Telangana

News July 8, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

✓ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం
✓ ఖమ్మం జిల్లాలో ఎంపీ రామ సహాయం పర్యటన
✓ సత్తుపల్లిలో మంత్రి తుమ్మల పర్యటన
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాజీ సీఎంYSR జయంతి
✓ పలు శాఖల పై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
✓అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన

News July 8, 2024

MBNR: ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం: మంత్రి

image

ఉమ్మడి జిల్లాకు MBNR- RRతోపాటు మిగతా అన్ని ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, MLAలతో కలిసి ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, పర్యాటక అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్‌పై చర్చించారు.

News July 8, 2024

నిజామాబాద్​ జిల్లాలో డేంజర్​ బెల్స్

image

NZB​ జిల్లాలో డెంగ్యూ డేంజర్​ బెల్స్​ మోగిస్తోంది. గత 6 నెలల నుంచి 134 కేసులు నమోదవ్వగా కేవలం జూన్‌లోనే మెడికల్​ ఆఫీసర్లు 9 కేసులు గుర్తించారు. వైరల్ ఫీవర్, డయేరియా, టైఫాయిడ్​ వ్యాధులు ప్రజలను కుదిపేస్తున్నాయి. సర్కారు ఆస్పత్రుల్లో జూన్​ నుంచి డయేరియా 263,37, టైఫాయిడ్​, 467 వైరల్​ ఫీవర్​ కేసులను గుర్తించి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. దీంతో అంగన్​వాడీ, ఆశావర్కర్లను స్థానిక అధికారులను అలర్ట్ చేసింది.

News July 8, 2024

HYD: నేటి నుంచి 3 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

image

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా నేటి నుంచి 3 రోజులపాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. గ్రీన్ ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వెళ్లే వాహనాలను ఎస్ఆర్ నగర్ టీ-జంక్షన్ నుంచి అభిలాష టవర్స్, బీకేగూడ ఎక్స్ రోడ్డు, శ్రీరామ్ ‌నగర్ క్రాస్ రోడ్డు, సనత్ ‌నగర్ మీదుగా ఫతేనగర్ రోడ్డు వైపు డైవర్ట్ చేస్తారు. వాహనదారులు సహకరించాలని అధికారులు కోరారు.

News July 8, 2024

HYD: నేటి నుంచి 3 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

image

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా నేటి నుంచి 3రోజులపాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. గ్రీన్ ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వెళ్లే వాహనాలను ఎస్ఆర్ నగర్ టీ-జంక్షన్ నుంచి అభిలాష టవర్స్, బీకేగూడ ఎక్స్ రోడ్డు, శ్రీరామ్ ‌నగర్ క్రాస్ రోడ్డు, సనత్ ‌నగర్ మీదుగా ఫతేనగర్ రోడ్డు వైపు డైవర్ట్ చేస్తారు. వాహనదారులు సహకరించాలని అధికారులు కోరారు.

News July 8, 2024

MBNR: నేటి నుంచి ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం-2024 కింద ఉపకార వేతనాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఇన్చార్జి అధికారి ఆర్.ఇందిర తెలిపారు. www.telanganaepass.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో నేటి నుంచి ఆగస్టు 7లోగా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుకు సంబంధించిన హార్డ్ కాపీలను కలెక్టరేట్లోని మైనార్టీ కార్యాలయంలో అందజేయాలన్నారు.

News July 8, 2024

ADB: ఆదివాసీ గ్రామాల్లో సంబురాలు

image

ఆదివాసీలు ప్రతి ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే అకాడి వేడుకలను నిన్న భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్, తిర్యాణి పలు మండలాల్లోని ఆదివాసీలు అడవీకి వెళ్లి వన దైవానికి మహాపూజ చేశారు. మక్క ఘట్కతో తయారు చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పించారు. ఊర్లోని ఆవులన్నింటినీ అడవీలో ఊరేగించారు. గ్రామస్థులంతా ఒకచోట చేరి సామూహిక వనభోజనాలు చేశారు. ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి.

News July 8, 2024

ఓడిపోయి ప్రశాంతంగా ఉన్నా: జగ్గారెడ్డి

image

సంగారెడ్డిలో MLAగా ఓడిపోయి ప్రశాంతంగా ఉన్నానని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి జన్మదినోత్సవం సంద్భంగా నిర్వహించిన ర్యాలీలలో ఈ వాఖ్యలు చేశారు. ప్రజలు ఓడగొట్టామని ఫీల్ కావద్దని, తాను మనస్పూర్తిగా, దైవసాక్షిగా ప్రశాంతంగా ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అభివృద్ది విషయంలో జవాబుదారీగా ఉంటానన్నారు. ప్రజలకు ఏమేమి కావాలో చేసిపెడతానని హామీ ఇచ్చారు.

News July 8, 2024

JMKT: నేటి నుంచి యథావిధిగా ప్యాసింజర్ రైళ్లు

image

అసిఫాబాద్ రోడ్ నుంచి రేచిని రోడ్ మధ్య జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనుల వల్ల తాత్కాలికంగా రద్దయిన ప్యాసింజర్ రైళ్లను నేటి నుంచి యథావిధిగా నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. 12757/58 కాగజ్‌నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 12733/34 భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, 17033/34 సింగరేణి ప్యాసింజర్ రైలు,17003/04 రామగిరి, 07765/66 కరీంనగర్ పుష్‌పుల్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.

News July 8, 2024

ఖమ్మం: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో తండ్రీకొడుకులు క్వాలిఫై

image

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌‌లో తండ్రీకొడుకులు అర్హత సాధించారు. దాసరి రవికిరణ్‌ ముచ్చర్ల-జాస్తిపల్లి ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తనయుడు ఇమ్మానియేలు (25) డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 53 ఏళ్ల వయస్సులో రవికిరణ్‌ తనయుడికి సూచనలు ఇవ్వడంతోపాటు తానూ పరీక్ష రాశారు. రిజర్వేషన్, ఇన్‌ సర్వీసు కోటాలో వయో మినహాయింపు ఉండటంతో పరీక్ష రాయగలిగినట్టు వివరించారు.