Telangana

News July 8, 2024

సంగారెడ్డి: బీజేపీ గేమ్‌లో కేసీఆర్ 4వ స్తంభం: జగ్గారెడ్డి

image

బీజేపీ గేమ్‌లో కేసీఆర్ నాలుగవ స్తంభమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ తెలివిగా గేమ్ మొదలు పెట్టిందని, మొదట టీడీపీని దింపి, సపోర్ట్‌గా జనసేనతో ముందుకు వెళ్లనుందన్నారు. వీరికి బీఆర్ఎస్ జత కలిసే అవకాశం ఉందన్నారు. విభజన సమస్యల పేరిట చంద్రబాబు తెలంగాణలో చాలా తెలివిగా అడుగు పెట్టారని దుయ్యబట్టారు.

News July 8, 2024

రేపు పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి

image

MBNR జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్​ రెడ్డి మంగళవారం పాలమూరుకు జిల్లాకు వస్తున్నారని, కలెక్టరేట్(IDOC)కు మధ్యాహ్నం 12.45గంటలకు చేరుకుని మహిళా శక్తి క్యాంటీన్, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారన్నారు.

News July 8, 2024

తలమడుగు: సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడి సూసైడ్

image

సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ యువకుడు (18) ఆత్మహత్య చేసుకున్న ఘటన తలమడుగులో చోటుచేసుకుంది. ఉమ్రి గ్రామానికి చెందిన మేస్రం కృష్ణ తల్లిదండ్రులను ఇటీవల సెల్ ఫోన్ కొనివ్వమని అడిగాడు. ఆర్థిక పరిస్థితి కారణంగా కొనివ్వలేమని చెప్పడంతో ఈనెల 3న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం గ్రామ శివారులోని గుట్టపైన చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

News July 8, 2024

గద్వాల: తల్లిని చంపిన కేసులో కొడుకుకి 10ఏళ్ల జైలు

image

తల్లిని చంపిన కేసులో కుమారుడికి 10ఏళ్లు జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధిస్తూ గద్వాల కోర్టు ప్రిన్సిపల్ ఇన్‌ఛార్జ్ జడ్జి కుషా తీర్పునిచ్చారని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ పై 2023లో శాంతినగర్ పీఎస్‌లో కేసు నమోదు అయిందన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి నేరస్థులకు శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

News July 8, 2024

గంభీరావుపేట: ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

image

గంభీరావుపేట మండలం నర్మాలలో ట్రాక్టర్ నుంచి జారిపడి వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్మాల గ్రామానికి చెందిన దండుగుల శ్రీనివాస్ (45) పొలం వద్ద ట్రాక్టర్‌తో పనులు చేస్తున్నాడు. అదే ట్రాక్టర్‌పై గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పొలంఓడ్డు నుంచి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News July 8, 2024

MBNR: జిల్లాలో ఐదు మహిళా క్యాంటీన్ల ఏర్పాటు !

image

మహబూబ్ నగర్ జిల్లాలో ఐదు మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ కార్యాలయ సముదాయాలు, ఆలయాలు, మైనార్టీ రెసిడెన్షియల్ గురుకులాలు, జన సంచారం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రూ.85 లక్షల వ్యయంతో 5 క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాలు సైతం గుర్తించారు.

News July 8, 2024

మెదక్: TECOA రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్ కుమార్ ఏకగ్రీవం

image

తెలంగాణ కంప్యూటర్ ఆపరేటర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నర్సాపూర్‌కు చెందిన మోరే రాజ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్ చిక్కడపల్లిలో నిర్వహించిన ఎలక్షన్ కంప్యూటర్ ఆపరేటర్ల సమావేశం నిర్వహించారు. అసోసియేషన్‌గా ఏర్పడిన నాయకులు నేడు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాణిక్య ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా జ్యోతి, కొండల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

News July 8, 2024

ఈనెల 15 నుంచి బాలికల ఫుట్ బాల్ జట్టు ఎంపికలు

image

సిద్దిపేట ఫుట్ బాల్ మైదానంలో ఈనెల 15 నుంచి 29 వరకు జాతీయ జూనియర్ బాలికల ఫుట్ బాల్ శిబిరం నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు. శిబిరంలో ఎంపికైన వారికి కర్ణాటకలోని బెళగావిలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. గ్రామీణ స్థాయిలోని క్రీడాకారుల్లో నైపుణ్యాలు వెలికి తీసేందుకు కృషి చేస్తున్నామన్నారు.

News July 8, 2024

HYD: జులై 11 నుంచి డీఎస్సీ హాల్ టికెట్స్

image

డీఎస్సీ పరీక్షలను ఎట్టి పరిస్థితిలోనూ వాయిదా వేసే ప్రసక్తి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈనెల 11 నుంచి హాల్ టికెట్స్ జారీ చేస్తామని అందులో పేర్కొంది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు యథావిధిగా పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. కాగా, మరోవైపు పరీక్షలు వాయిదా వేయాలని ఈరోజు డీఎస్సీ అభ్యర్థులు విద్యాశాఖ కార్యాలయం ముట్టడించిన విషయం తెలిసిందే.

News July 8, 2024

సమస్యలు పరిష్కరించకపోతే పోరాటమే: TWJF

image

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తప్పదని TWJF రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య హెచ్చరించారు. MBNR ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఫెడరేషన్ సమావేశంలో సోమయ్య పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటై 6నెలలు గడుస్తున్నా సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపడంలేదని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టుకు ఇల్లు, హెల్త్ కార్డు ద్వారా ఉచిత వైద్యం, పెన్షన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.