Telangana

News July 8, 2024

బల్కంపేట ఎల్లమ్మకు గద్వాల పట్టు చీర

image

హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని నడిగడ్డ దైవం జమ్ములమ్మ ఆలయ ఛైర్మన్ గాయత్రి, సతీశ్ దంపతులు గద్వాల పట్టుచీర, సారె సోమవారం తెల్లవారుజామున అందజేశారు. ప్రతి ఏటా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జ్యోతి దంపతులు అమ్మవారికి పట్టుచీర సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. నడిగడ్డ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి పూజలు నిర్వహించారు.

News July 8, 2024

HYD: ప్లాస్టిక్ సర్జరీలపై ప్రత్యేక సేవలు: డా.లక్ష్మీ

image

ప్రపంచ ప్లాస్టిక్ శస్త్రచికిత్స దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి ఉస్మానియా హాస్పిటల్‌లో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకంగా సేవలు అందించనున్నట్లు ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్, యూనిట్ చీఫ్ డాక్టర్.పలుకూరి లక్ష్మీ తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు రూమ్ నం.202లో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి వైద్య సేవలు సర్జరీలు ఉచితంగా పొందవచ్చని వెల్లడించారు. అన్ని రకాల ప్లాస్టిక్ సర్జరీలు చేస్తామని పేర్కొన్నారు.

News July 8, 2024

HYD: ప్లాస్టిక్ సర్జరీలపై ప్రత్యేక సేవలు: డా.లక్ష్మీ

image

ప్రపంచ ప్లాస్టిక్ శస్త్రచికిత్స దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి ఉస్మానియా హాస్పిటల్‌లో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకంగా సేవలు అందించనున్నట్లు ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్, యూనిట్ చీఫ్ డాక్టర్.పలుకూరి లక్ష్మీ తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు రూమ్ నం.202లో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి వైద్య సేవలు సర్జరీలు ఉచితంగా పొందవచ్చని వెల్లడించారు. అన్ని రకాల ప్లాస్టిక్ సర్జరీలు చేస్తామని పేర్కొన్నారు.

News July 8, 2024

పిట్లం: బ్యాంక్ ఉద్యోగం నుంచి గ్రూప్ 1కు

image

పిట్లం మండలం తిమ్మా నగర్ గ్రామానికి చెందిన దామరంచ అనిల్ గౌడ్ గ్రూప్ 1 మెయిన్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని మొదట బ్యాంక్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం సాధించాడు. అనంతరం సివిల్స్ ఎస్సై ఉద్యోగానికి ఎంపిక అయి కొన్ని రోజుల పాటు ఎస్సైగా విధులు నిర్వహించాడు. అనంతరం గ్రూప్-2లో ఉద్యోగం సాధించి ప్రస్తుతం ACTOగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

News July 8, 2024

కొర్లపహాడ్ సమీపంలో ట్రామా కేర్ సెంటర్

image

కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక వసతులతో కూడిన ట్రామాకేర్ సెంటర్‌ను ప్రారంభించాలని ఏడీపీ ప్రతిపాదించింది. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు ప్రమాదాలకు గురైన సమయంలో క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించే లక్ష్యంతో ఈ సెంటర్ నిర్మాణం చేపడుతోంది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే కొర్లపహాడ్ టోల్ ప్లాజాను కీలక జంక్షన్‌గా గుర్తించిన ADP ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

News July 8, 2024

ఖమ్మం జిల్లాకు మూడు కార్పొరేషన్ పదవులు

image

తెలంగాణలో 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబుతో పాటు తదితర నేతలకు పదవులు దక్కాయి.

News July 8, 2024

NLG: పలువురు సీఐలకు స్థానచలనం

image

జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ మల్టీ జోన్-2 ఐజీపీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. HYD సిటీలో వెయిటింగ్లో ఉన్న కొండల్రెడ్డిని SLG, NLGలో ఉన్న శ్రీనివాసరెడ్డిని ఐజీపీ కార్యాలయానికి, నల్లగొండ వన్ టౌన్ సీఐ సత్యనారాయణను సంగారెడ్డి వీఆర్‌కు, ఇంటలిజెన్స్‌లో ఉన్న రాజశేఖర్ రెడ్డిని నల్లగొండ వన్ టౌన్‌కు, HYD సిటీ వెయిటింగ్లో ఉన్న క్రాంతికుమార్‌ను NLG ట్రాఫిక్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News July 8, 2024

ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌‌గా ప్రకాష్ రెడ్డి

image

తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌‌గా భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ముఖ్య నేతలకు ప్రకాష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ కార్పొరేషన్ బలోపేతానికి కృషి చేస్తానని ప్రకాశ్ రెడ్డి చెప్పారు.

News July 8, 2024

ఆయిల్ సీడ్స్ ఫెడ‌రేష‌న్ ఛైర్మన్‌గా రాఘవరెడ్డి

image

తెలంగాణ రాష్ట్ర కో-ఆప‌రేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడ‌రేషన్‌గా జంగా రాఘ‌వరెడ్డి నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, రాష్ట్ర కో-ఆప‌రేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడ‌రేషన్ బలోపేతానికి కృషి చేస్తానని రాఘవరెడ్డి చెప్పారు. నూతన కార్పొరేషన్ ఛైర్మన్‌ను పలువురు నేతలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

News July 8, 2024

మెదక్ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం

image

మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులను స్వీకరించారు. వివిధ శాఖల అధికారులు హాజరు కాగా ప్రజల నుంచి అందిన విజ్ఞప్తులను ఆయా అధికారులకు బదిలీ చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు విజ్ఞప్తులతో హాజరయ్యారు