India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NLG జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్నాయని స్థానికులు అంటున్నారు. పట్టణంలో 4 రోజుల క్రితం జరిగిన ఓ మర్డర్ ప్రజలను విస్మయానికి గురిచేసింది. పగటిపూట ఎక్కడో ఒకచోట సంచరిస్తూ సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్టాండ్, సర్కారు దవాఖాన, అన్నపూర్ణ క్యాంటీన్లలో తిష్ట వేస్తున్నారని స్థానికులు తెలిపారు. పోలీసులు గస్తీ ముమ్మరం చేసి శాంతి భద్రతలు కాపాడాలని కోరుతున్నారు.
మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న 11వ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆదివారం జిల్లా క్రీడాకారిణి సత్తా చాటింది. అండర్ 20 విభాగంలో అశ్విని హైజంప్ ఈవెంట్లో స్వర్ణం గెలుచుకుందని శిక్షకుడు రాకేశ్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో సత్తా చాటడం పట్ల డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అడ్డి భోజారెడ్డి, రాజేశ్ తదితరులు ఆమెను అభినందించారు.
BRS అనుబంధ సింగరేణి కార్మిక సంఘం TBGKSకు MLC కవిత గుడ్ బై చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల TBGKS గౌరవ అధ్యక్ష పదవి నుంచి BRS కవితను తప్పించి కొప్పుల ఈశ్వర్‌కు బాధ్యతలు కట్టబెట్టింది. HMSతో దోస్తీ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం HMS గౌరవ అధ్యక్షురాలిగా కవితను సంఘం ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ప్రతిపాదించగా.. అందరూ మద్దతు పలికారు. కాగా.. కవిత వీటిలో దేనిపై స్పందించలేదు.
కరీంనగర్‌లో ఎల్‌ఎండీకి సందర్శకుల తాకిడి పెరిగింది. నీటి మట్టం పెరగడంతో పాటు ఆదివారం కావడం వల్ల సాయంత్రం పెద్ద సంఖ్యలో కట్టపై నుంచి రిజర్వాయర్ లోకి వెళ్లారు. ప్రమాదకరంగా నీటిలోకి వెళ్ళి గడిపారు. సమాచారం అందుకున్న ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్ గౌడ్ చేరుకుని సందర్శకులను అక్కడి నుండి పంపించేశారు. సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.
తూప్రాన్ పట్టణ పరిధి ఆబోతుపల్లి శివారులో హల్దీ వాగుపై నూతనంగా రూ.4.5 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదన చేసినట్టు తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. హల్దీ వాగుపై నిర్మించిన కాజ్ వే వరదలకు కొట్టుకుపోవడంతో ఆదివారం ఆయన పరిశీలించారు. నూతన బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని తెలిపారు. కాజ్ వే దెబ్బ తినడంతో రాకపోకలకు అవకాశం లేదన్నారు.
ఆగస్టులో షీ టీమ్స్ చేపట్టిన చర్యల్లో భాగంగా మెదక్ డివిజన్‌లో ఈవ్‌టీజర్స్‌పై 2 ఎఫ్ఐఆర్‌లు, 14 ఈ-పెట్టీ కేసులు, తూప్రాన్ డివిజన్‌లో 4 ఈ-పెట్టీ కేసులు నమోదయ్యాయని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2 ఎఫ్ఐఆర్‌లు, 18 కేసులు నమోదయ్యాయన్నారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన 73 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో, ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో తగ్గుముఖం పట్టింది. నిన్న ఇన్ ఫ్లో 6 లక్షలు, ఔట్ ఫ్లో 5.50 లక్షల క్యూసెక్కులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇన్ ఫ్లో 3.70 లక్షలు, ఔట్ ఫ్లో 3,26,853 క్యూసెక్కులకు తగ్గింది. కాగా ప్రాజెక్టులో తాజాగా 1088 (69.85TMC) అడుగులకు నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
మోమిన్‌పేట మండలం కేసారంలో దారుణం చోటుచేసుకుంది. బంట్వారం మండలం రొంపల్లికి చెందిన కురువ కుమార్ (36), రేణుక (34) భార్యభర్తలు. కేసారంలోని ఒక వెంచర్‌లో పని చేస్తున్నారు. రోజూ మద్యం తాగి భార్యను వేధిస్తున్న కుమార్ ఆదివారం మద్యం మత్తులో వచ్చి రేణుకను కొట్టాడు. వేధింపులు తాళలేక ఆమె భర్త కళ్లల్లో కారం కొట్టింది. ఓ వైర్‌ను మెడకు బిగించి హత్య చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఐఎస్‌ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో నేడు AP లోని నర్సరావుపేటలో తెలుగు భాష దినోత్సవం సందర్బంగా తెలుగు భాష, సంస్కృతి, వైభవం, సాహిత్యం తదితరాల్లో విశేష సేవలను అందిస్తున్నందుకు గాను తెలుగు తేజం పురస్కార అందిస్తుంది. ఇందులో భాగంగా SRR కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, చిందం సునీత జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నారు.
ఏఎస్ఐ ఎస్.దిలీప్ (తాంసి, పీఎస్), ఏఎస్ఐ ముంతాజ్ అహ్మద్ (భీంపూర్ పీఎస్) పదవీ విరమణ పొందిన సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం వారిని సన్మానించారు. 35 ఏళ్లకు పైగా పోలీసు సర్వీసులో చిన్న రిమార్క్ కూడా లేకుండా ఇద్దరూ అంకితభావంతో సేవలందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఏఎస్ఐల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.