Telangana

News July 8, 2024

మందమర్రి: బావిలో మృతదేహం కలకలం

image

మందమర్రి పట్టణంలోని దీపక్ నగర్ రైల్వే ట్రాక్ సమీపంలోని కోల్ యార్డు వద్ద బావిలో ఆదివారం యువకుని మృతదేహం గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజశేఖర్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. ఎస్సై మాట్లాడుతూ.. మృతుడు దీపక్ నగర్‌కు చెందిన సూరమల్ల ప్రణయ్(30)గా గుర్తించామని తెలిపారు. కొంత కాలంగా తాగుడుకు బానిసైన అతను బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.

News July 8, 2024

HYD: ఈ 3రోజులు వాహనాల పార్కింగ్ ఎక్కడంటే?

image

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా నేటి నుంచి 3రోజులపాటు పార్కింగ్ చేయాల్సిన ప్రాంతాలను అధికారులు తెలిపారు. SRనగర్ టీ జంక్షన్ సమీపంలోని R&B కార్యాలయంలో, ఫుడ్ వరల్డ్ ఎక్స్‌రోడ్ సమీపంలోని GHMC గ్రౌండ్‌లో, రోడ్డు సైడ్ పార్కింగ్, నేచర్ క్యూర్ హాస్పిటల్ పార్కింగ్ యార్డ్‌లో, ఫతేనగర్ రైల్వే వంతెన కింద మాత్రమే వాహనాల పార్కింగ్‌కు అనుమతించారు.

News July 8, 2024

HYD: ఈ 3రోజులు వాహనాల పార్కింగ్ ఎక్కడంటే?

image

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా నేటి నుంచి 3రోజులపాటు పార్కింగ్ చేయాల్సిన ప్రాంతాలను అధికారులు తెలిపారు. SRనగర్ టీ జంక్షన్ సమీపంలోని R&B కార్యాలయంలో, ఫుడ్ వరల్డ్ ఎక్స్‌రోడ్ సమీపంలోని GHMC గ్రౌండ్‌లో, రోడ్డు సైడ్ పార్కింగ్, నేచర్ క్యూర్ హాస్పిటల్ పార్కింగ్ యార్డ్‌లో, ఫతేనగర్ రైల్వే వంతెన కింద మాత్రమే వాహనాల పార్కింగ్‌కు అనుమతించారు.

News July 8, 2024

నల్గొండ: నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు

image

నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో విద్యుద్ఘాతంతో ప్రజలు, పశువుల ప్రాణాలు పోతున్నాయి. మేతకు వెళ్లిన పశువులు, పొలం పనికి వెళ్లిన రైతులు కరెంట్ కాటుకు బలైన ఘటనలో ఉమ్మడి జిల్లాలో కోకొల్లలు. కరెంట్ తీగలు కిందికి ఉండడం, కొన్నిచోట్ల కరెంటు తీగలు తెగిపడటంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఉమ్మడి జిల్లాలో జనవరి నుంచి జులై వరకు విద్యుద్ఘాతంతో 81 పశువులు మరణించగా, 31 మంది మనుషులు ప్రాణాలు కోల్పోయారు.

News July 8, 2024

పాల్వంచలో టిఫిన్ చేస్తుండగా గుండెపోటుతో మృతి

image

టిఫిన్ చేస్తున్న ఓ వ్యక్తికి గుండెపోటు రాగా
ఆస్పత్రికి తరలించే లోగా మృతి చెందాడు. పోలీసుల వివరాలిలా.. పాల్వంచలోని టీచర్స్ కాలనీకి చెందిన వెంకటలక్ష్మీనారాయణ ఆదివారం ఇంట్లో టిఫిన్ చేస్తూ ఒక్కసారిగా ఛాతీనొప్పితో కుప్పకూలాడు. అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై బి.రాము కేసు నమోదు చేశారు.

News July 8, 2024

‘స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి’

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఒకటి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల లేదా కళాశాలల్లో చదివే తండ్రి లేని అనాథ ముస్లిం విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జకాత్ చారిటబుల్ ట్రస్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28 కల్లా అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 98665 56876 నంబర్ను సంప్రదించాలన్నారు.

News July 8, 2024

HYD: బస్తీ దవాఖానాల్లో యూరిన్ టెస్టులు చేయట్లే..!

image

ఒకవైపు సీజనల్ వ్యాధులు పెరిగిపోతుంటే​ బస్తీ దవాఖానాల్లో అన్నిరకాల టెస్టులు చేయట్లేదనే రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 169 బస్తీ దవాఖానాలు ఉండగా.. యావరేజ్​గా ఒక దవాఖానకు 100 మంది పేషెంట్స్ వస్తున్నారు. మెజారిటీ బస్తీ దవాఖానాల్లో యూరిన్​ టెస్టులు చేయట్లేదు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని పలువురు పేషెంట్లు వాపోయారు.

News July 8, 2024

SI మృతికి ప్రభుత్వానిదే బాధ్యత: మాజీ MLA

image

పురుగు మందు తాగి భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట SI శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే. పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులతోనే SI శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. NSPTలో ఆదివారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, SI మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

News July 8, 2024

ఈ ఏడాది లక్ష్యానికి దూరంగా పత్తి సాగు

image

ఈ ఏడాది పత్తి సాగు లక్ష్యానికి
దూరంగా ఉంది. జిల్లాలో ప్రధాన పంటల్లో వరి తర్వాత స్థానం పత్తిదే. వరి 2.83 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, పత్తి 2.20 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. వ్యవసాయ శాఖ అధికారులు ఈ ఏడాది పత్తి సాగు అంచనాను 2,01,834 ఎకరాలకు తగ్గించారు. అయినా ఆ లక్ష్యం మేరకు కూడా నెరవేరడం ప్రశ్నార్థకంగానే మారింది. శనివారం నాటికి 1,81,794 ఎకరాల్లో మాత్రమే సాగైనట్టు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి.

News July 8, 2024

BREAKING.. జగిత్యాల జిల్లాలో హత్య

image

జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. మేడిపల్లి మండలం తొంబర్రావుపేటలో భార్యను చంపి భర్త పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఉపాధికోసం బహ్రెయిన్ వెళ్లి ఆదివారం ఇంటికి వచ్చిన భర్త లింగం.. అనుమానంతోనే భార్యను తలపై కొట్టి చంపేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.