Telangana

News July 8, 2024

నేడు వరంగల్ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం

image

నేడు వరంగల్ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు ప్రజావాణిలో పాల్గొనాలని కోరారు.

News July 8, 2024

వేములవాడ టూ అరుణాచలం ప్రత్యేక బస్సు

image

వేములవాడ టూ అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించినట్లు RTC ఆర్ఎం తెలిపారు. వేములవాడ రాజన్న సన్నిధి నుంచి తమిళనాడులోని అరుణాచలం దివ్యక్షేత్రానికి స్పెషల్ బస్సు వేసినట్లు కరీంనగర్ రీజనల్ ఆర్టీసీ మేనేజర్ సుచరిత పేర్కొన్నారు. ఈనెల 19న రాత్రి 8 గంటలకు వేములవాడ నుంచి ఈ బస్సు బయలుదేరుతుంది. KNR మీదుగా వెళ్లి ఈనెల 20న రాత్రి 8 గంటలకు అరుణాచలానికి చేరుకొని.. తిరిగి 22న KNRకు చేరుకుంటుందన్నారు.

News July 8, 2024

MBNR: 9న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

image

మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో సీఎం పాల్గొంటారు. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎమ్మెల్యేలతో పాటు అన్ని శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

News July 8, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

➤ఉమ్మడి జిల్లా అధికారులు, MLAలతో మంత్రి సమీక్ష
➤కొయిలకొండ: యాక్సిడెంట్‌‌లో అన్నదమ్ములు మృతి
➤జడ్చర్ల: ఆలయ కోనేరు పూడ్చివేతపై డీకే అరుణ ఫైర్
➤నిరంజన్ రెడ్డిపై మధుసూదన్ రెడ్డి ఫైర్
➤జిల్లా వ్యాప్తంగా MRPS ఆవిర్భావ వేడుకలు
➤అమనగల్లు ఎస్సై బదిలీ
➤బల్మూరు: ఫొటో గ్రాఫర్ ఆత్మహత్య
➤తిమ్మాజిపేట: కట్నం కోసం వేధింపులు.. భర్తపై కేసు

News July 8, 2024

మౌలిక సౌకర్యాల కల్పనే ద్వేయం: మంత్రి రాజనర్సింహ

image

ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ కళాశాలు, ఆసుపత్రులలో మౌలిక సౌకర్యాలు మెరుగుపరుస్తూ అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి మ్యాప్‌ను ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. సామాన్యుడు మెచ్చే విధంగా సర్కారు దవాఖానాలను తీర్చిదిద్దేందుకు సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు.

News July 8, 2024

NZB: కనిపించిన నెలవంక.. మొహర్రం ప్రారంభం

image

ఆదివారం రాత్రి నెల వంక దర్శనమివ్వడంతో ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభానికి గుర్తు. దీన్నే మొహర్రం అని పరిగణిస్తారు. ఈ మాసంలో పీర్ల పండుగ కూడా ప్రారంభమవుతుంది. నెల వంక స్పష్టంగా కనిపించిన ఐదో రోజు పీర్లను ప్రతిష్ఠిస్తారు. ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో 10 రోజులు మాత్రమే పీర్ల పండగను జరుపుకోగా, కామారెడ్డి జిల్లా పిట్లంలో 20 రోజుల పాటు జరుపుకుంటారు.

News July 8, 2024

ADB ఉపాధ్యాయుడిని అభినందించిన మాజీ ఉపరాష్ట్రపతి 

image

గోండి భాషలో మహాభారత కథ రాసిన ADB జిల్లా వాఘాపూర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. కైలాస్ చేసిన ప్రయత్నం గురించి తెలిసి ఆనందించాను. మహాభారతాన్ని గోండి భాషలోకి అనువదించి ‘పండోక్న మహాభారత కథ’ పేరిట పుస్తకంగా తీసుకొచ్చిన ప్రయత్నం అభినందనీయమైనది. ఇంతటితో ఆగిపోకుండా భవిష్యత్ తరాలు, పెద్దల స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని X వేదికగా రాసుకొచ్చారు.

News July 8, 2024

KNR: డీఎస్సీ పరీక్షలపై టీ-శాట్ అవగాహన కార్యక్రమాలు

image

ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 8 నుంచి 11 వరకు టీ-శాట్ ప్రత్యక్ష ప్రసారాలు చేయనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రసారమవుతాయన్నారు. జూలై 8న ఇంగ్లీషుపై, జూలై 9న సైన్స్, జూలై 10న గణితంపై, జూలై 11న తెలుగు, హిందీ, ఉర్దూ సబ్జెక్టుపై ప్రత్యక్ష ప్రసారాలు చేస్తామని టీ-శాట్ సీఈవో తెలిపారు.

News July 8, 2024

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలిసిన మంత్రి తుమ్మల

image

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడుని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి తుమ్మల వెంట ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

News July 8, 2024

WGL: డీఎస్సీ పరీక్షలపై టీ-శాట్ అవగాహన కార్యక్రమాలు

image

ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 8 నుంచి 11 వరకు టీ-శాట్ ప్రత్యక్ష ప్రసారాలు చేయనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రసారమవుతాయన్నారు. జూలై 8న ఇంగ్లీషుపై, జూలై 9న సైన్స్, జూలై 10న గణితంపై, జూలై 11న తెలుగు, హిందీ, ఉర్దూ సబ్జెక్టుపై ప్రత్యక్ష ప్రసారాలు చేస్తామని టీ-శాట్ సీఈవో తెలిపారు.