్నాయి. నిత్య కృత్యంగా మారిన ఈ పరిస్థితి పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.