Telangana

News July 8, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఎంపీ ధర్మపురి అరవింద్ ను పరామర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే. @ జగిత్యాల ప్రజావాణిలో 58 ఫిర్యాదులు. @ గంభీరావుపేట మండలంలో ట్రాక్టర్ బోల్తా పడి ఒకరి మృతి. @ కోరుట్ల పట్టణంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. @ మంథని మండలంలో విద్యుత్ షాక్ తో మేక మృతి. @ గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన మెట్పల్లి పోలీసులు.

News July 8, 2024

ఉమ్మడి పాలమూరుకు YELLOW ALERT

image

మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని సోమవారం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు,మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాల ప్రజలు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

News July 8, 2024

సంగారెడ్డి: మల్లేశ్వరి ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశం

image

రాయికోడ్ గురుకుల పాఠశాల భవనం పై నుంచి కిందపడిన విద్యార్థిని మల్లీశ్వరి గాయపడిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం విచారణకు ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ పాఠశాల మేరకు విచారణ చేపట్టామన్నారు. గాయపడిన విద్యార్థిని మల్లీశ్వరికి మెరుగైన వైద్య కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

News July 8, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓రామంతపూర్:వన మహోత్సవం ప్రారంభించిన మంత్రులు
✓మేడ్చల్: డ్రగ్స్ తీసుకున్న 12 మంది పై కేసు నమోదు
✓కంటోన్మెంట్ GHMCలో కలిస్తే నష్టమే:రామకృష్ణ
✓గచ్చిబౌలి: స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం
✓HYD: 7 నెలల్లో పింఛన్ అందింది రెండుసార్లే!: బిక్షపతి
✓HYD: నిరుద్యోగుల కన్నెర్ర.. చీకట్లోనూ నిరసనలు
✓గోల్కొండ: రెండవ రోజు కొనసాగిన బోనాలు

News July 8, 2024

పాలమూరు “TODAY TOP NEWS”

image

✒రేపు పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి రాక
✒ఉమ్మడి జిల్లాలో మొదలైన మొహర్రం సందడి
✒రేపు NRPTకు సినీనటి మంచు లక్ష్మి రాక
✒ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు
✒రేపు వర్షాలు ఎల్లో అలర్ట్ జారి
✒మద్దూర్:స్వామిజీ జీవసమాధి.. బయటకు తీసిన పోలీసులు
✒కొడంగల్: ఢిల్లీకి బయలుదేరిన ఒగ్గుడోలు కళాకారులు
✒ప్రజావాణి:సమస్యలపై అధికారుల ప్రత్యేక ఫోకస్
✒టీచర్లకు ఆంగ్లంపై నైపుణ్యం.. కొనసాగుతున్న శిక్షణ

News July 8, 2024

‘ఖమ్మం,భద్రాద్రి జిల్లాల్లో రేపు సీత్లా పండుగ’

image

వర్షాకాలం సీజన్లో తొలకరి జల్లులు పడుతున్నప్పుడు తండాల్లో లంబాడా గిరిజనులు జరుపుకునే మొదటి పండుగ సీత్లా పండుగ. కాగా ఖమ్మం, భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న తండాల్లో మంగళవారం సీత్లా పండుగ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే తండాల్లో ఉన్న సీత్లా భవాని వద్ద గిరిజనులు తగు ఏర్పాట్లు చేశారు. వర్షాలు సమృద్ధిగా పడి, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని లంబాడా గిరిజనులు ప్రతి ఏటా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

News July 8, 2024

ఆసిఫాబాద్: అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన దంపతులు

image

ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దంపతులు ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2024లో సత్తా చాటారు. జూన్ 5 నుంచి 7 వరకు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగిన 5KM వాకింగ్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో శకుంతల(48) రెండో స్థానం, ఆమె భర్త ఆనంద్ రావు(56) ఐదో స్థానం సాధించారు. దీంతో వారిని జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ప్రభాకర్ రావు సన్మానించి అభినందించారు.

News July 8, 2024

ఎక్సైజ్ ఎస్ఐ కారును ఢీకొట్టిన మరో కారు

image

భద్రాచలం పట్టణంలోని సోమవారం రాత్రి బ్రిడ్జిపై ఎక్సైజ్ ఎస్ఐ కారును మరొక కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ఎక్సైజ్ ఎస్ఐకి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. వెంటనే ఎస్సైని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 8, 2024

ఖేడ్ నుంచి అరుణాచలం ప్రత్యేక బస్సులు

image

గురుపౌర్ణమి సందర్భంగా నారాయణఖేడ్ ఆర్టీసీ నుంచి అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు నడుస్తున్నట్లు మేనేజర్ మల్లేషయ్య తెలిపారు. 19న సాయంత్రం బయలుదేరి 20వ చేరుకుంటుంది. 21న గురుపూర్ణమి దర్శనం చేసుకోవచ్చని అన్నారు. బస్ టికెట్ ధర రూ.4300, దర్శనం, భోజనం ప్రయాణికులు ఎవరి వారు చూసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం డిపోలో సంప్రదించాలన్నారు.

News July 8, 2024

ముంబాయిలో నారాయణపేట వాసి మృతి

image

నారాయణపేటకు చెందిన యువకుడు ముంబైలో మృతిచెందాడు. నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు 19వ ఫ్లోర్ నుంచి కిందపడి చనిపోయినట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలోని మొనప్ప కాలనీకి చెందిన మల్లేశ్(27) పది సంవత్సరాల క్రితం నిర్మాణ రంగంలో పనుల కోసం ముంబైకి వలస వెళ్లాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.