Telangana

News July 8, 2024

NRPT: డిజిటల్ క్లాస్ రూమ్‌ ప్రారంభించనున్న మంచు లక్ష్మి

image

నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామానికి రేపు ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి రానున్నారు. టీచ్ ఫర్ ఛేంజ్, వెణిరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూంను స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు రత్నం రెడ్డి కలిసి ఉదయం 10:30 గంటలకు ప్రారంభించనున్నారు. డిజిటల్ క్లాస్ రూమ్‌ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధం చేసి ఉంచారు.

News July 8, 2024

HYD: డ్రగ్స్ తీసుకున్న 12 మందిపై కేసు

image

డ్రగ్స్ తీసుకున్న 12 మందిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ పట్టణానికి చెందిన కొందరు వ్యాపారస్థులు రాజస్థాన్ నుంచి డ్రగ్స్‌ను కొనుగోలు చేసి సేవిస్తున్నారని పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ కొనడం, సేవించడం నేరమని ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు

News July 8, 2024

రామారెడ్డి: బైక్ అదుపు తప్పి కిందపడి వ్యక్తి మృతి

image

బైక్ అదుపు తప్పి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రామారెడ్డి PS పరిధిలో జరిగింది. SI విజయ్ కొండ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన అనిల్ (45) మేస్త్రిగా పని చేస్తున్నాడు. సోమవారం పని నిమిత్తం ఉప్పల్వాయి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా పోసాని పేట్ జంక్షన్ వద్ద బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.

News July 8, 2024

మెదక్: రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన SI

image

మెదక్ జిల్లా హావేలిఘనపూర్ SI ఆనంద్ గౌడ్ లంచం తీసుకుంటూ చిక్కారు. సీజ్ చేసిన ఇసుక టిప్పర్ వదిలేందుకు రూ.50వేలు డిమాండ్ చేసినట్ల తెలిసింది. ఈ క్రమంలో రూ.20 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అనిశా అధికారులు పోలీస్ స్టేషన్‌లో సోదాలు చేస్తున్నారు. విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇటీవల మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడగా ఎస్ఐ, మరో కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు గురయ్యారు.

News July 8, 2024

HYD: డ్రగ్స్ సేవించిన 12 మందిపై కేసు 

image

డ్రగ్స్ తీసుకున్న 12 మందిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ పట్టణానికి చెందిన కొందరు వ్యాపారస్తులు రాజస్థాన్ నుంచి డ్రగ్స్‌ను కొనుగోలు చేసి సేవిస్తున్నారని పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ కొనడం సేవించడం నేరమని ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన పోలీసులు చర్యలుంటాయన్నారు.

News July 8, 2024

నేలపై కూర్చొని విద్యార్థులకు బోధించిన జిల్లా కలెక్టర్

image

ఏన్కూరు మండలం హిమంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేలపై కూర్చొని విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు బోధించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

News July 8, 2024

వనపర్తి: ఆసుపత్రిలో కూలిన పైకప్పు.. తప్పిన ముప్పు

image

వనపర్తి జిల్లా రేవల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం ఆసుపత్రి పైకప్పు కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. ఈ ఆస్పత్రిని 1999 సంవత్సరంలో నిర్మించారు. నాసిరకంగా కట్టడంతోనే పైకప్పు కోల్పోయిందని రోగులు అన్నారు. ఉన్నతాధికారుల స్పందించి ఆసుపత్రిని బాగు చేసి, రోగులకు సేవలు చేయాలని మండల కేంద్ర ప్రజలు కోరారు.

News July 8, 2024

భారత జట్టులో నకిరేకల్ వాసి

image

ఇండోనేపాల్ ఇంటర్ నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్‌లో భారత జట్టు తరఫున నకిరేకల్ వ్యాయమ ఉపాధ్యాయుడు పగిడిమర్రి జాని పాల్గొన్నారు. నేపాల్‌లో ఈనెల 4 నుంచి 7 వరకు నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో ఫైనల్‌లో నేపాల్‌పై బంగారు పతకం సాధించారు. మిత్రులు నాగేంద్రబాబు, సైదులు, సందీప్, మహేశ్, నరేష్, జానికి అభినందనలు తెలిపారు.

News July 8, 2024

సంగారెడ్డి: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

image

కరెంటు షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన సిర్గాపూర్ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. అంతర్గాంకు చెందిన సుభాష్(30) ఆదివారం చేపలు పట్టేందుకు స్థానిక వాగుకు వెళ్లాడు. ఎప్పటి లాగానే కరెంట్ షాక్ ద్వారా చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి సుభాష్ మృతి చెందాడు. ఈమేరకు మృతుడి తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ మైపాల్ రెడ్డి తెలిపారు.

News July 8, 2024

జగిత్యాల ప్రజావాణిలో 58 ఫిర్యాదులు

image

జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 58 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పి.రాంబాబు, రఘువరన్ ఆర్డీవోలు మధుసూదన్, ఆనంద్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.