Telangana

News July 8, 2024

WGL: డయేరియా అవగాహన వాల్‌పోస్టర్లు ఆవిష్కరణ

image

వర్షాకాలంలో డయేరియా ప్రబలకుండా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం కాన్ఫరెన్స్ హాల్‌లో అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి, రాధికా గుప్తా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, ఇతర జిల్లా అధికారులతో కలసి డయేరియా అవగాహన కార్యక్రమాల వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు.

News July 8, 2024

హనుమకొండ : రాపిడో బాయ్‌పై దాడి.. కేసు నమోదు

image

రాపిడో బాయ్‌పై దాడిచేసి గాయపరిచిన ఇద్దరిపై కేసు నమోదయింది. ఆదివారం ములుగు రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాజీ కార్పొరేటర్ కానుగంటి శేఖర్ రాపిడో బుక్ చేసుకున్నాడు. రాపిడో బాయ్ సిద్దంశెట్టి కృష్ణంరాజు లోకేషన్ చేరుకున్నాడు. కృష్ణంరాజు లేట్ అవుతోంది తొందరగా రండి అన్నాడు. దానికి కొపగించుకున్న శేఖర్, రమణాచారితో కలిసి అతనిపై దాడిచేశారు. బాధితుడు సోమవారం హన్మకొండ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News July 8, 2024

ఇంటింటా ఇన్నోవేషన్ ఆవిష్కరణలు వాట్సాప్ ద్వారా పంపాలి

image

NGKL: స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా ఇంటింటా ఇన్నోవేషన్ ఆవిష్కరణలను రూపొందించి వాట్సాప్ ద్వారా పంపాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో ఇంటింటా ఇన్నోవేషన్ ఆవిష్కరణ ప్రచార గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పలు ఆవిష్కరణల ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News July 8, 2024

నీటి ప్రవాహానికి ఊపిరాడక వాహనదారుడు మృతి

image

మధిర శివాలయం వద్ద సోమవారం విషాదం చోటుచేసుకుంది. వైరా నదిలో ఏర్పాటుచేసిన తాత్కాలిక రోడ్డుపై నుంచి మడుపల్లి గ్రామానికి ఓ వ్యక్తి బైక్ పై వెళ్తుండగా రోడ్డు కుంగి తూములో ఇరుక్కున్నాడు. దీంతో నీటి ప్రవాహానికి ఊపిరాడక అతడు మృతి చెందాడు. మృతుడు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామానికి చెందిన బోశెట్టి రమేష్‌‌గా పోలీసులు గుర్తించారు. 

News July 8, 2024

గచ్చిబౌలి: స్కిల్ డెవలప్ మెంట్ సమావేశంలో పాల్గొన్న సీఎం

image

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాప్ కాలేజీలో స్కిల్ డెవలప్‌మెంట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. కాలేజీలో నిర్మాణమవుతున్న కన్వెన్షన్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు.

News July 8, 2024

తిట్లు, ఆరోపణలు బంద్ చేద్దాం : కేంద్రమంత్రి బండి

image

తిట్లు, ఆరోపణలు బంద్ చేసి.. అభివృద్ధిపై ఫోకస్ పెడదామని హోంశాఖ సహాయకమంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని, కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు. సిరిసిల్లలో మున్నూరుకాపు సంఘ కళ్యాణ మండపం అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఎన్నికలైపోయినయ్.. ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్ చేద్దామని ఆయన హితవు పలికారు.

News July 8, 2024

దండేపల్లి: చికిత్స పొందుతూ యువకుడు మృతి

image

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన బోడకుంట హరికృష్ణ(24) శనివారం రోజున లక్షట్టిపేట గ్రామ శివారులో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News July 8, 2024

NLG: MLAతో కలిసి స్ట్మార్ట్ క్లాస్ రూంలు ప్రారంభించిన మంచు లక్ష్మి

image

భువనగిరిలోని భాగాయత్‌‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి సినీ నటి మంచు లక్ష్మీ సోమవారం ప్రారంభించారు. స్మార్ట్ క్లాస్ రూమ్‌లతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

News July 8, 2024

SRD: ఇన్స్పైర్ మనక్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డి: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఇన్స్పైర్ మనక్ కార్యక్రమం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి సిధారెడ్డి తెలిపారు. జిల్లా విద్యాశాఖ నుంచి ప్రతి పాఠశాలకు పంపే ప్రత్యెక లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దీనిపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని, సెప్టెంబర్ 15 చివరి తేదని తెలిపారు.

News July 8, 2024

తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ

image

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పటేల్ రమేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం హైదరాబాద్ హిమాయత్ నగర్లోని టూరిజం డెవలప్మెంట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టూరిజం కార్యాలయం అధికారులు, సిబ్బంది నూతన ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పటేల్ రమేష్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.