Telangana

News July 8, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి క్వింటాకు రూ.18,000 ధర వచ్చింది. అలాగే ఏసీ 341 రకం మిర్చికి రూ.15,000, వండర్ హాట్(WH) మిర్చికి రూ.16,500 ధర పలికింది. అయితే గత వారంతో పోలిస్తే మిర్చి ధరలు స్వల్పంగా తగ్గాయి.

News July 8, 2024

ఖమ్మం మార్కెట్‌లో పెరిగిన మిర్చి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,550 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,300 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.2050 పెరగగా, పత్తి ధర మాత్రం రూ.50 తగ్గినట్లు వ్యాపారస్థులు తెలిపారు.

News July 8, 2024

మూడు పంచాయతీలుగా భద్రాచలం పంచాయతీ

image

భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపించిన బిల్లుపై గవర్నర్ రాధాకృష్ణన్ సంతకం చేశారు. బూర్గంపాడు మండలంలోని సారపాకను రెండు పంచాయతీలుగా ఆమోదించారు. ఇన్నాళ్లూ రెండు ప్రాంతాలు మున్సిపాలిటీగా మారతాయని పట్టణవాసులు భావించారు. కానీ భద్రాచలం పట్టణాన్ని భద్రాచలం, సీతారామనగర్, శాంతినగర్ పంచాయతీలుగా, సారపాకను సారపాక, ఐటీసీ గ్రామ పంచాయతీలుగా విభజించారు.

News July 8, 2024

WGL: నేటి నుంచి యథావిధిగా ప్యాసింజర్ రైళ్లు

image

అసిఫాబాద్ రోడ్డు నుంచి రేచిని రోడ్డు మధ్య జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనుల వల్ల తాత్కాలికంగా రద్దయిన ప్యాసింజరు రైళ్లను ఈనెల 8 నుంచి యథావిధిగా నడపనున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. 12757/58 కాగజ్‌నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌స్రెస్, 17233/34 భాగ్యనగర్ ఎక్స్‌స్రెస్, 17033/34 సింగరేణి ప్యాసింజర్ రైలు, 17003/04 రామగిరి, 07765/66 కరీంనగర్ పుష్పుల్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.

News July 8, 2024

హాస్టల్ భవనంపై నుంచి కిందపడిన విద్యార్థిని

image

సంగారెడ్డి జిల్లా రాయికోడు మండల పరిధిలోని అల్లాపూర్ శివారులో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల 10వ తరగతి విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి కిందపడింది. కాగా, సదరు విద్యార్థినిని 10వ తరగతి చదువుతున్న మల్లీశ్వరిగా గుర్తించారు. విద్యార్థినికి తీవ్రగాయాలు కావండంతో స్థానిక జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 8, 2024

WGL: పెళ్లి కావడం లేదని చనిపోయాడు..!

image

పెళ్లి కావడం లేదని ఓ యువకుడు చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారానికి చెందిన సి.బాబు(27), ఆయన అన్న రాజు HYD మియాపూర్‌లోని మెట్రో రైలు డిపోలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఇటీవల బాబు స్వగ్రామానికి వెళ్లి రాత్రి ఉరేసుకున్నాడు. పెళ్లి కావడం లేదని మనస్తాపంతో తన కొడుకు చనిపోయాడని అతడి తల్లి సరోజన PSలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు

News July 8, 2024

కృష్ణ జింకలకు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు

image

కృష్ణా నదీతీర ప్రాంతాల్లోని రైతులకు కృష్ణ జింకలతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. వందలాది కృష్ణ జింకలు పంట పొలాల్లోకి ప్రవేశించి, రైతులు విత్తిన విత్తనాలతోపాటు మొలకెత్తిన మొక్కలను తినేస్తున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కృష్ణా మండలం ముడుమాల్ సమీపంలో కృష్ణ జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.2.70 కోట్లు మంజూరు చేస్తూ, పరిపాలన అనుమతులు ఇచ్చింది.

News July 8, 2024

మిర్యాలగూడలో రైలు కింద పడి ఆటో డ్రైవర్ సూసైడ్ 

image

ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబ పోషణ భారమై ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై పవన్ కుమార్ రెడ్డి, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాద్రిపాలెం దుర్గా నగర్ కాలనీకి చెందిన నాగేంద్రబాబు(32) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆటోలు కొని ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక కుటుంబ పోషణ భారంగా మారి ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 8, 2024

గ్యాస్ బండ రాయితీకి తప్పని తిప్పలు

image

కొత్త సర్కారులో గ్యాస్ బండ రాయితీ వస్తుందని సంబరపడిన వినియోగదారులకు భంగపాటు తప్పడం లేదు. ఒక్కో గ్యాస్ బండకు వినియోగదారుడు సుమారు రూ.842 చెల్లిస్తున్నాడు. తర్వాత ఒకటి నుంచి ఐదు రోజుల్లో రూ.340 పైచిలుకు రాష్ట్ర ప్రభుత్వ రాయితీ సొమ్ము పడాలి. టెక్నికల్ ప్రాబ్లమ్ వలన కారేపల్లి, ఇల్లెందు తదితర మండలాల్లో అది జమకావడం లేదు. ఫలితంగా ఆయా వినియోగదారులు రాయితీ సొమ్మును కోల్పోవాల్సి వస్తోంది.

News July 8, 2024

డీఎస్సీ పరీక్ష గడువు పెంచండి.. భట్టికి వినతి

image

ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ పరీక్ష గడువు పెంచాలని ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయం నిరుద్యోగులు వినతిపత్రం అందజేశారు. మే నెలలో నిర్వహించిన టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించామని, డీఎస్సీకి కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉందని, చదువుకునేందుకు తగిన సమయం కేటాయించాలన్నారు. పరీక్షను మరో 3 నెలల అవకాశం ఇవ్వాలని నిరుద్యోగులు కోరారు.