Telangana

News July 7, 2024

కరీంనగర్: డ్రమ్ సీడర్‌తో ఒకేరోజు 8 ఎకరాలు వరినాటు

image

ఆధునికసాగుతో కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన చిగుర్లు ఆశాలు ఒకేరోజు 8 ఎకరాల్లో వరినాటు వేశాడు. ఆశాలు డ్రమ్ సీడర్ తో 8ఎకరాలు సాగుచేయడం వల్ల సమయంతో పాటు, కూలీల ఖర్చులు ఆదా అయ్యిందని తెలిపారు. 8ఎకరాలకు తనకు రూ.2400 మాత్రమే ఖర్చయినట్లు తెలిపాడు.

News July 7, 2024

ఉత్తరాఖండ్‌లోనే ఆ ఇద్దరి అంత్యక్రియలు..! 

image

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని అద్దెకు తీసుకున్న బైకులపై తిరిగి వస్తున్న ఇద్దరు HYD యాత్రికులపై కొండ చరియలు విరిగిపడడంతో చనిపోయిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ పద్మారావునగర్‌కు చెందిన సత్యనారాయణ(50), నిర్మల్ షాహి(36)తోపాటు మరో ఇద్దరు నార్త్ ఇండియా టూర్‌కి వెళ్లారు. ప్రమాదంలో వారి మృతదేహాలు బాగా డామేజ్ కావడం, ఓ వ్యక్తి తల కూడా దొరకకపోవడంతో అక్కడే అంత్యక్రియలు చేశారని తెలిసింది. 

MBNR: ఉరేసుకుని ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య

image

ఫొటోగ్రాఫర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బల్మూరు మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. పోలిశెట్టిపల్లి శివారు ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండల కేంద్రానికి చెందిన దుడ్డు యాదగిరి(38) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. పొలం యజమాని అందించిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News July 7, 2024

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు

image

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇంటర్ విద్యార్హతతో ఉద్యోగాలు ఉన్నాయని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జులై 3, 2004 – జనవరి 03, 2008 మధ్య జన్మించిన అవివాహిత మహిళా, పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మరిన్ని వివరాల కోసం https://agnipathvayu.cdac.inలో సంప్రదించాలని సూచించారు.

News July 7, 2024

ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన

image

HYD ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్మల నృత్యనికేతన్ గురువు విజయలక్ష్మీ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక స్తోత్రం, అన్నమాచార్య కృతి, రామదాసు కృతి, సరస్వతి కీర్తన, తరంగం, పురందరదాసు కీర్తన, జయదేవ అష్టపది, పదం, మంగళ హారతి అంశాల్లో  నృత్యం చేశారు. కార్యక్రమంలో హిమశ్రీ, కావ్య, రోషిత, తన్మయి, తన్విత, కీర్తియుక, శ్రీనిధి, సంజన ఉన్నారు.

గ్రూప్ -1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన తండ్రి, కొడుకులు

image

ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో తండ్రి, కొడుకులు అర్హత సాధించారు. ఖమ్మం పట్టణానికి చెందిన దాసరి రవి కిరణ్, ఆయన కుమారుడు మైకేల్ ఇమ్మానుయేల్ ఇద్దరూ గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యారు. రవి కిరణ్ కామేపల్లిలోని ఎంజేపల్లిలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. 53 ఏళ్ల వయసులోనూ రవికిరణ్ గ్రూప్ -1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించడంతో యువతకు మార్గదర్శకుడిగా నిలిచారు.

News July 7, 2024

డీ. శ్రీనివాస్‌కు ఎంపీ డీకే అరుణ నివాళి

image

ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి, దివంగత డీ. శ్రీనివాస్ స్మృతి సభలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

News July 7, 2024

అరుణాచల గిరి దేవస్థానానికి వరంగల్ నుంచి స్పెషల్ బస్సులు

image

హనుమకొండ: అరుణాచల గిరి దేవస్థాన దర్శనానికి వెళ్లే భక్తులకి వరంగల్ వన్ డిపో నుంచి స్పెషల్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ విజయ భాను ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జులై 19న ఒక బస్సు బయలుదేరుతుందని, జులై 21న మధ్యాహ్నం మరో బస్సు బయలుదేరుతున్నట్లు ఆర్ఎం తెలిపారు. మరిన్ని వివరాల కోసం 98663 73825 నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.